ఈ రోజు బిగ్ బాస్‌లో రాక్షసుల రచ్చ.. రావణుడుని కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చేసిన మోనాల్

ప్రతివారం బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు మామూలుగా ఉండడం లేదు. కంటెస్టెంట్స్ మధ్య రివెంజ్ పెరిగేలా.. ఆటలో ప్రతికారాల పదును పెరిగేలా చేస్తున్నాడు. ఇక ఈ వారం నెవర్ బిఫోర్ అనేలా కొత్త రకమైన టాస్క్ ఇచ్చి షాక్ ఇచ్చారు. మంచి మనుషులు, రాక్షసులు అని రెండు గ్రూపులుగా విడగొట్టగా అందులో మంచి మనషులకు చుక్కలు కనిపించాయని అనిపిస్తోంది. ఎవరిని ఎవరు ఇరిటేట్ చేస్తారనేది అసలు కాన్సెప్ట్. ఇక ఊహించని విధంగా రాక్షసులు చేసిన రచ్చ మామూలుగా లేదు.

ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది వాళ్ళే..

ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది వాళ్ళే..

బిగ్ బాస్ షోలో శని ఆదివారాలు ఒకరోజు ఎలిమినేషన్స్, మరో రోజు ఎంటర్టైన్మెంట్ తో అలరించిన కంటెస్టెంట్స్ సోమవారం ఒక్కసారిగా సీరియస్ మోడ్ లోకి వెళ్లారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా జంటలుగా విడిపోయి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అందులో ఎక్కువగా అభిజిత్, హారిక జోడి హాట్ డిస్కషన్ తొ ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది.

ఈ వారం కొత్త టాస్క్..

ఈ వారం కొత్త టాస్క్..

అసలు మ్యాటర్ లోకి వస్తే మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోని కొద్దీ సేపటి క్రితమే విడుదల చేశారు. చూస్తుంటే ఈ రోజు షోలో రచ్చ రచ్చ చేశారని అనిపిస్తోంది. బిగ్ బాస్ టీమ్ సబ్యులకు మంచి. మంచి మనుషులు, రాక్షసులుగా కొనసాగాలని టాస్క్ ఇవ్వగా ఒక్కొక్కరు పాత్రల్లో జీవించేశారని అనిపిస్తోంది. రాక్షసులు ఇంటిని మొత్తం చిందర వందర చేసేశారు. ఇక ఎవరు ఎవరిని ఎక్కువగా ఇరిటేట్ చేస్తారనేది గేమ్ మెయిన్ ట్విస్ట్.

 రావణుడిగా అవినాష్..

రావణుడిగా అవినాష్..

ఇక అవినాష్ అయితే ఏకంగా రావణుడిగా కనిపిస్తూ అద్భుతమైన డైలాగ్ వదిలాడు. రాక్షస రాజ్యానికి మొలకలు తెప్పిస్తాను అంటూ ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించినట్లు అర్ధమవుతోంది. నోయల్, అమ్మా రాజశేఖర్, దివి, మోనాల్ వంటి వారు మంచి మనుషులగా ఉండగా.. రాక్షసులు వారిని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టడమే కాకుండా వారి బట్టలు పడేసి బెడ్స్ పాడు చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Ghajjar Extra Glamour
మోనాల్ కౌగిలింతను తట్టుకోలేక

మోనాల్ కౌగిలింతను తట్టుకోలేక

ఇక అవినాష్ రెచ్చిపోతుండగా మోనాల్ రొమాంటిక్ హగ్ ఇచ్చింది. వేడిగా ఉన్న అవినాష్ ని కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చేసింది. దెబ్బకు ఆ రొమాంటిక్ డోస్ తట్టుకోలేక అవినాష్ అరియానా కాపాడు అంటూ గోల గోల చేశాడు. అయినప్పటికీ మోనాల్ అతన్ని విడిచిపెట్టలేదని అనిపిస్తోంది. ఇక నోయల్ పై గుడ్లు కూడా కొట్టేశారు. చూస్తుంటే ఈ టాస్క్ ఈ వీక్ మొత్తం హాట్ టాపిక్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X