హోస్ట్ మారితేనే బిగ్ బాస్ కు కొత్తదనం.. లేదంటే బోరింగ్.. నాగార్జునపై కౌశల్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకులను సీరియల్స్, సినిమాలతో కౌశల్ ఎంతగానో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తను తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా అలరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో టైటిల్ ను కూడా గెలుచుకోవడం విశేషం. 2వ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి అక్కినేని నాగార్జున రంగంలోకి దిగారు. గత కొన్ని సీజన్ల నుంచి ఆయనే హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు. ఇక త్వరలో బిగ్ బాస్ 9 ప్రారంభం కానుండటంతో హోస్ట్ పై ఆసక్తికరమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో కౌశల్ కూడా ఇంట్రెస్టింగ్ గా స్పందించారు.

6 సీజన్లుగా బిగ్ బాస్ ఆయనే..
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో ఇప్పటి వరకు 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ షోలకు ప్రత్యేకమైన ఆడియెన్స్, ఫ్యాన్స్ ఉండటంతో ఇంకా సీజన్ల వారీగా టెలికాస్ట్ అవుతూనే వస్తోంది. సీజన్ సీజన్ కు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఇక 2017లో బిగ్ బాస్ తెలుగు షో మొదటి సీజన్ ప్రారంభం అయ్యింది. 1వ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. 2వ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా ఉన్నారు. ఇక 3వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు నాగార్జుననే హోస్ట్ చేయడం విశేషం.

Bigg Boss Kaushal Shocking Comments on Akkineni Nagarjuna Hosting for Bigg Boss Telugu Season 9

అక్కినేని నాగార్జున పై కౌశల్ కామెంట్స్..
గత ఐదారు సీజన్లుగా బిగ్ బాస్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విజేత కౌశల్ షాకింగ్ గా స్పందించారు. బిగ్ బాస్ షోకు గత ఆరు సీజన్లుగా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ మారితే కొత్తదనం ఉంటుంది. అలాగే జనాలు కూడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. ఇక హోస్ట్ విషయంలోనూ కొత్తదనం కోరుకుంటారు.

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా 7వ సారి ఎలా మెప్పిస్తారో చూడాలని చెప్పుకొచ్చారు. మరోవైపు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చే కంటెస్టెంట్లు కూడా 100 శాతం తమ ఎనర్జీ, ఎఫర్ట్ ను చూపించాలని, ప్రతి టాస్క్ లో గెలవడానికి ప్రయత్నించాలని సూచించారు. కేవలం రెమ్యునరేషన్ల కోసమే హౌజ్ లోకి వచ్చి మేకప్ లు వేసుకొని కూర్చొంటే ఆడియెన్స్ మెచ్చుకోరని అభిప్రాయపడ్డారు.

బిగ్ బాస్ 9 అనౌన్స్ మెట్ వీడియో..
జూన్ 29న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సంబంధించిన సర్ ప్రైజింగ్ వీడియో విడుదలైంది. ఇప్పటికే ఈ సీజన్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్లుగా, రాబోతున్నారు. హోస్ట్ ఎవరు అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. కాగా తాజాగా ఒక వీడియోతో హోస్ట్ పై క్లారిటీ ఇచ్చారు. 9వ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇక కామన్ మ్యాన్ ఎంట్రీకి కూడా అవకాశం కల్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X