Bigg Boss Telugu 7: రతిక విషయంలో బిగ్‌బాస్ దారుణ మోసం.. ఇదేంది మావా ఇట్లా చేస్తివి?

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍ లోకి మొత్తంగా 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. ఇక ఎవరికి తగ్గట్లు వారు ఫెర్మామెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక టాస్క్ లు, ట్విస్టులతో షో సరదా సరదాగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. నాలుగవ రోజు రతిక విషయంలో బిగ్ బాస్ అందరినీ మిస్ అండర్ స్టాండ్ చేశాడని తెలుస్తోంది. ఆ వివరాల్లిక వెళితే...

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ఉల్టా పల్టా అంటూ... ఊహకు అందని రేంజులోనే షో నడుస్తోంది. సీక్రెట్ టాస్క్ లు, ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఎట్టకేలకు తొలి వారం ముగించుకుంటోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఇదిలా ఉండగా నిన్న ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోతో బిగ్ బాస్ అందరినీ తప్పు దోవ పట్టించారు.

Bigg Boss Telugu 7:

ఆ ప్రోమోలో అందరి కంటే ఎక్కువగా బిగ్ బాస్ ను మెప్పించిన వారిని మూడవ కంటెస్టెంట్ గా గుర్తిస్తామని ప్రకటించాడు. ఇక అందరూ తమ తమ ఫెర్మామెన్స్ లతో ఆకట్టుకోగా... మరోవైపు రతికను బిగ్ బాస్ ఎవరినైనా మిస్ అవుతున్నావా అంటూ అడిగాడు. దీనికి రతిక మిస్ అవుతున్నావా అని అడిగితే ఎవరైనా మొదట పేరెంట్స్ ను మిస్ అవుతున్నాం అంటారు. పేరెంట్స్ పక్కన మిస్ అయితే అతనే అంటూ తెగ ఎమోషనల్ అయింది.

Bigg Boss Telugu 7:

ఇక దీనితో రతిక బాయ్ ఫ్రెండ్ కోసం తెగ ఎమోషనల్ అవుతుందని అంతా అనుకున్నారు. అంతేనా.. ఓ పాట ప్లే చేయాలా అని... రాహుల్ పాడిన పిల్లా సాంగ్ ప్లే చేశాడు. నిజానికి నిన్నటి షో లో మాత్రం వేరే పాటలు ప్లే చేసి... బిగ్ బాస్ అందరినీ తప్పు దోవ పట్టించేశాడు.

ఆ ప్రోమో చూసిన వారంతా... రాహుల్ పాట విని.. రతిక తెగ ఎమోషల్ అయిందని అనుకున్నారు. ఇక తాజా ఎపిసోడ్ చూసి... జనాలు బిగ్ బాస్ మావా ఏంటి ఇలా చేశారు ఏంటి అంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ప్రస్తుతం వారం నామినేషన్‌‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ఇద్దరు సేఫ్ జోన్‌ లో ఉండగా.... ఓటింగ్‌లో చివరిగా ఉన్న వారిలో ప్రిన్స్ యావర్, హీరోయిన్ కిరణ్ రాథోడ్ డేంజర్ జోన్‌ లో ఉన్నారు.

Bigg Boss Telugu 7:

ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే.. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఇక ఈ వీకెండ్ లో మరో 8 మంది ఎంటర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇంకో ఎనిమిది మంది వస్తే హౌజ్ లో రచ్చ మామూలుగా ఉండదని తెలుస్తోంది. మరి ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X