Bigg Boss Nonstop: మిత్రా బండారం బట్టబయలు చేసిన అజయ్.. మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ గా ఎన్నిక?
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతోంది ఇప్పటికే ఐదు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయి బయటకు రాగా ముమైత్ ఖాన్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగిన సంగతి తెలిసిందే ఆ తర్వాత హౌస్ లో మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ కోరగా అందరూ ముక్తకంఠంతో మిత్రా పేరు తెర మీదకు తీసుకువచ్చారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముమైత్ రీ ఎంట్రీ
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో సీజన్ 1లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయు, తేజస్వి బయటకు వెళ్లగా ముమైత్ రీ ఎంట్రీ ఇచ్చింది.

సేఫ్
ఇక సోమవారం నాటి నామినేషన్స్‌తో బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది. ఈ సారి మొత్తంగా పది మంది నామినేషన్స్‌లో నిలిచారు. మిత్ర శర్మ, నటరాజ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్‌లు ఉన్నారు. అంటే కెప్టెన్ అయిన అఖిల్‌తో పాటు అజయ్, ఆరియానాలు ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు.

బిందుతో జాగ్రత్త
ఆ సంగతి అలా ఉంచితే ఇక తాజా ఎపిసోడ్‌లో ఏమైందంటే.. మిత్రా శర్మ గురించి అనేక విషయాలు బయట పెట్ట్టాడు అజయ్. బిందు మాధవి, మహేష్, శివ, అనిల్, అజయ్ అందరూ కూర్చుని ఉండగా.. నా గురించి మిత్రా ఏదో రాసి నీకు ఇచ్చింది కదా ఏం రాసింది అజయ్ ? అని బిందు అడిగింది. దీంతో అజయ్ ఆమె ఏం రాసిందో మొత్తం చెప్పేశాడు.. ‘బిందుతో జాగ్రత్త.. ఆమె జనాన్ని ఉపయోగించుకుంటుంది.. ఐ లైక్ యువర్ స్మైల్' అని రాసిందని అజయ్ చెప్పుకొచ్చాడు.

మొత్తం చెప్పేశాడు
అంతే కాదు ఆ విషయం నేను అఖిల్‌తో చెప్పేశా అని ఆమెకు కోపం వచ్చేసిందని, దీంతో నేను బాత్ రూమ్ కి పోతే టిష్యూ మీద ఒకటి రాశా.. తీసి చూసుకో అని చెప్పిందని అది చాలా పెద్దగా రాసిందని చెబుతూ అక్కడ ఏం రాసిందో మొత్తం చెప్పేశాడు అజయ్. దీంతో ఆమె పుల్లలు పెట్టే వ్యవహారం అంతా బట్టబయలు అయినట్టు ఉంది. ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లలో మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరో చెప్పాలని.. తగిన కారణాలతో మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్లాగ్ ఇవ్వాలని చెప్పడంతో ముందు స్రవంతి.. నటరాజ్ మాస్టర్‌కి ఇరిటేటింగ్ ఫ్లాగ్ ఇచ్చింది. ఆ తరువాత అరియానా.. మిత్రా శర్మ ఇరిటేటింగ్ చెప్పింది.
Recommended Video


ఇరిటేటింగ్ ఫ్లాగ్
యాంకర్ శివ కూడా మిత్రా శర్మ ఇరిటేటింగ్ అని, అఖిల్.. మిత్రా శర్మ ఇరిటేటింగ్ అని, అజయ్.. మిత్రా శర్మ ఇరిటేటింగ్ అని, ముమైత్ ఖాన్.. మిత్రా శర్మ ఇరిటేటింగ్ అని, అషురెడ్డి.. బిందు మాధవి ఇరిటేటింగ్ అని, అనిల్ రాథోడ్.. నటరాజ్ మాస్టర్ ఇరిటేటింగ్ అని, బిందు మాధవి.. నటరాజ్ మాస్టర్ ఇరిటేటింగ్ అని అని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ ఇరిటేటింగ్ టాస్క్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ గా మిత్రా శర్మకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. నామినేషన్స్‌లో మిత్రా నామినేషన్స్‌కి సరైన రీజన్స్ చెప్పకుండా.. ఒక్క మాట అనుకుని దాని మీద ఉండకుండా చాలా ఇరిటేటింగ్ గా అనిపించిందని చెబుతూఇంట్లో వాళ్ళందరూ ఆమెకు ఇరిటేటింగ్ ఫ్లాగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











