Bigg Boss Elimination: సంచలనంగా మిడ్‌ వీక్ ఎలిమినేషన్.. ఆ టాప్ ప్లేయర్ ఔట్.. ఏ రోజు వెళ్లిపోతాడంటే!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. దేశంలోనే టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. ప్రసారం అయిన ప్రతిసారీ భారీ స్పందనను అందుకుంటోన్న ఇది.. వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. ఇందులో చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌ పెట్టి షాకివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ వివరాలు బయటకు వచ్చాయి? ఆ పూర్తి సంగతులు మీరే చూసేయండి!

చివరి వారంలో 6గురు ఎంట్రీ : బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏడుగురు సభ్యుల్లో శోభా శెట్టి గత వారంలో ఎలిమినేట్ అవడంతో.. మిగిలిన ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి అడుగు పెట్టారు. అందులో ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్‌లు ఉన్నారు.

Bigg Boss Mid Week Elimination: Priyanka Jain or Ambati Arjun Eliminate In Mid Week

మధ్యలోనే ఒకరు బయటకు : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కూడా ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్‌లోకి పంపించారు. అయితే, వీళ్లలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవబోతున్నట్లు తెలిసింది. 14వ వారం నుంచి జరుగుతున్న ఓటింగ్‌లో ఇప్పుడు ఎవరికైతే తక్కువ ఓట్లు నమోదు అవుతాయో వాళ్లే ఎలిమినేట్ అవుతారు. అంటే.. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు సభ్యులే ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది.

శుక్రవారం ఔట్.. విజేతనలా : ప్రస్తుతం నడిచే సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి (మిడ్ వీక్) ఎలిమినేషన్ ప్రక్రియ శుక్రవారం రాత్రి జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి టాప్ 5 సభ్యులకు మాత్రమే ఓటింగ్ జరగబోతుంది. వీళ్లలో విజేతను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం (డిసెంబర్ 17వ తేదీ) సాయంత్రం ఆరు లేదా ఏడు గంటలను నుంచి ప్రసారం కాబోతుంది.

ఫుల్ ఓటింగ్.. మార్పులతోనే : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఒకరు మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు. మిగిలిన వాళ్లలోనూ ఒకరు మాత్రమే విజేతగా నిలబోతున్నారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఓటింగ్ జరుగుతుందని అంటున్నారు.

Bigg Boss Mid Week Elimination: Priyanka Jain or Ambati Arjun Eliminate In Mid Week

టైటిల్ రేసులో ఆ ఇద్దరూ : తాజా సీజన్‌లోకి మొత్తం 19 మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. అందులో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరిలు మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతీరుతో టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తున్నారు. అందుకే వీళ్లు పలుమార్లు ఎలిమినేషన్ తప్పించుకుని ఫినాలేకు చేరారు. అయితే, ఫినాలే వీక్‌లో మాత్రం పల్లవి ప్రశాంత్, శివాజికే ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు సమాచారం.

ఎవరు ఏ స్థానంలో అంటే : బిగ్ బాస్ ఏడో సీజన్ ఫినాలే వీక్‌లో భాగంగా జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. అతడి తర్వాత అంటే రెండో స్థానంలో శివాజి, మూడో స్థానంలో అమర్‌దీప్ చౌదరి ఉన్నాడని తెలిసింది. అలాగే, ప్రిన్స్ యావర్ నాలుగో స్థానంలో ఉన్నాడని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తద్వారా వీళ్లంతా తుది దశకు చేరే అవకాశం కనిపిస్తోంది.

అతడినే పంపుతారంటూ : ఫినాలే వీక్‌కు సంబంధించిన ఓటింగ్‌‌లో ప్రస్తుతం అంబటి అర్జున్ ఐదో స్థానంలో ఉండగా, ప్రియాంక జైన్ ఆరో స్థానానికి పడిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ఈ ఇద్దరిలోనే ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, టాప్ 5లో అమ్మాయిని ఉంచాలని చూస్తున్నారని, అందుకే అర్జున్‌ను పంపబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X