For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సభ్యులకు బిగ్‌బాస్ కఠిన శిక్ష.. అందరికీ ఎలిమినేషన్ ముప్పు.. కౌశల్, గీతాకు వార్నింగ్

    |
    Bigg Boss Season 2 Telugu : 100 Day Highlights

    బిగ్‌బాస్‌లో 99వ రోజు చాలా గందరగోళంగా ముగిసింది. ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి. ఇంటి నిబంధనలు, టాస్క్‌ల రూల్స్ గురించి భారీగా వాదులాడుకొన్నారు. ఇంటి నిబంధనలు పాటించడం లేదని బిగ్‌బాస్ కఠిన శిక్ష విధించాడు. కౌశల్‌ను, గీతను తీవ్రంగా మందలించాడు. ఇంతకు ఇంటిలో ఏం జరిగిందంటే..

    సామ్రాట్, రైడాకు టాస్క్

    సామ్రాట్, రైడాకు టాస్క్

    ఇంటిలో సామ్రాట్, రోల్ రైడాకు బిగ్‌బాస్ ఓ టాస్క్ నిర్దేశించాడు. రోల్ రైడాను రిపోర్టర్‌గా సామ్రాట్‌ను ఫొటోగ్రాఫర్‌గా పనిచేయాలని టాస్క్ ఇచ్చాడు. కెమెరాను ఉపయోగించి దానిలో ఉండే ఆప్షన్లను ఉపయోగించుకొని ఫొటోలు, వీడియోలు తీయాలని సూచించాడు.

    గీతా మాధురి, తనీష్ ఫోటోలు తీసి

    గీతా మాధురి, తనీష్ ఫోటోలు తీసి

    రిపోర్టర్‌గా రైడా, ఫొటోగ్రాఫర్‌గా సామ్రాట్ కెమెరాను ఛార్జింగ్ పెట్టి ఆ తర్వాత ఫొటోలు తీయడం ప్రారంభించారు. బాత్రూంలో గీతామాధురిని, తనీష్‌ను ఫొటోలు తీశాడు. అలాగే ఇంటి సభ్యుల మధ్య జరిగిన గొడవను చిత్రీకరించాడు.

    కౌశల్‌కు బిగ్‌బాస్ ఝలక్

    కౌశల్‌కు బిగ్‌బాస్ ఝలక్

    కౌశల్ పేపరుపై రాసిన స్లిప్పులను బిగ్‌బాస్ తీసుకొన్నాడు. పేపర్‌పై ఏం రాశారు అని కౌశల్‌ను అడుగగా.. తన 100 రోజుల జర్నీని, ఇంటి సభ్యులు నిష్క్రమించిన విషయాలను గుర్తు చేసుకొని రాశాను. తిరిగి వాటిని డస్ట్ బీన్‌లో వేద్దామని అనుకొన్నాను అని అన్నాడు. దాంతో ఆ పేపర్లను స్టోర్ రూంలో పెట్టమని సూచించగా కౌశల్ ఆ పని పూర్తి చేశాడు.

    రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

    రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

    బిగ్‌బాస్ ఇంటి నిబంధనలకు విరుద్ధంగా మైక్‌పై చేయిపెట్టి రోల్ రైడా చెవిలో గీతామాధురి మాట్లాడటం, అలాగే కాగితంపై కౌశల్ రాసుకోవడం గమనించిన బిగ్‌బాస్ తీవ్రంగా మందలించాడు. ఇంటి నిబంధనలు యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నందున ఇంటి సభ్యులను హెచ్చరించాడు. అలాగే ఇక భవిష్యత్‌లో ఇదే పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకొంటానని వార్నింగ్ ఇచ్చాడు.

    కౌశల్ వల్లే ఇదంతా

    కౌశల్ వల్లే ఇదంతా

    ఇంటిలో చివరి కెప్టెన్స్ టాస్క్ నిర్వహించకుండా బిగ్‌బాస్ ఝలక్ ఇచ్చాడు. ఇంటి నిబంధనలు పాటించనందున అందర్ని ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు. దాంతో ఇంటి సభ్యులందరూ కౌశల్‌ను నిందించారు. కౌశల్ కారణంగానే కెప్టెన్సీ టాస్క్‌లు, టికెట్ టూ ఫినాలే టాస్క్‌లు విఫలమయ్యాయని అందరూ ఓ అభిప్రాయానికి వచ్చారు.

    కౌశల్‌ను ఒంటరివాడిని చేసి

    కౌశల్‌ను ఒంటరివాడిని చేసి

    సంచాలకుడిగా కౌశల్‌ డిజాస్టర్ అని నాని చెప్పిన విషయంపై వాగ్వాదం జరిగింది. కౌశల్‌ను ఒంటరివాడిని ఇంటి సభ్యులందరూ మాటల దాడి చేశారు. వారందరితో కౌశల్ కూడా మాటల యుద్దానికి దిగాడు. ఇంటిలో రోజంతా ఈ విషయంపైనే వాడివేడి చర్చ జరిగింది.

    రోల్ రైడా, సామ్రాట్ ఫొటోలతో

    రోల్ రైడా, సామ్రాట్ ఫొటోలతో

    రోల్ రైడా, సామ్రాట్ తీసిన న్యూస్ వీడియో ఆర్టికల్స్‌ను ఇంటి సభ్యులు చూశారు. వాటిని ఇంట్లోని టెలివిజన్‌లో చూపించారు. సరదాగా ఉన్న సీన్లను చూసి అందరూ నవ్వుకున్నారు. అలా ఇంటి సభ్యులు 99వ రోజును ప్రశాంతంగా ముగించారు.

    English summary
    Bigg Boss2 Telugu 99 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 99 days of the game, Amit Tiwari Eliminated from the house. on 99th day, Bigg Boss nominated all the member for Elimination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X