Bigg Boss Nominations: 11వ వారం చెత్త నామినేషన్స్.. టాప్ ప్లేయర్లకు షాక్.. నామినేట్ అయింది ఎవరంటే!

తెలుగులో ప్రసారం అయిన ప్రతిసారీ అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది బిగ్ బాస్ షో. దేశంలోని చాలా భాషల్లో వస్తోన్న ఈ షో.. మన దగ్గర మాత్రమే వాటన్నింటినీ మించిన రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫలితంగా ఇండియాలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇది చివరి దశకు చేరడంతో మరింత రంజుగా మారింది. ఈ నేపథ్యంలో 11వ వారం నామినేషన్ ప్రక్రియ వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో ఎవరు నామినేట్ అయ్యారంటే!

చివరికి రావడంతో ఆదరణ

చివరికి రావడంతో ఆదరణ

తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు మాత్రమే అన్ని భాషల కంటే భారీ స్థాయిలో స్పందన దక్కుతోందన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆరో దాన్ని కూడా సరికొత్త హంగులతో నడుపుతున్నారు. కానీ, దీనికి రేటింగ్ అంతగా రావట్లేదు. అయితే, క్రమంగా దీనికి రెస్పాన్స్ పెరుగుతోంది. ఇప్పుడు చివరి దశకు రావడంతో ఇది మరింత ఆసక్తికరంగా మారుతోంది.

11 మంది.. డబుల్ ట్రబుల్

11 మంది.. డబుల్ ట్రబుల్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేశారు. కానీ, రెండో వారంలో డబుల్ నామినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో ఇద్దరిని సాగనంపారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతిలు వెళ్లారు.

స్ట్రాంగ్ ప్లేయర్లే ఎలిమినేట్

స్ట్రాంగ్ ప్లేయర్లే ఎలిమినేట్

ప్రస్తుతం జరుగుతోన్న ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎంతో ఆసక్తికరంగా మారాయి. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు చాలా మంది వెళ్లిపోయారు. ఫలితంగా నామినేషన్స్ టాస్కులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక, వరుసగా స్ట్రాంగ్ ప్లేయర్లే వెళ్లడంతో పదకొండో వారం నామినేషన్స్ టాస్కు మీద ఫోకస్ పెరుగుతోంది.

ఈ వారం చెత్తా నామినేషన్

ఈ వారం చెత్తా నామినేషన్

బిగ్ బాస్ షో మొత్తంలోనే నామినేషన్స్ టాస్కు చాలా ముఖ్యమైనది అని తెలిసిందే. అందుకే దీన్ని చాలా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఆరో సీజన్‌లో కూడా సరికొత్త టాస్కులను తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే పదకొండో వారానికి సంబంధించి.. ఒక కంటెస్టెంట్.. తాను నామినేట్ చేసే ఇద్దరు సభ్యులపై చెత్తను వేసి.. అందుకు తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది.

వాళ్ల మధ్య పెద్ద గొడవలు

వాళ్ల మధ్య పెద్ద గొడవలు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కూడా నామినేషన్స్ టాస్కులు అన్నీ ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. ప్రతి వారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అప్పుడే కొంత మంది మధ్య దూరం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు పదకొండో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో ఫైమా - ఇనాయా, రేవంత్ - కీర్తి భట్ మధ్య పెద్ద ఫైట్ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మళ్లీ 9 మంది నామినేట్

మళ్లీ 9 మంది నామినేట్

ఆరో సీజన్‌లోని పదకొండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారని సమాచారం. అందులో ఇనాయా సుల్తానా, శ్రీహాన్ చోటు, రోహిత్, రేవంత్, కీర్తి భట్, మెరీనా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా లీకైంది.

అందరికీ షాకిచ్చిన బాస్

అందరికీ షాకిచ్చిన బాస్


బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పది వారాల్లో 11 మంది ఎలిమినేట్ అవడంతో ఇప్పుడు 10 మంది మాత్రమే మిగిలారు. అలాంటిది ఈ వారం 9 మంది నామినేషన్‌లోకి వచ్చినట్లు తెలిసింది. అంటే ఈ వారం కెప్టెన్ ఫైమా మాత్రమే సేఫ్ అయింది. మిగిలిన వాళ్లకు బిగ్ షాక్ తగిలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X