Bigg Boss: నాలుగో వారం నామినేషన్స్ లీక్.. బిగ్ బాస్‌లో కొత్త రికార్డు.. రవికి దెబ్బ మీద దెబ్బలు

తెలుగు టెలివిజన్ హిస్టరీలో కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా ఘనతను అందుకుంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టు, సరికొత్త టాస్కులు, గొడవలు, ఫైటింగులు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన యాంగిల్స్‌ను చూపిస్తూ ఇది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకునిపోతోంది. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. ఆరంభం నుంచే దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ప్రసారం కానున్న నామినేషన్స్ టాస్క్ వివరాలు లీకయ్యాయి. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారో చూద్దాం పదండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఈ సారి ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్

ఈ సారి ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్

బిగ్ బాస్ నాలుగు సీజన్లు విజయవంతం అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచి భారీ రేటింగ్‌ను అందుకుందీ సీజన్.

 మూడు వారాలు.. ముగ్గురు లేడీస్ ఔట్

మూడు వారాలు.. ముగ్గురు లేడీస్ ఔట్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక, ఇప్పుడు మూడో వారంలో లహరి షారి ఎలిమినేట్ అయిపోయింది.

 ఈ టాస్కు కోసమే అందరూ వెయిటింగ్

ఈ టాస్కు కోసమే అందరూ వెయిటింగ్

బిగ్ బాస్ షోలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా మొదలు అవుతుంది. ప్రతి సోమవారం ఈ ఎపిసోడ్ వస్తుంటుంది.

విలన్ అవ్వాలన్నా.. హీరోగా కావాలన్నా

విలన్ అవ్వాలన్నా.. హీరోగా కావాలన్నా

బిగ్ బాస్ మొత్తంలో నామినేషన్స్ టాస్కే కంటెస్టెంట్‌కు సంబంధించిన క్యారెక్టర్‌ను డిసైడ్ చేస్తుంది. ఇందులో ప్రవర్తించే తీరే వాళ్లను హీరోలుగా మారుస్తుంది.. విలన్‌లను చేస్తుంది. ఎవరినైతే ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ టార్గెట్ చేస్తుంటారో.. వాళ్లకే ప్రేక్షకుల్లో సింపతీ పెరుగుతుంది. అందుకే బిగ్ బాస్ షో ఈ టాస్కు మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు.

నాలుగో వారం రికార్డు స్థాయిలో ఎంపిక

నాలుగో వారం రికార్డు స్థాయిలో ఎంపిక

ఐదో సీజన్‌కు సంబంధించి మొదటి వారం బిగ్ బాస్ షోలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అవగా.. రెండో వారం మాత్రం ఏకంగా ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. మూడో వారంలో ఐదుగురు నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నాలుగో వారానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారని తెలుస్తోంది.

ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసా

ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసా

తాజాగా బయటకు వచ్చిన కంటెస్టెంట్ల వివరాలు చూస్తే.. ఈ వారంలో ఏకంగా ఎనిమిది మంది లోబో, ఆర్జే కాజల్, వీజే సన్నీ, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, యాంకర్ రవిలు నామినేట్ అయ్యారని తెలుస్తోంది. వీరిలో పలువురు రెండు అంతకంటే ఎక్కువ సార్లు నామినేట్ అయ్యారు. ఇప్పటికే నాగార్జునతో చీవాట్లు తిన్న రవికి మరో దెబ్బ తగిలినట్లైంది.

అంచనాలకు తగ్గట్లుగానే ఈ వారంలో

అంచనాలకు తగ్గట్లుగానే ఈ వారంలో

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం ప్రసారం కాబోతున్న నామినేషన్స్ టాస్కులో గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఓ రేంజ్‌లో జరగబోతున్నాయని తెలుస్తోంది. తద్వారా ఈ ఎపిసోడ్ మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగబోతుందని అంటున్నారు. దీంతో ఈరోజు సాయంత్రం రాబోయే ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X