నాలో అలాంటి లోపాలు.. అయినా నేను ఎవ్వరికీ భయపడను.. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా

బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ఇనయ సుల్తానా (Inaya Sultana). వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు. ఈ సమయంలో బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం అందుకుంది. తన ఆటతీరు, వ్యక్తిగతంతో ద్వారా పాపులర్ అయ్యింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులతో ట్రెండింగ్‌లో ఉంటోంది. తాజాగా తాను ఎదుర్కొన్న ఇన్‌సెక్యూరిటీస్ గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల ఇనయ సుల్తానా కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీశాయి. తన జీవితంలో ఎదుర్కొన్న ఇన్‌సెక్యూరిటీస్ గురించి ఓపెన్‌గా మాట్లాడిన ఇనాయా, ముఖ్యంగా తన వాయిస్‌పై ట్రోల్స్‌ను ప్రస్తావించడం చాలా ఆసక్తికరంగా మారింది. సినిమా రంగంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో ఆమెకు, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా, రియాలిటీ షో మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి షేర్ చేసిన పోస్ట్‌లు గతంలో తీవ్ర విమర్శలకు దారితీసినా, "తగ్గేదేలే" అన్నట్టుగా ఆమె తన స్టైల్‌ను మార్చుకోకుండా కొనసాగుతోంది. అయినా, సినిమా అవకాశాల విషయంలో మాత్రం ఇంకా ఎదురు చూపులు కొనసాగుతున్నాయి.

Bigg Boss Inaya Sultana Breaks Silence on Voice Trolls Opens Up About Insecurities

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాల వేడుకను ఘనంగా నిర్వహించింది. పలువురు సినీ తారలు ఈ వేడుకలో ఆకర్షణగా నిలించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ బ్యూటీ ఇనాయా సుల్తానా కో - యాంకర్ గా వ్యవహరించారు. ఈ సమయంలో తన వాయిస్‌పై వచ్చిన ట్రోల్స్ గురించి ఆమె చెప్పిన మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె వాయిస్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో ఆమెను మానసికంగా ప్రభావితం చేసినట్లు తెలిసింది. అయితే, ఈసారి ఆమె ఆ విమర్శలను తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఓ వీడియోలో మాట్లాడుతూ.. ట్రోలర్లకు ఇచ్చిపడేసింది.

ఇనాయ మాట్లాడుతూ.. "నాకు చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా నా వాయిస్ గురించి నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని. అందుకే ఎక్కువ మందిముందు మాట్లాడటానికి భయపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయాన్ని దాటుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను" అని అన్నారు. గద్దర్ అవార్డ్స్ హోస్టింగ్ సమయంలో వచ్చిన నెగటివ్ కామెంట్స్ తనకు ఒక రియాలిటీ చెక్ లా అనిపించాయని, కానీ ఇకపై వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతానని చెప్పింది.

'ఎవరైనా నా వాయిస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నేను వినడానికి రెడీగా ఉన్నాను. నాలో అలాంటి లోపాలు.. అయినా నేను ఎవ్వరికీ భయపడను. నేను ఎలా ఉన్నానో అలా మాట్లాడతాను' అంటూ తన స్ట్రాంగ్ స్టాండ్‌ను వ్యక్తపరిచింది. అంతేకాకుండా, తనలాంటి వారందరికీ ఒక మోటివేషనల్ మెసేజ్ కూడా ఇచ్చింది. 'ఇది మీ జీవితం.. మీరు చేయాలనుకున్నది చేసుకోండి. ఎవరేమన్నా పట్టించుకోకండి. జనాలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. కానీ మీరు మాత్రం ఆగకండి" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇనాయా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తే, మరికొందరు మళ్లీ విమర్శలు చేస్తున్నారు. అయితే, విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని, తన లోపాలను అంగీకరించి ముందుకు సాగాలనే ఆమె నిర్ణయం చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారుతోందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X