Bigg Boss Non Stop : రెండో వారమే కంటెస్టెంట్స్ కు భారీ షాక్.. ఏకంగా 13 మంది మీద ఎలిమినేషన్ కత్తి?
బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఒక వారం పాటు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అనే విషయం మీద ప్రేక్షకులకు కూడా ఒక అవగాహన వచ్చింది. మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వగా ఇప్పటికే రెండో వారం నామినేషన్స్ కూడా జరుగుతున్నట్లుగా ప్రోమో విడుదలైంది. సోషల్ మీడియా లీకులు ప్రకారం 17 మంది కంటెస్టెంట్లలో 13 మంది ఈ రెండో వారం నామినేషన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

అలవాటు అవుతోంది
బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో కొత్త ఫార్మాట్ బిగ్ బాస్ షో నీ బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకుల కోసం తీసుకువచ్చారు. ముందు ఈ షో ప్రేక్షకులు అలవాటు కావడం కష్టమే అని భావించారు కానీ నెమ్మది నెమ్మదిగా ఈ బిగ్ బాస్ షో కూడా ప్రేక్షకులకు అలవాటు అవుతోంది. మొదటి వారం అరియానా గ్లోరీ, నట్రాజ్ మాస్టర్, హమీద, మిత్రా శర్మ, సరయు రాయ్, ముమైత్ ఖాన్ నామినేషన్లలో ఉన్నారు.

షాకింగ్
వారిలో కూడా ఎవరూ ఊహించని మేరకు ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యే బయటకు వచ్చేసింది. అందరూ మిత్ర ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కానీ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడం అనేది కొంచెం షాకింగ్ విషయం అని చెప్పాలి. ఇక రెండవ వారం కూడా ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఇప్పటికే నామినేషన్స్ ఘట్టం మొదలైపోయింది. ఈ మేరకు ప్రోమో కూడా విడుదల చేశారు.

నామినేషన్ జాబితా
ప్రోమోలో ఘాటుగానే ఒకరిమీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో వారం నామినేషన్ లు వాడి వేడిగా సాగాయి. ఈ రెండవ వారం బిగ్ బాస్ లో దాదాపు 13 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.

నామినేషన్ జాబితా
2వ వారం నామినేషన్ జాబితా ఈ మేరకు ఉంది. 1. అఖిల్ 2. అరియానా 3. సరయు 4. హమీద 5. మహేష్ విట్టా 6. అషు రెడ్డి 7. నటరాజ్ మాస్టర్ 8. శ్రీ రాపాక 9. మిత్రా శర్మ 10. అనిల్ రాథోడ్ 11. ఆర్జే చైతు 12. యాంకర్ శివ 13. స్రవంతి చొక్కరపులు రెండో వారం కోసం నామినేట్ అయ్యారు..
Recommended Video

మునుపెన్నడూ లేని విధంగా
అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది అని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత స్పైసీగా ఈ షో ను నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో అనేక విశేషాలను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. మరి చూడాలి ఈ షోను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకు వెళతారు అనేది.


Click it and Unblock the Notifications











