For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేక్ లవ్ కాదు... రొమాన్స్ నిజమే, పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసిన బిగ్‍‌బాస్ షో జంట!

|

కేరళకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్, బిగ్ బాస్ మలయాళం షో ద్వారా పాపులర్ అయిన పర్లే మానీ వివాహం ఆదివారం కేరళలోని నిదుంబసెరిలో ఘనంగా జరిగింది. ప్రముఖ టీవీ యాక్టర్ శ్రీనిష్ అరవింద్‌ను ఆమె పెళ్లాడారు. ఇక్కడి చౌరా చర్చిలో పెళ్లి వేడుక జరిగింది. అనంతరం సిఐఏఎల్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.

వీరి పెళ్లి వేడుకకు కేరళ టీవీ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా సాయంత్రం నిర్వహించిన రెసెప్షన్ వేడుకలో సందడి చేశారు. పర్లే మాని క్రిస్టియన్ కావడంతో ఆమె మత సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. మే 8వ తేదీని శ్రీనిష్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం హిందూ పద్దతిలో మరోసారి వీరు వివాహం జరుగనుంది.

ఫేక్ లవ్ అంటూ విమర్శలు

పర్లే మానీ, శ్రీనిష్ బిగ్ బాస్ మలయాళం రియాల్టీ షో సందర్భంగా పరిచయం అయ్యారు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి రొమాంటిక్ రిలేషన్ షిప్ అప్పట్లో బిగ్ బాస్ షో టీఆర్పీ రేటింగ్స్ పెరగడానికి కూడా కారణమైంది. అయితే షోలో ఉన్న సమయంలో వీరిది ప్రేమ ఫేక్ అంటూ కొందరు విమర్శలు సైతం చేశారు.

బయటకు వచ్చాక కూడా లవ్ రిలేషన్ కొనసాగించారు

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పర్లే మానీ, శ్రీనిష్ తమ లవ్ రిలేషన్ కొనసాగించారు. కొన్ని నెలల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. ‘పర్లిష్' పేరుతో రిలీజైన్ ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది.

టీవీ హోస్ట్‌గా

మలయాళం టీవీ ఛానల్ ఎస్ ఇండియా విజన్‌ ఛానల్‌లో ప్రసారం అయ్యే మ్యూజిక్ షో ‘ఎస్ జ్యూక్‍‌బాక్స్' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పర్లే మానీ తన కెరీర్ ప్రారంభించారు. దాదాపు 250 ఎపిసోడ్లను హోస్ట్ చేశారు. ‘గుమన్ డి2' అనే షో హోస్ట్ చేయడం ద్వారా ఆమె మరింత పాపులర్ అయ్యారు.

సినిమా రంగంలోకి...

2013లో వచ్చిన ‘నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి' అనే సినిమా ద్వారా పర్లే మానీ నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హూ' అనే టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇటీవలే రిలీజైంది. అజయ్ దేవలోక దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పర్లే మానీ నటనకు మంచి పేరొచ్చింది.

శ్రీనిష్ అరవింద్

శ్రీనిష్ అరవింద్... 2014లో ఓ తమిళ షార్ట్ ఫిల్మ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు. తమిళ చిత్రం ‘కత్రామె తందానై' అనే సినిమాలో నటించిన తర్వాత అతడి దశ తిరిగింది. వరుస అవకాశాలు రావడంతో పాటు మలయాళ బిగ్ బాస్ షోలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.

English summary
Pearle Maaney, who recently shot to ultimate fame through Bigg Boss Malayalam, tied the knot with TV actor Srinish Aravind on Sunday, May 5, at the Chowara church. Another wedding ceremony will be conducted on May 8 at Srinish's residence as per Hindu traditions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more