Bigg Boss 5: నీకు దమ్ముంటే గేమ్ ఆడు.. ప్రియాంక మరో కౌంటర్.. కెప్టెన్సీ టాస్క్ లో బంగారు కోడిపెట్ట

ఏడోవారం నామినేషన్స్‌ చాలా ఆసక్తికరంగా జరిగాయి. బిగ్ బాస్ ప్రతి వారం సరికొత్త టాస్క్ లతో నామినేషన్ ప్రక్రియను మొదలుపెడుతున్నాడు. ఇక ఈసారి ఆట చాలా ఉత్కంఠను కలిగించింది. హౌస్ లో మొదటి నుంచి కూడా మంచి స్నేహితులుగా ఉన్నవారు కూడా ఏడవ వారం లో నామినేషన్ కు వచ్చే సరికి మళ్లీ గొడవలు పెట్టుకున్నారు. మెల్లగా గ్యాంగ్ ల మధ్య లో కూడా గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సారి సన్నీ వర్సెస్ ప్రియా అన్నట్లుగా గేమ్ అయితే కొనసాగుతూ వచ్చింది.

ఇక మధ్యలో ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేయగా సన్నీ గేమ్ లో చేంజ్ చేసే ప్రయత్నం చేశాడు. నాతో ఆడుకోవాలని అని అనుకున్నారు. కానీ అసలు ఆట నేను ఆడుతాను అంటూ తనదైన శైలిలో విభిన్నంగా ముందుకు సాగుతున్నాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం సరికొత్తగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సన్నీ దూకుడు

సన్నీ దూకుడు

వేటగాళ్లలో శ్రీరామ్, జస్వంత్‌లు ఒక్కసారి కూడా డెన్ నుంచి బయటకు రాకపోవడంతో వారు నేరుగా నామినేట్ అవ్వగా సన్ని విభిన్నంగా ఇతరులను బోల్తా కొట్టేస్తూ ఆటను కొనసాగిస్తున్నాడు. గత ఎపిసోడ్ లో సన్నీ అసలైన కంటెస్టెంట్స్ తోనే గొడవకు దిగుతున్నారు. ఎదుటివారు ఏమనుకున్నా సరే తను ఏమాత్రం లెక్క చేయను అనే విధంగా నామినేషన్ ప్రక్రియ లో చాలా మార్పులు తీసుకువచ్చాడు.. ఇక అతని విధానాన్ని చూసిన ప్రియా ప్రియాంక ఇద్దరు కూడా చాలా కోపానికి లోనయ్యారు. అయినప్పటికీ అసలు వెనక్కి తగ్గలేదు.

గ్రూప్స్ గొడవలు

గ్రూప్స్ గొడవలు

ఇక సన్నీ ఆడుతున్న గేమ్ విధానంపై కూడా మానస్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది నీ నామినేషన్ లో ఉంది కానీ వాళ్ల నామినేషన్ల లేదు అంటూ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు ఇక సన్నీ మాత్రం తనదైన శైలిలో కాజల్ కు ఆన్సర్ ఇచ్చాడు. నామినేషన్ చేసింది ఎవరు అంటూ కాజల్ అని అడగడంతో ఆమె ప్రియా అని సమాధానం చెప్పింది. దీంతో మనడ్ కూడా మరొక మాట చెప్పలేదు అన్నట్లు తెలుస్తోంది.

చూస్తుంటే మానస సన్నీ మధ్య కూడా గొడవ మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే నామినేషన్స్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ప్రియాంక మాత్రం ఒక విషయం లో చాలా అప్సెట్ అవుతూ వచ్చింది. చాలా సేఫ్ గేమ్ పడుతున్నారని నామినేషన్స్ విషయంలో చెత్త కారణాలు చెప్పి నామినేట్ చేయడం తనకు ఏమాత్రం నచ్చడం లేదు అని చెప్పుకుంటూ వస్తోంది.

వాడు తప్పు చేయలేదు

వాడు తప్పు చేయలేదు

ఇక మానస్ కూడా తన గేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని అర్థమవుతోంది. నీకు వచ్చిన పవర్స్ తో మీ ఫ్రెండ్స్ ని కాపాడుకోవాలని అనుకున్నప్పుడు. నీ ప్రత్యర్థులను నామినేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పడంతో సన్నీ కొంత ఆలోచనలో పడినట్లు అర్థమవుతోంది. ఇక మరోవైపు రవి అయితే సన్నీ నామినేట్ చేసినప్పటి నుంచి కూడా ఏ మాత్రం సంతోషంగా లేడు.

వీడు తప్పు చేసినట్లు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు అని చెబుతుండగా వాడు తప్పు చేయలేదు అని కాజల్ మరొక కౌంటర్ ఇస్తుంది. ఆ విషయంలో నేను ఏమాత్రం ఒప్పుకోను అంటూ ఫ్రెండ్ ను సేవ్ చేసే క్రమంలో నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ తన గేమ్ స్ట్రాటజీని బయటపెట్టింది.

ఫ్రెండ్షిప్ చూపించకూడదు

ఇక మరొకసారి షన్ను తన స్నేహితుడిని హితబోధ చేసే ప్రయత్నం చేశాడు. టాస్క్ ల విషయంలో అసలు ఫ్రెండ్షిప్ చూపించకూడదు అంటూ జెస్సికి వివరణ ఇచ్చాడు. ఏమాత్రం చూపించిన కూడా నువ్వు అక్కడే ఓడిపోయినట్లు అని షన్ను తెలియజేశాడు. ఇక మరొకవైపు సన్నీ తన గేమ్ తాను ఆడుతున్నాను అని వాళ్ళు ఆడితేనే గేమా? నేను ఆడితే క్రైమా? అని కౌంటర్ ఇచ్చాడు.

బంగారు కోడిపెట్ట

బంగారు కోడిపెట్ట

ఇక ఈసారి బిగ్బాస్ కెప్టెన్సీ టాస్క్ ను కూడా చాలా భిన్నంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బంగారు కోడిపెట్ట అనే టాస్క్ లో ఎవరికివారు పోటాపోటీగా గుడ్లను తీసుకుని రావాలి అని రూల్ పెట్టారు. ఇక ఒకరిమీద మరొకరు పడుతూ చాలా కష్టపడి బంగారు కోడిపెట్టలను సంపాదించినట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో ఒకరి నుంచి మరొకరు దొంగతనం చేసే ప్రయత్నం కూడా చేశారు.

ఇక స్విమ్మింగ్ పూల్ లో కొన్ని పడేయగా ప్రియాంక అందులోకి దూకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. దొంగతనం చేయడం కోసం సన్నీ ఆనీ దగ్గరకు వచ్చి ఎవరు తీసుకున్నారో అర్థం అయింది ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక నేను తీసుకుంటాను అంటూ ప్రియ వైపు నుంచి కౌంటర్ ఇచ్చింది. మరి ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X