సామాన్యుడిగా వెళ్ళా.. సామాన్యుడిగా వచ్చా, నాని అన్న చెప్పాకే తెలిసింది.. గణేష్!
Recommended Video

సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన గణేష్ గత వారం షో నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సెలేబ్రిటిగా షో నుంచి తిరిగి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలని గణేష్ ఓ ఇంటర్వ్యూ లో వివరించాడు. గణేష్ షోలో ఎక్కువగా నామినేట్ అవుతూ ఎలిమినేషన్ నుంచి బయటపడుతూ వచ్చాడు. బిగ్ బాస్ అభిమానులకు గణేష్ బాగా గుర్తుండి పోతాడు అని చెప్పడంలో సందేహం లేదు.

సామాన్యుడిగానే
తాను హౌస్ లోకి సామాన్యుడిగానే వెళ్ళా.. సామాన్యుడిగానే తిరిగి వచ్చా అని గణేష్ తెలిపాడు. అందరికి తెలిసినంత మాత్రాన సెలెబ్రిటీని అయిపోలేదని అన్నాడు. బిగ్ బాస్ లోకి తనకు ఎలా అవకాశం వచ్చిందో గణేష్ వివరించాడు.

స్నేహితులే
తనని బిగ్ బాస్ షోకు అప్లై చేసేలా ప్రోత్సహించింది తన స్నేహితులే అని గణేష్ తెలిపాడు. బిగ్ బాస్ షో కు లక్షల్లో అప్లై చేస్తారు. మనం ఎందుకు సెలెక్ట్ అవుతాం అని అనుకున్నా. చివరి నిమిషంలో రేడియో జాకిలా మాట్లాడుతూ వీడియో పంపా. అంతే సెలెక్ట్ అయిపోయా అని గణేష్ తెలిపాడు.

మొదటి మూడు వారాలు
అందరి సెలెబ్రిటీల మధ్య మొదటి మూడు వారాలు నాకేమి అర్థం కాలేదు. అందువలనే అందరిలో కలసిపోలేకపోయా అని గణేష్ తెలిపాడు. ఆ తరువాత నెమ్మదిగా అందరితో స్నేహం ఎరిగిందని వివరించాడు.

నాని అన్న
మొదటి మూడు వారాలు ఆ తరువాత కూడా బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్క్ లలో పాల్గొంటూ వచ్చా. కానీ నాన్ని అన్న ఒకసారి హెచ్చరించాడు. నువ్వు ఎక్కడా కనిపించడం లేదు అని. అప్పుడు అర్థం అయింది. టాస్క్ లలో మాత్రమే కాదు మిగిలిన సమయం కూడా యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నా అని గణేష్ తెలిపాడు.

చెరకు రసం
బిగ్ బాస్ హౌస్ లో తనకు బాగా గుర్తిండి పోయిన టాస్క్ చెరుకురసం టాస్క్ అని గణేష్ తెలిపాడు. చివరగా చేసిన డిటెక్టివ్ టాస్క్ కూడా గుర్తుంది పోతుందని తెలిపాడు.

భాను ఉంటే
ప్రస్తుతం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిలో భాను శ్రీ ఉండి ఉంటె బావుండేదని గణేష్ తెలిపాడు. తాను హౌస్ లో టాప్ 5 లో ఉండాలని ప్రయత్నించానని కానీ కుదరలేదని తెలిపాడు. గత రెండు వారాలుగా ప్రదర్శించిన జోరు ముందు నుంచి ఉండి ఉంటె తప్పకుండా టాప్ 5 లో ఉండేవాడినని గణేష్ తెలిపాడు.

ఫ్యూచర్ ప్లాన్
ప్రస్తుతం జాబ్ చేస్తున్నానని తెలిపాడు. సినిమా అవకాశాలు వస్తే నటించాలని ఉందని గణేష్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











