Bigg Boss Non Stop వామ్మో.. గోకుడు వ్యవహారం మామూలుగా లేదే! మిత్ర శర్మ గుట్టు రట్టు
మిత్రా శర్మ అనే పేరు బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో కనిపించే వరకూ కూడా బయట జనానికి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు కానీ డిస్నీ హాట్ స్టార్‌లో బిగ్ బాస్ నాన్ స్టాప్‌ని ఫాలో అయ్యేవాళ్లకి మాత్రం మిత్ర తెలిసే ఉంటుంది. అయితే హౌస్ లో చాలా సైలెంట్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్న ఆమె హౌస్ లోపల పెద్ద రచ్చ చేస్తుందని బయటపెట్టారు ఇద్దరు కంటెస్టెంట్లు. అయితే ఆమె బండారం అంతా బయటపడింది. ఆ వివరాల్లోకి వెళితే

ముంబై నుంచి హైదరాబాద్
బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో 11వ కంటెస్టెంట్‌గా అడుగుటపెట్టింది మిత్రా శర్మ. హీరోయిన్‌గా నిర్మాతగా టాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసిన ముంబై భామ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లలోనే అత్యంత సంపన్నురాలని అంటున్నారు. ముంబైలో పుట్టిపెరిగిన మిత్రా శర్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కావడంతో ఆమె తండ్రి ఆమెను సినిమా రంగం వైపు ప్రోత్సహించారు. అయితే కొన్నాళ్లకు తండ్రి చనిపోవడంతో ఒంటరయ్యి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసింది.

‘శ్రీపిక్చర్స్’
అవకాశాల కోసం చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగిన ఆమె చివరికి ‘తొలి సంధ్య వేళలో' అనే సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది కానీ.. హీరోయిన్‌గా ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే ఇవ్వలేకపోయాయి. దీంతో తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోనే రాణించాలని సొంతంగా ‘శ్రీపిక్చర్స్' అనే ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ట్ చేసి బాయ్స్ సినిమాతో నిర్మాతగా మారింది.

వ్యవహారం అంతా బట్టబయలు
అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఏమీ తెలియనట్టుగా చాలా అమాఆయకముగా కనిపించే ఆమె బండారం మొత్తం మరో కంటెస్టెంట్ అఖిల్ బయటపెట్టాడు. ఆమె బ్రెయిన్ కంటే బాత్ రూం టిష్యూ పేపర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుందని లిప్ స్టిక్స్‌తో ఆ పేపర్స్‌పై మొత్తం రాసి సీక్రెట్‌గా చేరవేస్తుందని ఆరోపించాడు. అంతేకాదు అక్కడ విషయాలు ఇక్కడ.. ఇక్కడి విషయాలు అక్కడ చాలా సీక్రెట్‌గా చేరవేస్తూ తన గురించి కూడా అలా చెప్పిందని చెబుతూ ఆమె వ్యవహారం అంతా బట్టబయలు చేశాడు.

పరువు మొత్తం గంగలో
అయితే అఖిల్ చెప్పినదంతా నిజమే కావడంతో చెప్పినంతా సేపు సైలెంట్‌గా ఉండి పోయింది మిత్రా శర్మ. ఏమైనా మాట్లాడతావా? అని అఖిల్ అడిగినా కూడా.. తన వ్యవహారం మొత్తం బయట పడిపోవడంతో దెబ్బకి సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన మహేష్ విట్ట కూడా మిత్రా శర్మ మిగిలిన పరువు మొత్తం గంగలో కలిపివేశాడు.
Recommended Video


చేతిలో గోకుతుందని.
హౌస్‌లో మిత్రా చిత్ర విచిత్రంగా చేస్తుందని.. ఏదీ సరిగా చెప్పదని, సైగలు చేస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు చేతిలో గోకుతుందని.. వెనుక నుంచి గోకుతుందని అన్నాడు. ఇక అఖిల్ గ్రూప్ అని.. బిందు మాధవి గ్రూప్ అని గ్రూపులు కట్టేందుకు ప్రయత్నిస్తూ అందరి గురించి రకరకాలుగా చెప్తుందని చెబుతూ ఆమె మిగిలిన సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేశాడు. ఆ తర్వాత అనిల్ రాథోడ్ కూడా ఇదే తరహాలో మిత్రా శర్మ గురించి కొన్ని విషయాలు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అరియానా మాత్రం నేను నీకు అండగా ఉంటా అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











