బిగ్‌బాస్‌లో అల్లు అర్జున్ హంగామా.. డీజే హోరు.. నూతన్ షాకింగ్ ఎంట్రీ.. కెప్టెన్‌గా పూజా!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 54 Highlights Pooja Became As A Captain

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 52వ రోజు ఆహ్లాదకరంగా సాగింది. లగ్జరీ బడ్జెట్ గేమ్ ఆసక్తికరంగా ఉండటం గమనార్హం. అలాగే ఇంట్లోకి నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల ఎంట్రీతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొన్నది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా డీజే కార్యక్రమాన్ని బిగ్‌బాస్ నిర్వహించారు. కొత్త కెప్టెన్‌గా పూజా రాంచంద్రన్ ఎంపికయ్యారు. ఇంకా ఏమి జరిగిందంటే..

జైలు కార్డుతో రిలీజ్

జైలు కార్డుతో రిలీజ్

గణేష్‌ను కౌశల్ జైలు కార్డుతో రిలీజ్ చేయడంపై ఇంట్లో బాబు గోగినేని బృందం మీటింగ్ పెట్టింది. గణేష్‌ను ముందు అడిగి కౌశల్ జైలు కార్డు ఉపయోగించాల్సిందని తలోకరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో బిగ్‌బాస్ ప్రతీ ఒక్కరికి ఓ కవర్‌‌తోపాటు ఓ గిఫ్టు ప్యాక్ పంపించారు. కవర్లో వచ్చిన నంబర్ ప్రకారం గిఫ్టులపై ఉన్న నంబర్‌ను మ్యాచ్ చేసి బహుమతులను అందుకొన్నారు. కానీ గణేష్‌, రోల్ రైడాకు స్పెషల్ కవర్లు ఇచ్చారు. దాని ప్రకారం వారికి కన్ఫేషన్ రూమంలో రోల్ రైడాకు, గణేష్‌కు స్టోర్ రూమ్‌లో గిఫ్టులను పెట్టారు.

రోల్ రైడా, గణేష్‌కు భలే షాక్

రోల్ రైడా, గణేష్‌కు భలే షాక్

రోల్ రైడా, గణేష్‌లు వారికి వచ్చిన గిఫ్టులను తెచ్చుకోవడానికి వెళ్లిన వీరికి భలే షాక్ తగిలింది. ఆయా రూమ్‌లో రైడాకు శ్యామల, గణేష్‌కు నూతన్ నాయుడు ఎంట్రీతో దిమ్మతిరిగింది. నూతన్, శ్యామలను చూసి ఇంటిసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

శ్యామల ఎంట్రీపై బాబు గోగినేని

శ్యామల ఎంట్రీపై బాబు గోగినేని

నూతన్ నాయుడు, శ్యామల ఎంట్రీపై బాబు గోగినేని, తనీష్, అమిత్, దీప్తి సునైన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆడియెన్‌గా ఉంటే ఎవరికి ఓటేస్తారు అని అడుగగా.. నేను శ్యామలకు ఓటు వేస్తాను అని తనీష్ అన్నాడు. నూతన్ నాయుడిపై నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని తనీష్ పేర్కొన్నాడు.

నూతన్ రాకతో కౌషల్‌కు

నూతన్ రాకతో కౌషల్‌కు

నూతన్ రాకతో కౌషల్‌కు ఓ దోస్త్ దొరికాడు. బయట జరిగిన విషయాలన్నీ కౌశల్‌కు నూతన్ వెల్లడించాడు. ఇంట్లో సభ్యుల గురించి ఇంట్లో జరిగిన గొడవల గురించి కౌశల్‌కు వివరించాడు.

కెప్టెన్ ఎంపిక టాస్క్‌ ప్రక్రియ కోసం

కెప్టెన్ ఎంపిక టాస్క్‌ ప్రక్రియ కోసం

కెప్టెన్ ఎంపిక టాస్క్‌ ప్రక్రియ కోసం డీజే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. సామ్రాట్, పూజా, రోల్ రైడా డీజేలుగా వ్యవహరిస్తారు. వారి ముందు ఇంటి సభ్యులు డ్యాన్స్ చేయాలి. ఏ డీజే ముందు ఎక్కువ మంది డ్యాన్స్ చేస్తారో వారిని ఇంటికి కొత్త కెప్టెన్‌గా ఎంపికవుతారు.

డీజే కార్యక్రమంలో పూజా

డీజే కార్యక్రమంలో పూజా

డీజే కార్యక్రమంలో పూజా మొదటగా డీజేగా వ్యవహరించింది. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తిలోని పాట కమ్ టూ ద పార్టీ పాటకు బాబు గోగినేని డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్యామల డ్యాన్స్‌తో అదరగొట్టింది. గీతా స్టెప్పులతో స్టయిల్ మెయింటెన్ చేసింది.

ఇంటి సభ్యులు డ్యాన్స్‌తో

ఇంటి సభ్యులు డ్యాన్స్‌తో

బిగ్‌బాస్ ప్లే చేసిన రెండో పాటకు ఇంటి సభ్యులు డ్యాన్స్‌తో హోరెత్తించారు. తన సొంత పాటను రోల్ రైడా ప్లే చేయగా ఇంటి సభ్యులు ఆనందంగా డ్యాన్స్ చేశారు. దే తడి పాటను రోల్ రైడా పాడుతుండగా దీప్తి నల్లమోతు, గణేష్, నూతన్ నాయుడు డాన్సులతో అదరగొట్టారు.

కొత్త కెప్టెన్‌గా పూజా రాంచంద్రన్

కొత్త కెప్టెన్‌గా పూజా రాంచంద్రన్

బిగ్‌బాస్ ప్లే చేసిన మల్లన్న చిత్రంలోని అయేగ్రా పాటను ప్లే చేశారు. పాటతోపాటు రెయిన్‌ను కురిపించడంతో వర్షంలోనే ఇంటి సభ్యులు డ్యాన్స్ చేశారు. చాలా సేపు వర్షంలో తడుస్తూ తన్మయత్వంతో ఆడిపాడారు. విరామ సమయంలో మద్యం తాగి తూలినట్టు నటించారు. తనీష్, రోల్ రైడా తాగినట్టు అద్భుతంగా నటించారు. నాలుగోపాటగా సరైనోడు చిత్రంలోని బ్లాక్ బస్టరే పాటను ప్లే చేయగా తనీష్, దీప్తి సునైనా, కౌశల్ జోష్‌తో డ్యాన్స్ చేశారు. చివరకు కొత్త కెప్టెన్‌గా పూజా రాంచంద్రన్ ఎంపికయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X