bigg boss 4: కెప్టెన్‌గా సోహెల్ బిల్డప్, గాలి తీసేసిన బిగ్ బాస్.. ఇజ్జత్ పోయింది పో..

బిగ్ బాస్ సీజన్ 4 ఈ వారం హోటల్ టాస్క్ తో ఊహించని మలుపులు తిరిగింది. రోజురోజుకు కంటెస్టెంట్స్ లో ఉన్న అసలు రంగులు చాలా ఈజీగా బయటపడుతున్నాయి. ఇక గురువారం ఎపిసోడ్ లో అయితే టాస్క్ కి ముందు ఒకలాగా ఉన్న కంటెస్టెంట్స్ టాస్క్ ఎండ్ అవ్వగానే మళ్ళీ ఎప్పటిలానే రంగులు మార్చేశారు. ఇక తెలివిగా కెప్టెన్ పోస్టును దక్కించుకున్న సాహెల్ కి ముందు ముందు ఊహించని షాక్ లు తగులుతాయని చాలా ఈజీగా అర్ధమవుతోంది.

కెప్టెన్ మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నాడా

కెప్టెన్ మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నాడా

శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేసిన స్టార్ మా షోకి మరింత హైప్ ని క్రియేట్ చేసినట్లు అర్ధమవుతోంది. కెప్టెన్ సోహెల్ డ్యూటీలో చాలా సమస్యలు ఎదుర్కోబోతున్నట్లు అర్ధమవుతోంది. చూస్తుంటే కంటెస్టెంట్స్ అతనిపై ఒత్తిడి పెంచేలా ఉన్నారని అనిపిస్తోంది. బిగ్ బాస్ కూడా కొత్త సమస్యలను లెవనెత్తె ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది.

నా ఇజ్జత్ పోతది బిగ్ బాస్

నా ఇజ్జత్ పోతది బిగ్ బాస్

ఇక కెప్టెన్ గా ఉన్న సోహెల్ హౌజ్ లో ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి. ఇక ఏ సమస్య ఉన్నా కూడా సాల్వ్ చేసేలా ఉండాలి. అయితే కెప్టెన్ పోస్ట్ వచ్చిన మరుసటి రోజే బిగ్ బాస్ అతనికి చాలెంజ్ విసురుతున్నాడు. నీళ్లు రావడం లేదని హౌజ్ లో కంటెస్టెంట్స్ చెప్పడంతో బిగ్ బాస్ కి పిర్యాదు చేసిన సోహెల్ నా ఇజ్జత్ పోతది బిగ్ బాస్.. వెంటనే నీళ్లు వచ్చేలా చెయ్ అంటూ మోర పెట్టుకున్నాడు.

సోహెల్ గాలి తీసేసిన బిగ్ బాస్

సోహెల్ గాలి తీసేసిన బిగ్ బాస్

ఇక బిగ్ బాస్ మీద నమ్మకంతో సోహెల్ కాస్త ఓవర్ గానే చేశాడు. ఇప్పుడు వాటర్ వచ్చేస్తాయని బిల్డప్ కొడుతూ ట్యాప్ ఆన్ చేశాడు. కానీ చుక్క నీళ్లు కూడా రాలేదు. పక్కనే ఉన్న మోనల్, నోయేల్ పక్కున నవ్వేశారు. బిగ్ బాస్ గాలి తీసేశాడని అందరికి అర్థమైపోయింది. కనీసం నీళ్లు కూడా రాకపోతే కంటెస్టెంట్స్ తన మీద ఎగబడతారని మోర పెట్టుకున్నప్పటికీ బిగ్ బాస్ కనికరించకపోవడంతో ఈ రోజు ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ గట్టిగానే ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది.

Recommended Video

Actress Seerat Kapoor Gym Workout Video
హారిక, అభిజిత్ కౌగిలింతలు

హారిక, అభిజిత్ కౌగిలింతలు

ఇక బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో గెస్ట్ లు విజయం సాదించిన తరువాత బిగ్ బాస్ అవినాష్ సీక్రెట్ టాస్క్ లను చాలా క్లియర్ గా బయటపెట్టాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన కంటెస్టెంట్స్ బిర్యానీలో పిన్నీస్, అన్నంలో వెంట్రుక పెట్టింది నువ్వే కదా అంటూ షాక్ అయ్యారు. ఇక అభిజిత్ 5 స్టార్స్ ఇచ్చారని చెప్పినప్పటికీ హారిక నేను ఇవ్వలేదని చెప్పడంతో బిగ్ బాస్ గెస్ట్ లను విజేతలుగా ప్రకటించారు. అనంతరం హారిక, అభిజిత్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటూ ఎమోషనల్ గా కౌగిలించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X