ఆమె గొంతు పిసికాడు: బిగ్ బాస్ ఇంట్లో ఒకరిపై ఒకరు దాడి, తప్పు ఎవరిది?
బిగ్‌బాస్ అంటేనే మనకు కాంట్రవర్సీలు గుర్తుకొస్తాయి. మన తెలుగులో తక్కువకానీ... ఇతర భాషల్లోనూ రన్ అవుతున్న 'బిగ్ బాస్' షోలలో చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళం బిగ్ బాస్ రియాల్టీ షోలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఈ షోలో పోటీ దారులుగా ఉన్న సబుమోన్ అబ్దుసమద్, హిమ శంకర్ మధ్య మొదలైన డర్టీ ఫైట్ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.

గొడవ ఎలా మొదలైంది?
ఇంట్లో ఇద్దరూ కలిసి మొక్కలకు నీళ్లు పెడుతున్న సమయంలో వచ్చిన విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ సందర్భంగా సబుమోన్‌కు మానవత్వం లేదని హిమ ఆరోపించింది. దీంతో అతడు మొక్కలతో మాట్లాడుతూ హిమపై సెటైర్లు వేశాడు. అంతటితో ఆగకుండా మొక్కలకు చెంప చెల్లుమనిపించే శక్తి లేదంటూ కామెంట్ చేయడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది.

తల్లిదండ్రుల గురించి కామెంట్
అప్పటి నుండి బిగ్ బాస్ ఇంట్లో ప్రతి విషయానికి హిమ అతడిని వేధిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఫుడ్ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవతో వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విబేధాలు తారాస్థాయకి చేరాయి. నువ్వు ఆహారానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి అని సబుమోన్ అనడంతో పాటు మంచి తల్లిదండ్రులకు పుట్టిన ఎవరైనా మంచి పద్దతులు నేర్చుకుంటారంటూ తన కామెంట్ల హీట్ పెంచాడు. హిమ తన తల్లిదండ్రులను శత్రువులుగా చూస్తుందేమో? అనే విధంగా మాటలు వదిలేశాడు. దీంతో హిమ శంకర్ తీవ్ర ఆగ్రహానికి గురైంది.

మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియదు
మరో సభ్యుడితో కలిసి సబుమోన్ స్మోకింగ్ రూముకు వెళ్లగా హిమ శంకర్ కూడా వారిని ఫాలో అవుతూ గొడవపడింది. కొందరు సభ్యులు ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఆమె సబుమోన్ మీద అరుస్తూ గొడవ ఎక్కువ చేసింది. సబుమోన్‌కు మహిళలకు గౌరవం ఇవ్వడం లెలియదని, అతడు రియల్ డెవిల్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒకరిపై ఒకరు దాడి
ఈ క్రమంలో గొడవ మరింత ముదరడంతో ఒకరిపై ఒకరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకునే వరకు వెళ్లారు. ఇద్దరినీ ఇంటి సభ్యులు విడిపించే ప్రయత్నం చేశారు. రియాల్టీ షోలో ఆడ, మగ కంటెస్టెంట్స్ మధ్య ఇలాంటి గొడవ చోటు చేసుకోవడంతో ప్రేక్షకులు షాకయ్యారు.


Click it and Unblock the Notifications











