గ్రాండ్‌గా కన్నడ బిగ్‌బాస్ 8 ప్రారంభం.. 17 మంది కంటెస్టెంట్లు ఎవరంటే!

కన్నడ సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్ హోస్ట్‌గా బిగ్‌బాస్ కన్నడ సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం నాడు అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న షోలో పాల్గొనే 17 మంది కంటెస్టెంట్లను పరిచయం చేశారు. కన్నడ బిగ్‌బాస్‌ 8లో పాల్గొనే వారి జాబితా మీ కోసం..

1. చంద్రకళ మోహన్
పుట్టగౌరి మాధురే టెలివిజన్ సీరియల్ ద్వారా కన్నడ ప్రేక్షకులకు సుపరిచితులు.

2. ధనుశ్రీ
టిక్ టాక్ యాప్‌లో వీడియోల ద్వారా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకొన్నారు.

3. దివ్య సురేష్
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన బ్యూటీ ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

4. దివ్య ఉరుదుగ
కన్నడలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న సోషల్ మీడియా స్టార్

5. గీతా భారతీ భట్
సింగర్; యాక్టర్‌గా సుపరిచితులు. బ్రహ్మగంతు షో ద్వారా పాపులారిటీని సంపాదించుకొన్నారు.

 Bigg Boss Kannada season 8: Kichcha Sudeepa introduced 17 contestants

6. కేపీ అరవింద్: మోటర్ సైకిల్ రైడర్.

7. మంజు పవగడ
కమెడియన్‌గా సుపరితులు. మజా భరత సీరియల్ ద్వారా విశేషంగా ఆకట్టుకొన్నారు. లవ్ యూ 2 అనే చిత్రంతో నటుడిగా మారారు.

8. నిధి సుబ్బయ్య
బాలీవుడ్, కన్నడ హీరోయిన్. బాలీవుడ్‌లో ఓ మై గాడ్, అజబ్ గజబ్ లవ్ చిత్రాల్లో నటించారు.

9. నిర్మలా చెన్నప్ప
థల్లన చిత్రంలో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ ద్వారా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకొన్న కన్నడ నటి.

10. ప్రశాంత్ సంబర్గీ
కన్నడ వ్యాపారవేత్తగా సుపరిచితులు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి సమన్లు అందుకొన్నారు.

11. రఘు గౌడ అలియాస్ రఘు వైన్ స్టోర్
కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ఫన్నీ వీడియోలతో అత్యంత ప్రేక్షకదారణను సోషల్ మీడియాలో సొంతం చేసుకొన్నారు.

12. రాజీవ్
కన్నడలో యువ నటుడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో రాణించాడు.

13. షామంత్ బ్రోగౌడ
సోషల్ మీడియా స్టార్. ఇన్స్‌టాగ్రామ్‌లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ. నటుడిగా, రచయితగా సుపరిచితులు. వర్జిన్ బాయ్స్‌ వెబ్ సిరీస్‌కు రచయితగా పనిచేశారు.

14. శంకర్ అశ్వథ్
కన్నడలో ప్రముఖ నటుడు, స్వర్గీయ కేఎస్ అశ్వత్ కుమారుడు. ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్నారు.

15 శుభా పుంజా
కన్నడలో నటిగా రాణిస్తున్నారు. మొదటి సీజన్ నుంచి తనకు ఆఫర్ ఇస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉన్నారు.

16. వైష్ణవీ గౌడ
అగ్నిసాక్షి ద్వారా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్న నటి

17.
వైష్ణవ్ హవేరీ
కన్నడ సినీ పరిశ్రమలో సింగర్‌గా సుపరిచితులు. బిగ్‌బాస్ కన్నడ హిస్టరీలో అత్యంత పిన్న వయస్కుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X