Bigg Boss: మూడో వారం నామినేషన్స్ లీక్.. ఈ సారి ఆ ఐదుగురు నామినేట్.. ఆ ముగ్గురికీ మరోసారి షాక్

ఒకే ఇంట్లో చాలా మంది సెలెబ్రిటీలు.. వంద రోజుల ప్రయాణం.. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కెమెరాల మధ్యనే గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ఇలా ఎన్నో ఎమోషన్స్.. మొత్తానికి గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టు.. అయితేనేం తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించిన ఏకైక షో బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది ఎంతో విజయవంతం అయింది. ఇక, ఈ మధ్యనే మొదలైన ఐదో సీజన్ ఆరంభం నుంచే ప్రేక్షకులకు మజాను పంచుతూ సాగుతోంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్ టాస్కులో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూడో వారం నామినేషన్స్‌కు సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. మరి ఈ సారి ఎంత మంది నామినేట్ అయ్యారో తెలుసుకుందాం పదండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

అంత మందితో.. అదుర్స్ అనిపిస్తూ

అంత మందితో.. అదుర్స్ అనిపిస్తూ

తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన బిగ్ బాస్ సీజన్లు విజయవంతం అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు, రొమాన్స్ వంటి వాటితో మరింత రంజుగా మారుతోంది.

 ఫస్ట్ వీక్ సరయు.. రెండో వారం ఉమ

ఫస్ట్ వీక్ సరయు.. రెండో వారం ఉమ

ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో నామినేషన్స్ ప్రక్రియలో ఎక్కువ మంది ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి వారంలో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో సరయు షో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక, ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగిన రెండో వారం నామినేషన్స్‌లో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. ఇందులో సీనియర్ నటి ఉమాదేవి ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యారు. అంటే రెండు వారాల్లో లేడీస్‌ వెళ్లిపోయారు.

మజాను పంచే అసలైన ఘట్టం ఇదే

మజాను పంచే అసలైన ఘట్టం ఇదే

బిగ్ బాస్ షోలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా మొదలు అవుతుంది. అవే సగటు ప్రేక్షకుడికి మజాను పంచుతాయి. ఈ ప్రక్రియ ప్రతి సోమవారం ఎపిసోడ్‌లో ఎన్నో గొడవలతో సాగుతుంది. దీంతో ఈ ఎపిసోడ్‌కు మంచి స్పందన వస్తోంది.

 హీరో.. విలన్ అయ్యేది ఆ ప్రక్రియనే

హీరో.. విలన్ అయ్యేది ఆ ప్రక్రియనే

బిగ్ బాస్ మొత్తంలో నామినేషన్స్ టాస్కే కంటెస్టెంట్‌కు సంబంధించిన క్యారెక్టర్‌ను డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో ప్రవర్తించే తీరే వాళ్లను హీరోలుగా మారుస్తుంది.. విలన్‌లను చేస్తుంది. ఇప్పటి వరకూ ప్రసారం అయిన అన్ని సీజన్లలోనూ ఇదే కనిపించింది. ఎవరినైతే ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ టార్గెట్ చేస్తుంటారో.. వాళ్లకే ప్రేక్షకుల్లో సింపతీ పెరుగుతుంది. తద్వారా ఆదరణ కూడా లభిస్తోంది. గతంలో విజేతలుగా నిలిచిన కౌశల్ మందా, రాహుల్ సిప్లీగంజ్, అభిజీత్ విషయంలో ఇలాగే జరిగింది. అందుకే ఈ టాస్క్ ఎంతో ముఖ్యమైనది.

అప్పటి నుంచే ప్రేక్షకుల్లో చర్చలు

అప్పటి నుంచే ప్రేక్షకుల్లో చర్చలు

బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించి మొత్తం 19 మంది ప్రముఖులు హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఇద్దరు ఎలిమినేట్ అవగా.. విశ్వ ఈ వారం కెప్టెన్ అయ్యాడు. దీంతో ఈరోజు జరగబోయే నామినేషన్స్ ప్రక్రియలో 16 పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అంతా వేచి చూస్తున్నారు. గత వారం భారీ స్థాయిలో గొడవలు జరగడంతో ఈ సారి ఇంకెలా ఈ ప్రక్రియ సాగుతుందో అని అంతా అనుకుంటున్నారు. దీంతో ఈ టాస్కుపై అంచనాలు బాగా పెరిగిపోయాయి.

 మూడో వారం ఆ ఐదుగురు నామినేట్

మూడో వారం ఆ ఐదుగురు నామినేట్

ఐదో సీజన్‌కు సంబంధించి మొదటి వారం బిగ్ బాస్ షోలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అవగా.. రెండో వారం మాత్రం ఏకంగా ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. ఇక, సోమవారం రాత్రి ప్రసారం కాబోతున్న మూడో వారం నామినేషన్స్ టాస్కుకు సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వారం నామినేషన్స్ టాస్కు ఆదివారం రాత్రే ముగిసిందట. ఇక, ఇందులో ఐదుగురు కంటెస్టెంట్లు అంటే ప్రియాంక, మానస్, శ్రీరామ్, లహరి, ప్రియలు నామినేట్ అయ్యారని తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 5: Sriram Chandra - Hamida హాట్‌ హాగ్స్‌.. రొమాంటిక్ డ్యాన్సు || Oneindia Telugu
ఆ ముగ్గురికీ మరోసారి షాక్ తగిలింది

ఆ ముగ్గురికీ మరోసారి షాక్ తగిలింది

తాజాగా బయటకు వచ్చిన కంటెస్టెంట్ల వివరాలు చూస్తే.. ఇందులో ప్రియాంక, మానస్, ప్రియలు రెండో సారి నామినేట్ అయ్యారని తెలుస్తోంది. అలాగే, లహరి, శ్రీరామ్‌లు తొలిసారి నామినేషన్ జోన్‌లోకి వచ్చారని అంటున్నారు. అంటే ఈ వారం టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న వాళ్లంతా సేవ్ అయ్యారని తెలుస్తోంది. ఇక, ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది వచ్చే ఆదివారం తేలిపోనుంది. ఇదిలా ఉండగా.. ఈ వారం నామినేషన్స్ టాస్కులు పెద్దగా గొడవలు జరగలేదని తెలుస్తోంది. నాగార్జున ఇచ్చిన వార్నింగ్ వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X