ఆ కంటెస్టెంట్‌ ఓటింగ్‌పై నాగార్జున ప్రభావం: బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే విపరీతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది బిగ్ బాస్. నాలుగేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో బోలెడన్ని రికార్డులు క్రియేట్ చేసిందీ షో. అందుకే అన్ని భాషలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. ఇదిలా ఉండగా, గత వాటితో పోలిస్తే ఈ నాలుగో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. షో చివరి స్టేజ్‌కు చేరుకున్న సమయంలో మరింత రంజుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కంటెస్టెంట్‌ ఓటింగ్‌పై హోస్ట్ నాగార్జున ప్రభావం కనిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ బయటకు వస్తోంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

రక్తి కడుతోన్న చివరి వారం ఆట

రక్తి కడుతోన్న చివరి వారం ఆట

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుని రికార్డు క్రియేట్ చేసింది. అప్పుడు దక్కిన గ్రేట్ స్టార్ట్‌ను చక్కగా వాడుకున్న నిర్వహకులు షోను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇక, ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్లు అందరినీ నామినేట్ చేసి.. టాస్కుల రూపంలో వాళ్లను వాళ్లు నిరూపించుకునేలా చేస్తున్నారు నిర్వహకులు.

ఫినాలే వీక్‌లోకి ఎవరు వెళ్తారు.?

ఫినాలే వీక్‌లోకి ఎవరు వెళ్తారు.?

ప్రస్తుతం షోలో ఆరుగురు సభ్యులు ఉండగా, అందులో అఖిల్ సార్థక్ ఇప్పటికే ఫినాలేలో అడుగు పెట్టేశాడు. సో.. మిగిలిన ఐదుగురిలో నలుగురు మాత్రమే చివరి వారానికి చేరుకుంటారు. వీరిలో అభిజీత్, సయ్యద్ సోహెల్ రియాన్ టాప్ -5లో ఉండడం ఖాయం. అంటే మిగిలిన రెండు స్థానాల కోసం ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

ప్రేక్షకుల చేతిలోనా.. బాస్ దగ్గరా

ప్రేక్షకుల చేతిలోనా.. బాస్ దగ్గరా

ఈ వారం నామినేషన్‌లో ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. దాన్ని డిసైడ్ చేసేది ప్రేక్షకులే అని షో నిర్వహకులు చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్లు చూసుకుంటే పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో ఈ వారం కూడా దత్త పుత్రికను సేఫ్ చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పదు.

ఆమె ఓటింగ్‌పై నాగార్జున ప్రభావం

ఆమె ఓటింగ్‌పై నాగార్జున ప్రభావం

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో.. మిగిలిన వారితో పోలిస్తే ఆరియానాకు ప్రేక్షకుల నుంచి మద్దతు బాగానే ఉంది. ఆ తర్వాత దేత్తడి హారికకు సపోర్ట్ లభిస్తోంది. అయితే, మోనాల్ విషయంలో ఏదైనా జరగొచ్చు కాబట్టి.. హారిక తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ఓటింగ్‌పై అక్కినేని నాగార్జున ప్రభావం బాగా కనిపిస్తోందనే చెప్పాలి.

భయంతో వేరే వాళ్లకు క్లోజ్ అవుతూ

భయంతో వేరే వాళ్లకు క్లోజ్ అవుతూ

రెండు వారాల క్రితం బిగ్ బాస్ దెయ్యం టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హారిక అట్టర్ ఫ్లాప్ అయిందని అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వరస్ట్ కెప్టెన్ అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ‘నీ ఆట నువ్వు అడు.. లేకపోతే కష్టాలు తప్పవు' అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హారిక.. అభిజీత్‌కు దూరం అవడంతో పాటు వేరే వాళ్లకు దగ్గర అయింది.

Recommended Video

Nagarjuna Akkineni To Fans On Apple Products
బాస్ ప్లాన్ మామూలుగా లేదుగా

బాస్ ప్లాన్ మామూలుగా లేదుగా

నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌తో అభిజీత్‌ను నామినేట్ చేయడంతో పాటు అతడితో కలవడానికే భయపడిపోతోంది హారిక. దీని ప్రభావం ఈ వారం ఓటింగ్‌పై పడుతోంది. ఇప్పటి వరకూ ఆమెను సపోర్ట్ చేస్తూ వచ్చిన అభిజీత్ ఫ్యాన్స్.. ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. దీంతో అతడికి ఓట్లు బాగా పోలవడంతో పాటు హారికకు చాలా తక్కువ పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X