బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఇలా ఉంటుంది.. కౌషల్ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షోకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఈ షో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక నెక్ట్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్స్ కు సంబంధించిన పలు కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ కౌషల్ రీసెంట్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు 2 టైటిల్ విన్నర్ గా..
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు కౌషల్. టెలివిజన్ నటుడుగా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. దీంతోనే ఆయన తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్నారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ లో కౌషల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 టైటిల్ ను సొంతం చేసుకోవడం విశేషం.

కౌషల్ కామెంట్స్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 టైటిల్ విన్నింగ్ తర్వాత కౌషల్ తన ఫిల్మ్ కెరీయర్ పై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలిపారు. రీసెంట్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తెలుగు హౌజ్ నుంచి బయటికి వచ్చాక అసలు పరిస్థితి ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న సమయంలో నాని తనను ఎంతగానో అభినందించారని చెప్పారు. దాంతో లైఫ్ బాగా మారిపోతుందని అనుకున్నారంట.
కానీ బిగ్ బాస్ టైటిల్ ద్వారా తన జీవితం మారిపోతుందంటే మొదట నమ్మలేదని కౌషల్ చెప్పుకొచ్చారు. కానీ నేచురల్ స్టార్ నాని ఇచ్చిన హైప్ తో ఇక తన జీవితం మారిపోయిందని, ఇకపై సినిమా అవకాశాల విషయంలో అస్సలు సమస్యలు ఉండవమని ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. కానీ బిగ్ బాస్ తర్వాత కెరీయర్ అందుకు భిన్నంగా మారిందని చెప్పారు. అస్సలు ఒక్కరి దగ్గరి నుంచి సినిమా ఆఫర్ అంటూ ఫోన్ కాల్ రాలేదని చెప్పుకొచ్చారు.
అంతే కాదు.. తను కూడా స్వయంగా కొందరు దర్శకులను ప్రత్యేకంగా వెళ్లి కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. పూరీ, సుకుమార్ వంటి టాప్ డైరెక్టర్స్ తనను గౌరవించినా అవకాశాలు రాలేదని చెప్పడం గమనార్హంగా మారింది. ఇక చివరిగా కౌషల్ నటించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇదే విషయాన్ని వేదికపై గుర్తు చేశారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నంత మాత్రానా జీవితాలు మారవంటూ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. గ్రాండ్ లాంఛ్ కు సంబంధించిన ఏర్పాట్లను చకాచకా పూర్తి చేస్తున్నారు. ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











