Inaya Sultana: సోహైల్ కోసం ఆ పని చేసిన ఇనయా సుల్తానా.. మళ్లీ మొదలైన లవ్ ట్రాక్
బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతోమందికి పేరు తీసుకొచ్చింది. లైమ్ లైట్ లో లేని సెలబ్రిటీలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగేలా చేసింది. అలాగే సినీ అవకాలు లేని వారికి బిగ్ బాస్ షో మంచి వేదికగా మారింది. అలా బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుని హీరోగా మారాడు సయ్యద్ సోహెల్ ర్యాన్.
బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి అడుగుపెట్టిన బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే తాజాగా సోహైల్ కోసం ఇనయా సుల్తానా చేసిన ఓ పని వివిధ రూమర్లకు దారి తీస్తుంది.

ఆర్జీవీతో డ్యాన్స్: గతేడాది సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి మొత్తంగా 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఇనయాకు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా ఫేమ్ వచ్చింది. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా సుల్తానా కలిసి డ్యాన్స్ చేసింది. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని విపరీతంగా తెలుసుకోవడం మొదలు పెట్టారు.

గుర్తింపు తీసుకురాని చిత్రాలు: ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయా. ఏవమ్ జగత్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా తర్వాత సునీల్ నటించిన బుజ్జీ ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి చిత్రాల్లో నటించింది. అయితే అవేవి గుర్తింపును తీసుకురాలేదు. ఆర్జీవీ ద్వారా పాపులర్ కావడంతో బిగ్ బాస్ కి అవకాశం లభించింది.

ఆర్జే సూర్యతో: బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది ఇనయా. కానీ ఈ సీజన్ లో అనూహ్యంగా 14వ వారం జరిగిన ఎలిమినేషన్ లో ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయి హౌజ్ ను వీడింది. అయితే హౌజ్ లో ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడిపించిన ఈ భామ బయటకొచ్చిన తర్వాత బిగ్ బాస్ 4 సీజన్ ఫేమ్ సయ్యద్ సోహైల్ కు ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచింది.

వరుస సినిమాలు: ఇది పక్కన పెడితే అటు సోహైల్, ఇటు ఇనయా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఓటీటీలోకి క్రాంతి సినిమాతో ముందుకు వచ్చింది ఇనయా సుల్తానా. మరోవైపు సోహైల్ లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. ఇప్పుడు తాజాగా బూట్‌కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సిగ్గు పడుతూ వీడియో: అయితే బూట్‌కట్ బాలరాజు సినిమా నుంచి బాలరాజు.. రాజు బంగారి రాజు అనే సాంగ్ విడుదలై ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా ఈ పాటకు చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ పాటకు స్టెప్పులేస్తూ రీల్స్ చేసింది ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా. బ్లూ కలర్ జాకెట్, బ్లాక్ సారీ కట్టుకుని సిగ్గు పడుతూ బ్యూటిఫుల్ స్టెప్పులేసింది ఈ భామ. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది.

బీబీ జోడీలో విన్నర్: ఇనయా సుల్తానా వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'ఇంకా ఇనయా రాలేదేంటి అనుకున్నాం', 'సోహైల్ కోసమే కదా', 'ఈ డ్యాన్స్ ఏదో బీబీ జోడీలో చేసి ఉంటే విన్నర్ అయ్యేదానివి' అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది వరకు సోహైల్ కోసమే బిగ్ బాస్ లోకి వచ్చానని ఇనయా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియోతో ఆమె లవ్ ట్రాక్ గురించి చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











