Bigg Boss Telugu 7: ఎలిమినేషన్ జోన్‌లో ముద్దు బిడ్డ... మళ్లీ సేవ్ చేసేందుకు బిగ్ బాస్ కొత్త ప్లాన్
బిగ్ బాస్ తెలుగు 7 మరో రెండు వారాల్లో ముగియనుంది. ఇక ప్రస్తుతం 13వ వారం ఆట చివరకు వచ్చింది. నామినేషన్స్ లో ఈ వారం 7 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో టాప్ లో శివాజీ, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఈ వారం మరోసారి బిగ్ బాస్ ముద్దు బిడ్డ శోభా శెట్టి డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఇక ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఈమెను బిగ్ బాస్ కాపాడేందుకు మరో ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎత్తివేసేందుకు కొత్త స్కెచ్ వేశాడు బిగ్ బాస్. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతూ.. ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది. ఇక ఈ సీజన్ గత సీజన్స్ కంటే ఉల్టా పుల్టాగా సాగుతున్న సంగతి తెలిసిందే. గతవారం డబుల్ ఎలిమినేషన్ చేసి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో 7 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

13వ వారం నామినేషన్స్ లో ఒక్క అమర్ దీప్ చౌదరి తప్ప... అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. శివాజీ, యావర్, ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి వీరంతా నామినేషన్స్ లో ఉండగా.. ఓటింగ్ ప్రక్రియ కూడా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. ఇక ఈ వారం ఓటింగ్ ప్రక్రియ చూసుకుంటే శివాజీ, ప్రశాంత్, గౌతమ్ సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఇక అర్జున్ అంబటి, యావర్, ప్రియాంకకు మోస్తరు ఓటింగ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నది మాత్రం బిగ్ బాస్ ముద్దు బిడ్డ శోభా శెట్టి అని సమాచారం. ప్రతి వారం శోభా శెట్టిని ముందు నుంచి కాపాడుకుంటు వస్తున్న బిగ్ బాస్.. ఈ వారం కూడా ఆమెను సేవ్ చేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఓసారి అయితే శోభా శెట్టి ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ఎలిమినేషనే ఎత్తివేశాడు బిగ్ బాస్.

మరి ఈసారి పక్కగా ఆమె ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చేసింది. అంతా ఆమెనే ఔట్ అని అంటుకుంటున్నారు. ఈ టైంలోనే బిగ్ బాస్ ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ప్రశాంత్ చేత ఎవిక్షన్ పాస్ యూజ్ చేయించాలని బిగ్ బాస్ ప్లాన్ వేశాడు. ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్ ను 14వ వారంలో వాడుతాను అని చెప్పాడు. కానీ ఈ వారమే వాడేట్లు బిగ్ బాస్ కొత్త ప్లాన్ వేశాడని తెలుస్తోంది. ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడితే.. శోభా శెట్టి సేవ్ అయిపోతుందని తెలుస్తోంది.
అలా ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని బిగ్ బాస్ వర్గాల సమాచారం. మొత్తానికి ఈ వారం కూడా శోభా శెట్టిని బిగ్ బాస్ కాపాడుకుంటారని తెలుస్తోంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ ముగియనుండగా.. ఈ వారం ఎలిమినేషన్ లేకపోతే... హౌస్ లో 8 మంది ఉంటారు. 14వ వారం ఒకరు ఎలిమినేట్ అవ్వగా.. 15వ వారం టాప్ 7 కంటెస్టెంట్స్ గ్రాంఢ్ ఫినాలేకి వెళ్తారు. సీజన్ 7 కాబట్టి.. టాప్ 7 కంటెస్టెంట్స్ ఫినాలేకి వెళ్లనున్నారు. అలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











