Bigg Boss Telugu 7: ఉల్టా పుల్టా ఏమో కానీ... బిగ్ బాస్ నిజంగా ప్రేక్షకుల గుండెల్ని పిండేశాడు భయ్యా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. ఇక మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక మరొకరు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 10వ వారం వచ్చే సరికి హౌస్ లో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం హౌస్ మేట్స్ కోసం.. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ పేరు మీద కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ వారిని లోపలికి పంపించి.. ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తున్నాడు అనిపిస్తుంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ ఈసారి సీజన్ సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో కేవలం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అశ్వినీ శ్రీ, బోలే షవాలి, అర్జున్ అంబటి, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్, రతికా రోజ్ ఉన్నారు. ఇక 10వ వారం మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా... ఇక ఈ వారంలో ఫ్యామిలీ వీక్ అని పెట్టాడు బిగ్ బాస్. అంటే హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం.. ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తారు.

అయితే ఉల్టా పుల్టా ఏమో కానీ... ఈ ఫ్యామిలీ వీక్ పేరుతో బిగ్ బాస్ ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తున్నాడనే చెప్పాలి. ఒక్కో కంటెస్టెంట్ కోసం.. ఒక్కో ఫ్యామిలీ పర్సన్ ను లోపలికి పంపించి.. సెంటిమెంట్ తో గుండెల్ని పిండేసి.. చూసేవారిని సైతం ఎమోషనల్ చేసేస్తున్నాడు. ఇక మొదటగా.. శివాజీ కోసం కొడుకు కెన్నిని డాక్టర్ రూపంలో పంపి.. సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఇక వారి సెంటి మెంట్ చూస్తే.. మనకు కూడా కన్నీళ్లు వచ్చేశాయి.
ఇక ఆ తర్వాత అర్జున్ అంబటి.. భార్య సురేఖను పంపించారు. ఇక ఆమె ప్రెగ్నంట్. ఇక అర్జున్ అంబటి అతని భార్య ఎమోషనల్ సీన్స్... ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఆమె కోసం సీమంతానికి సంబంధించిన వస్తువులు పంపి.. మరింత ఎమోషనల్ చేశాడు. తొలిసారిగా బిగ్ బాస్ హౌస్ లో సీమంతం జరిగింది. ఇక ఇదిలా ఉంటే.. గౌతమ్ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కూడా కన్నీళ్లు పెట్టించేసింది. అతని తల్లి.. కన్నయ్యా అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక అందరికీ ప్రేమగా ముద్దలు కలిపి పెట్టింది. ఇక యావర్ కు తల్లి లేదని ఏడుస్తుంటే.. నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే అంటూ దగ్గరకు తీసుకుని తినిపించింది. ఈ సీన్ చూసిన ప్రేక్షకుడు కచ్చితంగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక గౌతమ్ తల్లి చేసిన పనికి నెటిజన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. మరోవైపు ప్రియాంక కోసం.. ఆమె లవర్ శివ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. హగ్గులు, ముద్దులతో ఆమెను ముంచెత్తాడు. క్యూట్ కపూల్స్ అనిపించింది. ఈ జోడి అందరినీ ఆకట్టుకుంది.
మరోవైపు బోలే భార్య కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక భోలే కూడా ఎమోషనల్ అయిపోయాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో అమరీ దీప్ భార్య తేజు వచ్చిందని తెలుస్తోంది. నవంబర్ 8న అమర్ దీప్ బర్త్ డే సందర్భంగా కేక్ తీసుకువచ్చి... కట్ చేయించింది. ఇక శోభా శెట్టి కోసం ఆమె తల్లి, యావర్ కోసం.. అతని బ్రదర్, పల్లవి ప్రశాంత్ కోసం వాళ్ల నాన్న రానున్నారు. ఇక బిగ్ బాస్ అంటే ఆటలు, పాటలు, పనిష్మెంట్స్ ఇస్తూ.. ఎంటైన్ చేస్తూంటాడు. కానీ మొదటి సారిగా ఇలా గుండెల్ని పిండిసి ప్రేక్షకులను ఎమోషనల్ చేసేశాడు అంటున్నారు నెటిజన్స్.


Click it and Unblock the Notifications











