ఎద అందాలతో రెచ్చిపోయిన ఇనయా సుల్తానా.. అక్కడే ఫోకస్ అయ్యేలా చూపిస్తూ!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయిలు ఎంతోమంది. అలాంటి వారిలో ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా ఒకరు. పుట్టిన రోజు వేడుకల్లో ఆర్జీవీ ద్వారా ప్రపంచానికి తెలిసిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి అడుగు పెట్టి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తాను కన్న కలను నేరవేర్చుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ గా ఫొటోలు పెడుతూ మరింతగా అట్రాక్ట్ చేస్తోంది ఈ సుందరి.


ఆర్జీవితో డ్యాన్స్ : 2022లో సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఇనయాకు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా తెగ పాపులారిటీ వచ్చేసింది. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా సుల్తానా కలిసి డ్యాన్స్ చేయడంతోపాటు హాట్ గా ఫొటోలకు పోజులు ఇచ్చింది.

 Inaya Sultana

ఇంటి నుంచి పారిపోయి: రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన ఈ ఇనయా సుల్తానా ఎవరా అని నెటిజన్లు వెతకడం మొదలు పెట్టేశారు. దీంతో ఆమె తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయ సుల్తానా. సినిమాలపై ఇష్టంతో నగరి నుంచి పారిపోయి వచ్చిన ఇనయా సినీ ఇండస్ట్రీలో ఒంటరి ప్రయాణం చేసింది.

వరుసగా చిత్రాలు : హైదరాబాద్ కు వచ్చిన బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత దర్శకనిర్మాతలు ఆకర్షించిన ఈ బ్యూటి పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే మొదటగా ఏవమ్ జగత్ అనే సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సునీల్ బుజ్జీ ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి చిత్రాల్లో నటించింది.

గట్టి పోటినిచ్చి : అయితే తెలుగులో ఇనయా సుల్తానా నటించిన ఓ ఒక్క సినిమా కూడా ఆమెకు ఆశించినంత స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో దిగిన ఫొటోల కారణంగా ఫేమ్ వచ్చింది. ఫలితంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇందులో తన దైన ఆట తీరుతో మేల్ కంటెస్టెంట్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. లేడీ టైగర్ అనిపించుకుంది.

 Inaya Sultana

సోహైల్ కు ప్రపోజ్ : బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ సింగర్ రేవంత్ కు సైతం స్ట్రాంగ్ పోటీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. కానీ అభిమానులను మాత్రం భారీగా సంపాదించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక లక్కీ లక్ష్మణ్ హీరో, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ కు ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది. తర్వాత బీబీ జోడీలో కొద్ది రోజులు మాత్రమే మెరిసి అలరించింది.

అందాల విందు: ఇటీవలే క్రాంతి అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది ఇనయా సుల్తానా. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ హాట్ పిక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి. తాజాగా కిందకు జారుతున్నటువంటి కలర్ ఫుల్ డ్రెస్సులో ఘాటుగా ఎద అందాల విందు చేసింది. డిఫరెంట్ యాంగిల్స్ లో క్లీవేజ్ పైనే ఫొకస్ అయ్యేలా పోజులిచ్చింది. దీంతో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X