బిగ్ బాస్ లహరి అందాల బీభత్సం.. అలాంటి నైటీలో సూపర్ హాట్ పిక్!
ఎన్నో అనుమానాలు అంచనాల మధ్య వచ్చిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతోమందికి ఫేమ్ తీసుకొచ్చింది. అప్పటి వరకు సినిమాల్లో, సీరియళ్లలో నటించిన రాని గుర్తింపు ఈ ఒక్క షోలో పాల్గొనడంతో ఎక్కడా లేని విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీ హోదా పొంది వెండితెరపై అనేక సినీ అవకాశాలతో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి లహరి షరి ఒకరు. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో నిత్యం ట్రెండ్ అవుతోంది.
దృష్టిని ఆకర్షించి: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇంతకుముందు ఉన్న ఏకైక మంచి వేదిక మోడలింగ్. అలాంటి మోడలింగ్ రంగంతోనే కెరీర్ స్టార్ట్ చేసింది బ్యూటిఫుల్ లహరి షరి. మోడలింగ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. దీంతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

మళ్లీ ఆ ఛాన్స్: 2014వ సంవత్సరంలో వచ్చిన సారీ నాకు పెళ్లయింది అనే సినిమాతో టాలీవుడ్ లో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది గ్లామరస్ బ్యూటి లహరి షరి. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అక్కడ కొన్ని షోలు చేసిన ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా ఓ న్యూస్ ఛానెల్ లో ప్రజెంటర్ గా పని చేసింది. ఇలా న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ సాగుతున్న సమయంలోనే మళ్లీ వెండితెరపై కనిపించే అవకాశం లభించింది.
టీవీ సిరీసులో: విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది తెలుగు బ్యూటి లహరి షరి. దీని తర్వాత వరుసగా మళ్లీ రావా, అజ్ఞాతవాసి, పటేల్ సార్, పేపర్ బాయ్, శ్రీనివాస కల్యాణం, తిప్పరా మీసం, జాంబీ రెడ్డి, యు, గని, షాకనీ డాకినీ వంటి సినిమాలతోపాటు కల్యాణ్ వైభోగం అనే టీవీ సిరీస్ లో కూడా అలరించింది బ్యూటిఫుల్ లహరి షరి. అయితే ఈ చిత్రాలు ఆమెకు అనుకున్నంత పేరు తీసుకురాలేకపోయాయి.
సక్సెస్ కాలేక: ఎన్నో సినిమాల్లో నటించినా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన లహరి షరికి బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ షోలోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ తెలుగు అందం గ్లామర్ తో పాటు ఆట తీరుతో ఆకట్టుకుంది. అంతేకాకుండజా నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు క్రేజ్ పెరిగింది.

ఫుల్ బిజీగా: అయితే బిగ్ బాస్ షోలో అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది లహరి షరి. ఎలిమినేట్ అయిన లహరి షరికి సినిమాల్లో కంటే ఇందులో ఎక్కువగా హైలెట్ అయింది. దీంతో ఆమెకు వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. సినిమాలతోపాటు వాటి ఫంక్షన్స్, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రారంభోత్సవాలు చేస్తూ తన కెరీర్ ను ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ చిన్నది.
నైటీలో హాట్ గా..: ఇక సోషల్ మీడియాలో సినిమాల్లో కంటే ముందు నుంచే యాక్టివ్ గా ఉంటోంది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ హాట్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ నైట్ డ్రెస్ వేసుకున్న లహరి షరి విండో పై కూర్చుని హాట్ గా పోజు ఇచ్చింది. ఇందులో ఆమె థైస్, లెగ్స్ అందాలు సూపర్ హాట్ గా కనువిందు చేస్తున్నాయి. 'నేను ఇలానే లేచాను' అంటూ రాసుకొచ్చిన ఈ పిక్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











