Bigg Boss: 3 నెలలైనా అందని ప్రైజ్‌మనీ.. బిగ్‌బాస్ విన్నర్ ఎమోషనల్ పోస్ట్

ఇండియాలో బగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 105 రోజుల పాటు విభిన్న మనస్తత్వాలు ఉన్న వారిని ఒకే గదిలో ఉంచి వారితో ఆటలు ఆడిస్తూ.. డిస్కషన్స్ పెట్టేస్తూ.. ఎవరి మెంటల్ కెపాసిటీ ఎంటో? ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో బయటపెట్టే బిగ్‌బాస్‌ షోకు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ మెగా రియాలిటీ షో.. ఆ తర్వాత ప్రాంతీయ భాషలకు పాకింది. అన్ని చోట్లా భారీ టీఆర్పీలతో బిగ్‌బాస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు కూడా జనంలో అంతే క్రేజ్ దొరుకుతోంది. అలాగే బిగ్‌బాస్‌లో పాల్గొన్నందుకు భారీగా ప్రైజ్‌మనీలు అందుకుంటున్నారు. సాధారణ కంటెస్టెంట్స్‌కే ఇలా ఉంటే ఏకంగా బిగ్‌బాస్ విజేతగా నిలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తనకు రావాల్సిన ప్రైజ్‌‌మనీ దక్కకపోవడంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Hindi 19 Winner Gaurav Khanna Says He Hasn t Received Prize Money Yet

బిగ్‌బాస్ హిందీలో ఎంతటి పాపులరో తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్ కారణంగా దీనికి మరింత క్రేజ్ వచ్చింది. తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ బిగ్‌బాస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు సల్లూ భాయ్. సల్మాన్ అంటే బిగ్‌బాస్.. బిగ్‌బాస్ అంటే సల్మాన్ ఖాన్ అన్నంతగా ఆయన ముద్రవేశారు. ఎప్పటిలాగే గతేడాది కూడా బిగ్‌బాస్ హిందీ సీజన్ ప్రారంభమై... ప్రేక్షకులకు ఆనందాన్ని అందించి ముగిసింది. ఆగస్ట్ 24న ముగిసిన ఈ మెగా రియాలిటీ షో.. డిసెంబర్ 7 ముగిసింది.

బిగ్‌బాస్ హిందీ 19లో 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. గౌరవ్ ఖన్నా, ఫర్హానా, ప్రణీత్, తాన్య, అమాల్, మాల్టీ, షెహబాజ్, అష్నూర్, కునిక, మృదుల్, నీలం, బషీర్, నేహాల్, జీషాన్, అవాజ్, నగ్మా, నటాలియాలు కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 106 రోజుల పాటు సాగిన ఈ బిగ్‌బాస్ హిందీ 19లో గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచారు. ఫర్హానా ఫస్ట్ రన్నరప్‌గా, ప్రణీత్ సెకండ్ రన్నరప్‌గా, తాన్యా థర్డ్ రన్నరప్‌గా, అమాల్ ఫోర్త్ రన్నరప్‌గా నిలిచారు. వివాదాలు, విమర్శలు, సంచలనాలను దాటుకుంటూ ఎట్టకేలకు ఈ సీజన్ ముగిసింది.

గౌరవ్‌కు అనుపమ, సీఐడీ సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. గతంలో మాస్టర్ చెఫ్ షోలోనూ 12 మందిని ఓడించి టైటిల్ గెలుచుకున్న ఆయన.. బిగ్‌బాస్ విజేతగా నిలిచి రియాలిటీ షోలలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్నందుకు గాను గౌరవ్ ఖన్నాకు వారానికి 17.5 లక్షల రూపాయలు చొప్పున 15 వారాలకు గాను 2.62 కోట్ల రూపాయల్ని పారితోషికంగా అందుకున్నాడు. ఇక బిగ్‌బాస్ విజేతగా ప్రైజ్‌మనీ కింద మరో 50 లక్షల రూపాయలు దక్కించుకున్నాడు. మొత్తంగా బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా ఆయనకు 3.12 కోట్ల రూపాయలు అందింది.

అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తనకు బిగ్‌బాస్ నుంచి ప్రైజ్‌మనీ అందలేదని బాంబు పేల్చాడు గౌరవ్ ఖన్నా. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. బిగ్‌బాస్ షోలో ప్రకటించిన కారు, ప్రైజ్‌మనీ ఇవన్నీ నాకు అందడానికి టైం పడుతుంది. దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. ఇలాంటి ఆలస్యం సహజమే. కానీ నాకు రావాల్సినవి.. ఖచ్చితంగా అందజేస్తారు. ఇందుకోసం మరో 2 నెలలు పడుతుందని గౌరవ్ ఖన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X