కన్నీరు ఆగట్లేదు అంటూ నాగార్జున ఎమోషనల్.. అతడి పరిస్థితి చూసి షాక్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి 4 వారాలకు చేరుకుంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం లో పై పెద్దగా ఆసక్తి అయితే కనిపించడం లేదు. ఎప్పటిలానే రెండు రోజుల ముందుగానే ఆ సెలబ్రిటీ పేరు కూడా బయటకు లీక్ అయ్యింది. ఇక గత రెండు వారాల నుంచి కూడా పెద్దగా ఏమీ ఆకట్టుకోవడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. శని ఆదివారాల్లో నాగార్జున కూడా హోస్టింగ్ తో అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోవడం లేదు అని కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ఈ సారి మరింత ఫన్ అందించడానికి ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ప్రసారం కాబోయే ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్స్ కు వివిధ రకాల టాస్క్ లు ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశారు.

నాగార్జునకు హౌస్ మెంట్స్ సర్ ప్రైజ్

నాగార్జునకు హౌస్ మెంట్స్ సర్ ప్రైజ్

నాగార్జున కెరీర్లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన టువంటి స్పెషల్ మూవీ నిన్నే పెళ్లాడతా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హౌస్ మెంట్స్ అందరూ కూడా ఆ సినిమాకు సంబంధించిన పాటలతో సెలబ్రేషన్ చేసుకున్నారు. పాటలకు వారి స్టైల్ లో స్టెప్పులు వేస్తూ అలాగే అందులోని సన్నివేశాలను కూడా ఇమిటేట్ చేస్తూ సందడి చేశారు.

ఇక ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ షణ్ముఖ్ జస్వంత్ సిరి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. గ్రీకు వీరుడు పాటకు హౌస్ లోని అమ్మాయిలందరూ కూడా ఎంతో స్పెషల్ గా డాన్స్ చేయడంతో నాగార్జున సర్ ప్రైజ్ అయ్యారు. ఇక షణ్ముఖ్ జస్వంత్ సిరి రొమాంటిక్ పాటకు లవ్ సింబల్ ని కూడా చూపించారు.

కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

ఇక ఈ సినిమాలో నిన్నే పెళ్ళాడుతా టైటిల్ సాంగ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఎంతో సందడిగా డాన్స్ చేయడంతో నాగార్జున కూడా ఎమోషనల్ అయ్యారు. కంటెస్టెంట్స్ హడావిడి చూసిన తర్వాత ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ తెలియజేశారు. ఇక నాగార్జున చెప్పినట్లుగా హౌస్ మేట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా డాన్స్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సిరిని కూడా మరోసారి బ్రెయిన్ కూడా వాడు అంటూ నాగార్జున పంచ్ వేశారు.

రవి బ్యాక్ పై కొట్టిన సిరి

ఇక సిరి మరోసారి తన అల్లరితో రవికి పెద్ద షాక్ ఇచ్చింది. యాంకర్ రవి ఒంగి ఉండటంతో అతని బ్యాక్ పై గట్టిగానే కొట్టేసింది. దీంతో రవి కూడా హడలిపోయాడు. అది చూసి నాగార్జున గట్టిగా నవ్వేశారు. ఇక మరోవైపు విశ్వను ప్రియాంక అన్నయ్య అన్నా ఓకే కానీ సన్నీని మాత్రం అస్సలు అనుకోవద్దని నాగార్జున గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

రెచ్చిపోయిన ప్రియాంక విశ్వ

రెచ్చిపోయిన ప్రియాంక విశ్వ

ఇక ప్రియాంక విశ్వ మధ్యలో నాగార్జున సెట్ చేసిన సాంగ్ కు రెచ్చిపోయి పెర్ఫామెన్స్ ఇచ్చారు. నరుడా ఓ నరుడా పాటకు విశ్వ ప్రియాంక ఇద్దరు కూడా చాలా రొమాంటిక్ గా అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా ప్రియాంక విశ్వం షర్ట్ ను కూడా తీసేసింది. ఒక విశ్వ తన బాడీని చూపిస్తూ తనదైన శైలిలో హావభావాలను చూపించాడు. ఇక పాటలో ప్రియాంక విశ్వ ఇద్దరు కూడా మరింత లీనం అవుతూ కనిపించడంతో నాగార్జున కూడా ఓకే ఓకే అంటూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

Recommended Video

#BiggBossTelugu ఇతను Eliminate అవడం పక్కా.. టాప్ 5 వీరే!! || Filmibeat Telugu
తలపట్టుకున్న నాగార్జున

తలపట్టుకున్న నాగార్జున

ఇక విశ్వా ప్రియాంక డాన్స్ చేస్తుంటే కూడా అందరూ చాలా విభిన్నంగా చూశారని. అయితే నాగార్జున మాత్రం మనస్ ను గమనించాను అని చెప్పడంతో అందరూ మరో సారి గట్టిగా నవ్వేశారు. తర్వాత ప్రియాంక మానస్ మధ్యలో మరొక టాస్క్ వచ్చేసినట్లు తెలుస్తోంది. మానస్ పరిగెత్తుతూ ఉంటే ప్రియాంక అతని పట్టుకోవడానికి ఫాస్ట్ గా వెళ్లే ప్రయత్నం చేసింది. ఇక స్విమ్మింగ్ ఫుల్ పక్కన సడన్ గా మానస్ కిందపడిపోయాడు. ఇక అది చూసిన నాగార్జున తల పట్టుకొని షాక్ అయ్యారు. ఇక హౌస్ లో ఈ రోజు ఏమవుతుందో అని ఆ ఆసక్తిని కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X