Bigg Boss Telugu 7 ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్ టీమ్.. ఇక ఆ ప్రక్రియ లేదట!
తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే టైటిల్ తో అమెరికాలో ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన ఈ షో తర్వాత ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. హిందీలో మొదటగా వచ్చిన ఈ షో మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో వివిధ భాషల్లో కూడా బిగ్ బాస్ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభమైన బిగ్ బాస్ షో సీజన్ల మీద సీజన్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ సందడి నెలకొననుంది. అయితే బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు ఊహించని షాక్ ఇచ్చారు మేకర్స్.
ఒక్కో సీజన్: ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో.

నాగార్జునే హోస్ట్: మొదటి సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టగా.. రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని నడిపించాడు. ఇక మూడో సీజన్ నుంచి టాలీవుడ్ కింగ్ నాగార్జునే హోస్ట్ గా చేస్తూ వస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ తోపాటు బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా చేశారు. అయితే ఏడో సీజన్ కు హోస్ట్ మారనున్నారని టాక్ వచ్చిన నాగార్జునే ఫైనల్ అయినట్లు ఇటీవల విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది.
గందరగోళంగా ఉందా?: తాజాగా విడుదలైన 7వ సీజన్ ప్రోమోతో బిగ్ బాస్ సందడి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి మేకర్స్ చెబుతూ "బిగ్ బాస్ గురుంచి మీకు తెలిసిందని మీరు అనుకున్నదంతా విప్లవాత్మకంగా మారనుంది. మీకు అత్యంత ఇష్టమైన నాగార్జునతో ఈ సీజన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?. గందరగోళంగా ఉందా?. ఉత్సాహంగా ఉందా?" అంటూ ప్రోమోపై క్యూరియాసిటీ పెంచారు.

జూలై-ఆగస్ట్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమోలో "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్" అంటూ కొత్త మీనింగ్ వచ్చేలా చేశారు నాగార్జున. ఆయన చిటికివేయడంతో వస్తువులన్నీ గాల్లోకి ఎగురుతూ చూపించారు. అలాగే ఓట్లు, ముందు ఉన్న విధానాలన్నింటిల్లో మార్పులు చేయనున్నారట. ఈ షోను జూలై నెలాఖరునా, లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో ప్రారంభిస్తారని టాక్ అయితే నడుస్తోంది.
తెలిసేందుకు నో ఛాన్స్: ఎప్పటిలా సెప్టెంబర్ మొదటి వారంలో కాకుండా మిగతా సీజన్ల కంటే భిన్నంగా ఏడో సీజన్ ను ముందే ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ షోను లైవ్ టెలిక్యాస్ట్ చేస్తారనే విషయం తెలిసిందే. కానీ, ఈ ఏడో సీజన్ కు మాత్రం అలా లైవ్ టెలీకాస్ట్ లేకుండా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. అంటే ఇక కంటెస్టెంట్స్ ఏం చేసినా మనకు తెలిసే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











