ఆ కంటెస్టెంట్ పేరును ముందే లీక్ చేసిన బిగ్ బాస్: ఈ డ్రామా అంతా ఓటింగ్ కోసమేనా.!
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అందుకే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకోవడంతో పాటు, బుల్లితెరపై ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఫలితంగా ఇండియాలోనే బెస్ట్ షోగా కితాబందుకుంది. ఈ షోకు ఎంత మంచి పేరుందో.. అంతకు మించి దీనిపై విమర్శలు కూడా వస్తుంటాయి. తెలుగులో కూడా ఈ షోపై ఎన్నో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహకులు చేసిన ఓ డ్రామా అందరినీ షాక్‌కు గురి చేసింది. ఫలితంగా షోపై డౌట్లు ఎక్కువయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

మూడింటికీ మించి.. గ్రాండ్ ఓపెనింగ్
తెలుగులో బిగ్ బాస్ షో మూడు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు సీజన్లూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముగ్గురు హీరోలు హోస్ట్ చేసిన ఈ సీజన్లు దేనికదే టాప్ అన్నట్లుగా సాగాయి. టీఆర్పీ లెక్కల విషయానికి వస్తే నాగ్ హోస్ట్ చేసిన మూడో సీజన్ టాప్‌లో ఉంది. అయితే, దానిని నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ వెనక్కి నెట్టేసింది.

ఎన్నో హైడ్రామాలు.. ఆడియెన్స్ షాక్
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి షోలో ఎన్నో హైడ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు వెళ్లిపోతారనుకున్న కంటెస్టెంట్లు సేవ్ అవడం.. కచ్చితంగా ఫైనల్ వరకూ ఉంటారనుకున్న వాళ్లు ఎలిమినేట్ అవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో పరిణామాలు జరగడంతో షోను అభిమానించే వాళ్లు కూడా షాక్ అవుతున్నారు.

బిగ్ బాస్ మొత్తం దాని మీదే ఆధారం
బిగ్ బాస్ షో అంటేనే రహస్య పరిణామాల సమాహారం. ఈ షోలో ఏం జరుగుతోందో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో విశ్లేషకులు సైతం అంచనా వేయలేరు. అంతలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు షో నిర్వహకులు. ఈ సస్పెన్స్‌ను మెయింటైన్ చేయడం వల్లే బిగ్ బాస్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఫలితంగా షోకు మంచి స్పందన వస్తోంది.

పేరును ముందే లీక్ చేసిన బిగ్ బాస్
బిగ్ బాస్ షోలో ప్రతీది ఎంతో రహస్యంగా ఉంచుతుంటారు. అయితే, దానికి భిన్నంగా ఈ వారం కెప్టెన్సీ టాస్కుకు సంబంధించిన ఎపిసోడ్ పూర్తవకముందే... ఇంటికి ఎంపికైన కొత్త కెప్టెన్ పేరును లీక్ చేసేశారు. ఇది చేసింది బయటి వారు కాదు.. స్వయానా బిగ్ బాస్ నిర్వహకులే. శుక్రవారం సాయంత్రమే అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయినట్లు ఓ ప్రోమోను విడుదల చేశారు.

ముఖ్యమైనది రివీల్ కావడంపై డౌట్స్
నామినేషన్ ప్రక్రియ, లగ్జరీ బడ్జెట్ టాస్క్, కెప్టెన్సీ టాస్క్, ఎలిమినేషన్... బిగ్ బాస్ షోలో ఎంతో ముఖ్యమైనవి. అందుకే వీటి విషయంలో షో నిర్వహకులు చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాగోలా వీటికి సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కెప్టెన్ ఎవరో చానెల్ వాళ్లే లీక్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ డ్రామా అంతా ఓటింగ్ కోసమేనా.!
ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు అందరిలో అమ్మ రాజశేఖర్‌కు తక్కువ ఓట్లు పోలయ్యాయని, ఫలితంగా ఆయన డేంజర్ జోన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఆయనకు కెప్టెన్సీ ఇచ్చి గౌరవంగా బయటకు పంపుతారని అంతా భావించారు. కానీ, కెప్టెన్ అయినట్లు ముందే లీక్ చేసి, ఆయన ఓటింగ్ పెంచాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











