రూమర్స్ ఎక్కువయ్యేలా లవర్స్‌గా మారిపోయిన తేజస్వి, సామ్రాట్.. ప్రేమని ఒప్పుకుంటే అన్నీ మానేస్తా!
Recommended Video

క్రమంగా బిగ్ బాస్ హౌస్ లో మసాలా ఎక్కువవుతోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రెండవ సీజన్ ఆడియన్స్ కు కావలసినంత వినోదాన్ని పంచుతోంది. ఎపిసోడ్స్ గడిచే కొద్ది కొత్త కొత్త టాస్క్ లతో కంటెస్టెంట్స్ అలరిస్తున్నారు. అప్పుడప్పుడూ హౌస్ లోపల ఘాటు పదాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నేడు జరగబోయే ఎపిసోడ్ కోసం ఎంటర్ టైన్ చేసే మసాలా అంశంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

టాస్క్ లు అదిరిపోతున్నాయి
హౌస్ లోని సభ్యులకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు అదిరిపోతున్నాయి. సభ్యలంతా ఆడియన్స్ వద్ద మార్కులు కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే హౌస్ నుంచి సంజన, నూతన్ నాయుడు, కిరీటి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

నెక్స్ట్ ఎవరో
బిగ్ బాస్ లో ప్రస్తుతం అందరి పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. కానీ ఆడియన్స్ ఎవరివైపు నిలబడితే వారు ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. వచ్చే వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారో వేచి చూడాలి.

లవర్స్ అడ్డా
నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో ఆసక్తిని పెంచేసింది. బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ నేడు హాస్టల్ గా మారిపోనుంది. వార్డెన్ కళ్లుగప్పి ప్రేమలో మునిగితేలే జంటలుగా సభ్యులు కనిపించబోతున్నారు.

ప్రేమ జంటలు
ఈ టాస్క్ లో ప్రేమికులుగా హౌస్ మేట్స్ విహరిస్తున్నారు. దీప్తి, కౌశల్ ఒక ప్రేమ జంట కాగా.. తేజస్వి, సామ్రాట్ మరో ప్రేమ జంటగా కనిపించబోతున్నారు. రోల్ రైడ, దీప్తి సునైనా ప్రేమికులుగా అలరించబోతున్నారు.

నన్ను మరచిపోవద్దు
ఈ నేపథ్యంలో లవర్స్ మధ్య సంభాషణ ఆసక్తికరంగా ఉంది. నన్ను మరచిపోవద్దు అని దీప్తి అంటే, నువ్వే నా జీవితం అని కౌశల్ అంటున్నాడు.

రూమర్స్ నిజం చేసేలా
బిగ్ బాస్ హౌస్ లో తేజస్వి, సామ్రాట్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లుగానే ఈ టాస్క్ లో తేజస్వి, సామ్రాట్ లవర్స్ గా కనిపిస్తున్నారు. నువ్వు చాలా అందంగా ఉంటావు అని సామ్రాట్ అంటాడు. నువ్వు కూడా అని తేజస్వి సిగ్గుపడుతూ చెబుతుంది.
అన్నీ మానేస్తా
ప్రోమో చివర్లో అమిత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నువ్వు నా ప్రేమని అంగీకరిస్తే రౌడీయిజం, గుండాయిజం అన్ని మానేస్తా అని అంటాడు. కానీ వీరి ప్రేమని అడ్డుకునేలా హాస్టల్ వార్డెన్ వ్యవహరిస్తుంటారు. బాబు గోగినేని హాస్టల్ వార్డెన్ లా కనిపిస్తున్నాడు. మరో వార్డెన్ ఎవరనే సంగతి నేటి ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి.


Click it and Unblock the Notifications











