శ్రీముఖికి బిగ్‌బాస్ షాక్.. అత్యుత్సాహానికి గట్టి దెబ్బే తగిలిందిగా!

Recommended Video

Bigg Boss Telugu 3: బాబా శాపంతో శిల్ప అవుట్!! | Episode 57 Highlights | Filmibeat Telugu

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం వచ్చిందంటే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆదివారం ఎంత ఉత్కంఠగా ఎలిమినేషన్ గురించి ఎదురు చూస్తుంటారో.. నామినేషన్ ప్రక్రియ గురించి అంతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్‌లో సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యులను షాక్ గురిచేసినట్టు అనిపిస్తుంది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోయిన శిల్ప చక్రవర్తి బిగ్‌బాంబ్ ఇంటి సభ్యులకు ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..

మహేష్‌పై బిగ్‌బాంబ్

మహేష్‌పై బిగ్‌బాంబ్

ఇంటిలో నిద్ర ఎవరు ఎక్కువగా పోతారో వారిపై బిగ్‌బాంబ్ వేయాలన్నాడు. హోస్ట్ నాగార్జున అడిగితే శిల్ప.. మహేష్ విట్టా పేరు చెప్పింది. దాంతో ఈ వారం బిగ్‌బాంబ్ మహేష్ విట్టాపై పడింది. మహేష్ గానీ, ఇంటి సభ్యులు ఎవరైనా గానీ నిద్రపోయిన సమయంలో కుక్కలు మొరిగితే వెంటనే స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి. బిగ్‌బాస్ ఆదేశాలు వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలి అని నాగ్ చెప్పారు.

సెకండ్ పార్ట్ మొదలైనా మారని హౌస్ మేట్స్..

సెకండ్ పార్ట్ మొదలైనా మారని హౌస్ మేట్స్..

ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని.. తొమ్మిదో వారంలో అడుగుపెడుతున్న ఇంటి సభ్యులు ఈ ఆటను ఇంకా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. టాస్క్ అన్నా.. బిగ్ బాస్ రూల్స్ అన్నా ఎవరికీ లెక్క లేకుండా పోయింది. అందుకే బిగ్ బాంబ్ రూపంలో పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు. మరి ఇప్పటి నుంచైనా వారిలో ఏమైనా మార్పు వస్తుందో చూడాలి.

ఎవరు పడుకున్నా.. మహేష్ పూల్ లో దూకాలి...

ఎవరు పడుకున్నా.. మహేష్ పూల్ లో దూకాలి...

బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన నిబంధన.. మధ్యాహ్న సమయంలో నిద్రించ కూడదని. అయితే ఈ రూల్ ను ఎవ్వరూ సరిగా పాటించడం లేదు. అయితే మహేష్ మాత్రం ఏ సమయంలో చూసినా నిద్ర పోతూనే ఉంటాడు అని ఇంటి సభ్యులు చెప్పగా... ఎవరు నిద్రపోయినా.. కుక్కలు మొరిగినా.. మహేష్ స్విమ్మింగ్ పూల్ లో దూకాలని బిగ్ బాంబ్ వేశారు.

శ్రీముఖి బిగ్ షాక్..

శ్రీముఖి బిగ్ షాక్..

అన్నింటా అత్యుత్సాహం ప్రదర్శించే శ్రీముఖికి ఏ వారం బిగ్ షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. ఏ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. గార్డెన్ ఏరియా లో ఓ టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేశాడు. ఫోన్ రింగ్ అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ చేసింది. ఈ అతే ఆమె కొంప ముంచింది. ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీముఖిని నేరుగా నామినాటే చేస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. దీoతో ఆమె ముఖం తెల్లబోయింది. మరి బిగ్ బాస్ ఇందులో ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా? ఈ వారం ఎవరెవరు నామినేషన్ లోకి వస్తారు? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X