Bigg Boss Telugu 8: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. రెంట్‌తో కలిపి ఎన్ని కోట్లంటే!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరో దానికీ అందనంత స్పందనను దక్కించుకుని ఎనిమిదేళ్లుగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అస్సలు అంచనాలు లేకుండానే మన భాషలోకి పరిచయం అయిన దీనికి.. ప్రేక్షకులు ఆదరణను అందించారు. ఫలితంగా ఈ షో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని నేషనల్ రేంజ్‌లో టాప్ ప్లేస్‌కు చేరింది. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మొదలెట్టబోతున్నారు. దీనికి హోస్టుగా చేయబోతున్న అక్కినేని నాగార్జునకు నిర్వహకులు ఎంత రెమ్యూరేషన్ చెల్లిస్తున్నారు అన్న వివరాలపై లుక్కేద్దాం పదండి!
ఏడు సీజన్లు.. ముగ్గురు స్టార్లు
తెలుగులో బిగ్ బాస్ షో ఏడు సీజన్లను ఎవరూ ఊహించని విధంగా భారీ స్పందనతో పూర్తి చేసుకుంది. ఇది ఇంతలా సక్సెస్ అయిందంటే దానికి హోస్టులు కూడా కారణమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్‌ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్ నుంచి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

నాగార్జున ఎంట్రీతో భారీగానే
బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి షోలోకి అక్కినేని నాగార్జున హోస్టుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి షో రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఆయన నడిపించిన అన్ని సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. ఫలితంగా తెలుగు బిగ్ బాస్ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో ఆయననే నిర్వహకులు కొనసాగిస్తున్నారు.
8వ సీజన్‌కు ఈ స్టార్ హీరోనే
బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఎనిమిదో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన పనులను కూడా ఇప్పటికే మొదలెట్టేశారు. ఇక, ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై కొన్ని లీకులు కూడా వచ్చేశాయి.
నాగార్జున రెమ్యూనరేషన్ లీక్
మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్‌కు హోస్ట్ అక్కినేని నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. దీనికోసం ఆయనకు బిగ్ బాస్ నిర్వహకులు భారీ మొత్తాన్నే చెల్లిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
8వ సీజన్ కోసం అన్ని కోట్లు
బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం అక్కినేని నాగార్జున రూ. 25 కోట్లు తీసుకుంటున్నాడట. ఇది అతడి షో జర్నీలోనే అత్యధిక మొత్తం అని తెలిసింది. మూడో సీజన్ కేవలం రూ. 3.80 కోట్లు మాత్రమే తీసుకున్న నాగ్.. ఆ తర్వాత రూ. 6 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా పది కోట్లు పెంచేశారని సమాచారం.
స్టూడియో రెంట్‌తో కలిపితే
ఎనిమిదో సీజన్‌కు రూ. 25 కోట్లు తీసుకోవడం ద్వారా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అక్కినేని నాగార్జున అరుదైన రికార్డును క్రియేట్ చేయనున్నాడట. ఇక, ఈ రెమ్యూనరేషన్‌తో పాటు ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బిగ్ బాస్ హౌస్ సెట్‌కు రెంట్ కూడా వస్తుందట. ఇవన్నీ కలుపుకుంటే నాగార్జునకు 8వ సీజన్ వల్ల రూ. 30 కోట్ల వరకూ ఆదాయం రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











