బిగ్‌బాస్ మలయాళం 6 విజేతగా ఫిజికల్ ట్రైనర్.. రన్నరప్‌కు టాప్ డైరెక్టర్ బంపర్ ఆఫర్
బిగ్‌బాస్ మలయాళం సీజన్ 6 రియాలిటీ షో ముగిసింది. దాదాపు 3 నెలలకుపైగా సాగిన ఈ షోలో ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. నువ్వా? నేనా? అన్నట్టు సాగిన ఈ షోలో అనేక వివాదాలు, భావోద్వేగాలు కనిపించాయి. చివరికి ప్రేక్షకుల మనసులను గెలుచుకొని ఫిజికల్ ట్రైనర్ విజేతగా నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ మలయాళం సీజన్ 6 ఫినాలే ఆదివారం (జూన్ 17వ తేదీన) గ్రాండ్‌గా జరిగింది. హోస్ట్ మోహన్ లాల్ ఫైనల్ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా నిర్వహించారు. సినీ తారల డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సెస్ మధ్య టాప్ 6 కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠ మధ్య సాగడంతో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఇక టాప్ 6 కంటెస్టెంట్స్‌గా జింటో బాడీ క్రాఫ్ట్, అర్జున్ శ్యామ్ గోపన్, జాస్మిన్ జాఫర్, అభిషేక్ శ్రీరామ్ కుమార్, రిషి కుమార్ టైటిల్ రేసులో నిలిచారు. అయితే ఉత్కంఠగా సాగిన ఈ పోటీలో 5వ స్థానంలో రిషి కుమార్, 4వ స్థానంలో అభిషేక్ శ్రీకుమా్, 3వ స్థానంలో జాస్మిన్ జాఫర్ నిలిచారు.
ఇక మొదటి రెండు స్థానాల్లో చివరకు అర్జున్ శ్యామ్ గోపన్, జింటో నిలిచారు. అయితే వీరిద్దరి మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో ఎవరు గెలుస్తారనే విషయంపై టెన్షన్ క్రియేట్ అయింది. చివరకు ఈ టైటిల్‌ను ఫిజికల్ ట్రైనర్ జింటో ఎగురేసుకుపోగా, రెండో స్థానంలో అర్జున్ శ్యామ్ గొపన్ నిలిచారు. విజేతకు 50 లక్షల నగదు బహుమతిని అందజేశారు.
ఇక బిగ్‌బాస్ మలయాళం 6 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన మోడల్ అర్జున్‌కు బంపర్ ఆఫర్ లభించింది. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ తన సినిమాలో నటించే ఆఫర్ ఇస్తున్నట్టు వేదికపైనే ప్రకటించారు. దాంతో అర్జున్ ఆనందంలో మునిగిపోయారు.
ఇక మార్చి 10వ తేదీన ప్రారంభమైన ఈ షోలో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ తర్వాత 6 గురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలోకి రప్పించారు. ఫినాలో బిగ్ బాస్ మలయాళం 4 విన్నర్ దిల్షా ప్రసన్నం తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.


Click it and Unblock the Notifications











