శివగామి అంటే అసలైన అర్దాన్ని చెప్పిన అభిజిత్.. మోనాల్ దెబ్బకు డౌన్
బిగ్ బాస్ ఇంట్లో గొడవలు ఎన్ని జరిగినా కూడా కొందరిలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు జరిగేది మరో లెక్క అనేలా కంటెస్టెంట్స్ కు ఒక క్లారిటీ వచ్చింది. అందుకే ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి కసిగా ప్రయత్నం చేస్తున్నారు.
బిగ్ బాస్ అయితే సింపుల్ గా టాస్కులు ఇచ్చేసి ఎలిమినేషన్ ను ఆడియెన్స్ చేతిలో పెట్టేస్తున్నారు. ఎంటర్టైన్ చేసి జనాలను ఆకట్టుకోవాలని కొత్త ట్విస్ట్ ఇవ్వడంతో ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. ఇక అభి మాత్రం తనలోని కామెడీ టైమింగ్ ను బయటపెడుతున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో శివగామి అనే పదానికి అసలైన అర్దాన్ని చెప్పాడు.

ముందు గొడవలు.. ఆ తరువాత ఏడుపులు
ఎంటర్టైన్మెంట్ అంటే కంటెస్టెంట్స్ కు ఎలా అర్థమయ్యిందో తెలియదు గాని మాటలతోనే యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం అరియానా vs సోహెల్ అనే ట్యాగ్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇద్దరికి ఇద్దరు గోడవలతో గట్టిగా అరిచేస్తూ చివరకు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక మిగతా వాళ్ళు మాత్రం వారిని ఓదార్చే పని పెట్టుకుంటున్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.

బగ్ బాస్ మూడవ టాస్క్.. న్యూ ట్విస్ట్
ఇక నేడు బిగ్ బాస్ ఏకాగ్రత అనే మూడవ టాస్క్ ను ఇచ్చాడు. కంటెస్టెంట్స్ వారి టాలెంట్ ను నీరూపించుకోవడానికి మైండ్ గేమ్ సెట్ చేశారు. గడియరాన్ని చూడకండా ఏదైనా పని చేస్తూ సరిగ్గా 30నిమిషాలను లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి సభ్యులు వారిని తికమక ప్రశ్నలు అడుగుతూ డిస్టర్బ్ కూడా చేయవచ్చు. ఇక ఈ టాస్క్ లో ఒక్కొక్కరు చెప్పిన సమాధానాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.

శివగామికి అసలైన అర్థం ఆ ముగ్గురు
ఇక బాగా నచ్చిన పని ఏది అంటే సోహెల్ తనకు నిద్రపోవడం ఇష్టమైన పని అంటూ అందరిని నవ్వించాడు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా కూడా అభి మాత్రం శివగామి అనే పేరుకు అసలైన అర్దాన్ని చెప్పడమే కాకుండా చూపించాడు కూడా. శివగామిని ఎవరితో పోలుస్తావ్ అంటూ హారిక అడుగగా.. శివగామిలో ఉన్న అందం మోనాల్ కు ఉంది. శివగామిలో ఉన్న టెర్రర్ అరియానాకు ఉంది. శివగామిలో ఉన్న ప్రేమ హారికలో ఉంది అంటూ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు అభిజిత్.

మోనాల్ తో అభి కామెడీ
ఇక అభిజిత్ తన కామెడీ టైమింగ్ తో ఈ ఎపిసోడ్ లో చాలానే నవ్వించేలా ఉన్నాడని అనిపిస్తోంది. మోనాల్ ఏకాగ్రతతో గేమ్ ఆడుతున్న సమయంలో అభి వచ్చి.. మౌంట్ ఏవరెస్టు ఏ కంట్రీలో ఉంది అని ఒక ప్రశ్న వేశాడు. చైనా అండ్ ఇండియా బార్డర్ లో ఉందంటూ మోనాల్ నవ్వుతూ కామెడీగా చెప్పడంతో షాక్ అయ్యి కింద పడిపోయాడు అఖిల్. చూస్తుంటే ఈ రోజు ఈ టాస్క్ లో గోడవలకంటే ఎక్కువగా అభి కామెడీ ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











