200కి వ‌స్తావా.. ఎక్కడెక్కడో టచ్ చేశాడు .. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన

కష్టాలు ఎక్కువైతే సినిమా కష్టాలని అంటారు.. కానీ సీరియల్స్‌లో అంతకుమించిన కష్టాలనే చూపిస్తుంటారు. అయితే.. ఓ బుల్లితెర నటి కష్టాలు వింటే మాత్రం కన్నీళ్లు ఆగవు. ఎన్నో గాయాలు, అవమానాలతో నిండిన జీవితం ఆమెది. ఒకప్పుడు కుటుంబంతో సంతోషంగా జీవించిన ఆమె.. ఒక్క ప్రమాదంతో అన్నీ కోల్పోయింది. కోమాలో పడిన రోజులు, అనంతరం ఎదురైన దారుణ అనుభవాలు, బ్రతకడానికి చేసిన పోరాటం ఇవన్నీ వింటే.. కలచివేస్తాయి. అయినా జీవితం ముందుకు నడపాలని పట్టుదలతో ప్రతి అడుగూ వేసింది. చివరి ప్రేమించిన వాడు కూడా దూరమయ్యాడు. ఇంతకీ బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆ బ్యూటీ ఎవరు? ఆమె జీవితంలో నిజంగా ఏం జరిగింది?

ఆ నటి ఎవరో కాదు.. కీర్తీ భ‌ట్(Bigg Boss Keerthi Bhat).. ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎన్నో సీరియ‌ల్స్ లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లి తెరపై సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుని, తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని తన వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె జీవితం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె పాల్గొన్న ఓ పాత ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎదుర్కొన్న కష్టాల్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకువచ్చింది. 'కాఫీ విత్ శోభా' కార్యక్రమంలో ఆమె చెప్పిన జీవిత కథ విన్నవారిని కంటతడి పెట్టిస్తోంది.

Bigg Boss Keerthi Bhat Shocking Throwback Interview Reveals Her Painful Life Journey

కీర్తి భట్ పేరు చెప్పగానే మనసిచ్చి చూడు, కార్తీక దీపం వంటి సీరియల్స్ గుర్తొస్తాయి. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగులో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. తన ఆటతీరుతో టాప్ 5 వరకు వెళ్లి ప్రేక్షకుల మన్ననలు పొందింది. కానీ స్క్రీన్‌పై కనిపించే ఆమె స్మైల్ వెనుక ఎంతటి బాధ దాగి ఉందో ఈ ఇంటర్వ్యూ వెల్లడించింది. కీర్తి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఆమె తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. ఆ సంఘటన తర్వాత ఆమె కొన్నాళ్లు కోమాలో ఉండాల్సి వచ్చింది. శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో జీవితం ఒకేసారి చీకట్లోకి వెళ్లిపోయింది. కుటుంబం లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన కీర్తి, అక్కడి నుంచి తిరిగి నిలబడటమే ఒక పెద్ద సవాల్ అయింది.

కోమా తర్వాత ఎదురైన దారుణ పరిస్థితులు
కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు మరింత షాకింగ్ గా మారాయి. తాను బలహీనంగా ఉన్న సమయంలో తనకు అత్యంత దగ్గరగా ఉండాల్సిన వ్యక్తుల నుంచే వేధింపులు ఎదురయ్యాయని కీర్తి తెలిపింది. శరీరం స్పందించని స్థితిలో ఉన్నప్పుడు కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె చెప్పిన మాటలు ప్రేక్షకులను కలచివేశాయి. "ఏం జరుగుతుందో తెలిసినా, ప్రతిస్పందించే శక్తి లేకపోవడం నా జీవితంలోనే అత్యంత భయంకరమైన అనుభవం" అని ఆమె చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

డబ్బుల కోసం పడిన తిప్పలు
ఆ సంఘటనల తర్వాత అక్కడి నుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చిన కీర్తి జీవితం మరోసారి పరీక్షకు గురైంది. చేతిలో కేవలం కొన్ని వందల రూపాయలతో వచ్చిన ఆమె, ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. బస్ స్టాండ్‌లో రాత్రులు గడపాల్సి వచ్చిందని, ఆకలితో బాధపడిన సందర్భాల్లో దొంగతనాలు కూడా చేయాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. అంతేకాదు, "₹200 ఇస్తా వస్తావా?" అని అడిగితే అర్థం తెలియక ఒప్పుకునే పరిస్థితి వచ్చిందని చెప్పిన మాటలు ఆమె ఎంత అమాయకంగా, ఎంత కష్టాల్లో జీవించిందో చూపిస్తున్నాయి.

కీర్తి మొదట ప్రొడక్షన్ క్యాటరింగ్‌లో పనిచేసింది. తర్వాత ఇంటింటికీ వెళ్లి పుస్తకాలు అమ్మిందట. ఆ తర్వాత చిన్న చిన్న అవకాశాల కోసం తిరుగుతూ, జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు తన లుక్ చూసి అవమానించారని కూడా ఆమె తెలిపింది.
అయితే అదే సీరియల్‌లో కొన్నేళ్లకు మెయిన్ లీడ్‌గా ఎంపిక కావడం ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. "నా వర్క్‌తోనే వాళ్లకి సమాధానం ఇచ్చాను" అని ఆమె చెప్పిన మాటలు ప్రేరణగా నిలుస్తాయి.

ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న కీర్తి ఇప్పుడు జీవితంలో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. తన కాబోయే భర్తతో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని తెలిపింది. గతాన్ని మర్చిపోకుండా, అదే తనకు బలం అయ్యిందని చెప్పింది. 'ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను'అని ఆమె చెప్పిన మాటలు, ఎంతటి బాధనైనా దాటుకుని ముందుకు వెళ్లొచ్చని నిరూపిస్తున్నాయి. ఈ త్రోబ్యాక్ ఇంటర్వ్యూ బయటకు రావడంతో నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. చాలా మంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, "నిజమైన ఫైటర్" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో ఇంకా జరుగుతుండటం బాధాకరమని స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X