Bigg Bossలో నవరాత్రి స్పెషల్.. మంగ్లీ పాటలు, హైపర్ ఆది పంచులు, పూజా-అఖిల్ స్పెషల్ ఎంట్రీ!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 5వ వారం చివరికి చేరింది. నిన్న శనివారం నాడు నాగార్జున హాజరై హౌస్ సభ్యులందరిలో ఉత్సాహం నింపారు. ఇక ఈ రోజు బిగ్ బాస్ ఫైవ్ నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. సాధారణంగా శని ఆదివారాల్లో 9 గంటల నుంచి బిగ్ బాస్ షో ప్రసారం కానుండగా ఈ రోజు నవరాత్రి స్పెషల్ కారణంగా 6 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది.. ఈ నవరాత్రి స్పెషల్ ప్రోగ్రాంలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంచారు. సింగర్ మంగ్లీ పాటలు, హైపర్ ఆది పంచులు అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కపుల్ పూజా హెగ్డే, అక్కినేని అఖిల్ తదితరులు హౌస్ లో కనిపించి జోష్ పెంచారు. ఆ వివరాల్లోకి వెళితే

అందాల పోటీ
ఈరోజు హౌస్ లోకి నాగార్జున ఆడుతూ పాడుతూ ఎంటరయ్యారు ఎంటర్ అయిన తర్వాత హౌస్ లో రెండు బొమ్మలు పెట్టి వాటికి రెండు టీములుగా విడగొట్టారు. ఒక్కో టీమ్ సభ్యులు ఆ బొమ్మలను అందంగా అలంకరించాల్సి ఉంటుంది. ఇక అలా రెండు టీములు సభ్యులు పోటాపోటీగా అలంకరిస్తున్నారు. ఇంకా సేపు ఉంటే ప్రాణం కూడా పోసే వాళ్ళమని రవి అంటూ ఉండగానే వాళ్ళ టీం బొమ్మ కింద పడిపోవడం కనిపిస్తోంది.

హైపర్ ఆది కౌంటర్లు
ఇక ఆ తర్వాత మంగ్లీ పాటలు పాడుతూ ఉండడం కూడా కనిపించింది. ఇక బయట ఎలా అయితే త్రిమూర్తులు అంటూ సిరి షణ్ముఖ్ అలాగే జస్వంత్ గురించి మాట్లాడుకుంటున్నారో అదే విషయాన్ని హైపర్ ఆది కూడా ప్రస్తావించారు. హౌస్ లోపలికి పోలీస్ డ్రెస్ లో ఎంటర్ అయిన ఆది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఏమంటారు సార్ అని నాగార్జునను అంటే ఆయన త్రిమూర్తులు అంటారు అని చెప్పుకొచ్చాడు.
హమీద వాకిట్లో శ్రీరామ్ చెట్టు
మరో పక్క హమీద శ్రీరామ్ ఇద్దరిని ఏడిపిస్తూ మీరు బయటకు వచ్చాక మీ ఇద్దరి మీద ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారని హమీద వాకిట్లో శ్రీరామ్ చెట్టు అని అంటుంటే వాళ్ళిద్దరు సిగ్గు పడుతూ కనిపించారు. ఇక ప్రోమోలో హెబ్బా పటేల్ సాంగ్ పర్ఫామెన్స్ కూడా కనిపిస్తోంది. హౌస్ లోకి ఎంటరయిన పూజా హెగ్డే అలాగే అక్కినేని అఖిల్ కూడా హౌస్ మేట్స్ తో కాసేపు మాట్లాడారు.

పూజా హెగ్డే, అక్కినేని అఖిల్
లోపల చాలా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు అని చెబుతూ ఆమె ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా మీరంతా క్యూట్ గా మాట్లాడొద్దు అంటూ మానస్ పూజా హెగ్డేకి చెప్పడం కనిపించింది. సిరి అఖిల్ బాబు తోపు అనడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత హౌస్ సభ్యులందరూ ఏదో ఒక స్కిట్ లాంటిది ఫామ్ చేసి చూపిస్తూ ఉంటే అందులో షణ్ముఖ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నాగార్జున నేను దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడం కూడా ప్రోమోలో చూపించారు.
Recommended Video

సీక్రెట్ రూమ్ అనుమానం
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ల మీద ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా నటిస్తోంది. ఇక మీదట అయినా శ్రీ రామ్ తన ఆట తాను ఆదుకుంటానని భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ లవ్ ట్రాక్ లను అంత ఈజీగా విడదీయదు కాబట్టి ఏదైనా సీక్రెట్ రూమ్ కి పంపించే ఏర్పాట్లు చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానిమీద ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది


Click it and Unblock the Notifications











