Bigg Boss Non Stop: అఖిల్‌కు బిగ్ బాస్ కోలుకోలేని షాక్.. అతడి సీక్రెట్ టాస్క్‌కు బలైన స్టార్
తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో వచ్చినా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఇది దేశంలోనే టాప్ రియాలిటీ షోగా రికార్డు సాధించింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలు పెట్టారు. ఇది కూడా మొదటి రోజు నుంచే ప్రేక్షకుల మది దోచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ అయిన అఖిల్ సార్థక్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. అంచనాలకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత సీజన్ల కంటే ఎక్కువగా గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, సరికొత్త టాస్కులతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతోంది. ఫలితంగా నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ దొరకుతోంది.

17 మంది.. టైటిల్ కోసం అఖిల్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అందులో డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ ఒకడు. ఆరంభంలోనే అతడు అందరి దృష్టినీ ఆకర్షించుకుని ముందుకు వెళ్తున్నాడు.

అప్పుడి రన్నర్.. ఇప్పుడు కసిగా
సినిమాల్లోకి రాకముందే మోడల్‌గా అఖిల్ పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్‌మెన్‌గా పలుమార్లు ఎంపికయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఛాన్స్ పట్టేశాడు. అందులో ఆరంభం నుంచే మంచిగా ఆడుతూ ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, చివర్లో అభిజీత్ గెలవడంతో అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

హృదయాలు గెలిచి.. మోస్ట్ లవ్
ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అఖిల్ సార్థక్ తెగ హైలైట్ అవుతున్నాడు. యమ యాటిట్యూడ్‌తో పాటు టాస్కుల్లో శ్రమిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలాగే, హ్యాండ్సమ్ లుక్స్‌తో అమ్మాయిల దృష్టినీ కూడా ఆకర్షిస్తున్నాడు. ఇక, గత ఆదివారం ఎపిసోడ్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్ల ప్రేమను దక్కించుకుని.. మోస్ట్ లవ్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు కూడా.

ఫేక్ పర్సన్ అనే ట్యాగ్ సొంతం
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసుకునేందుకు గానూ ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ‘అంతా మీ ఇష్టం' అనే టాస్కును ఇచ్చాడు. దీని ప్రకారం.. ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి బ్యాలెట్ ఓట్లు వేయమని చెబుతున్నాడు. ఇందులో భాగంగా హౌస్‌లో ఫేక్ పర్సన్ ఎవరు అన్న దానిపై ఓటింగ్ పెట్టాడు. అది ముగిసిన తర్వాత అఖిల్ సార్థక్ పేరును ప్రకటించాడు బిగ్ బాస్.

ఆయనకు కూడా.. అంతా షాక్
అఖిల్ సార్థక్‌తో పాటు మరొకరి పేరును కూడా బిగ్ బాస్ ప్రకటించాడు. అతడే నటరాజ్ మాస్టర్. వీళ్లిద్దరూ ఫేక్ కంటెస్టెంట్లు అని ఇంటి సభ్యులు తమ ఓట్ల ద్వారా నిర్ధారించారని వెల్లడించాడు. వీళ్లిద్దరూ బిగ్ బాస్ చెప్పే వరకూ ఫేక్ అనే ట్యాగ్ ధరించాలని ఆదేశించాడు. ఇక, మొన్ననే లవ్ ట్యాగ్‌ను అందుకున్న అఖిల్ ఇప్పుడు ఫేక్ పర్సన్ అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు.
Recommended Video


యాంకర్ శివ సీక్రెట్ టాస్క్ వల్లే
వాస్తవానికి ఓటింగ్‌లో సరయు, ఆర్జే చైతూకు ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అయితే, అంతకు ముందే ఫలితాన్ని నిర్ధారించే అధికారాన్ని యాంకర్ శివకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ద్వారా ఇచ్చాడు. అతడు అఖిల్, నటరాజ్‌కు ఓట్ చేశాడు. దీంతో అతడి ప్రకారమే రిజల్ట్‌ను ప్రకటించాడు బిగ్ బాస్. అంటే.. యాంకర్ శివ చేసిన టాస్కు వల్లే వీళ్లిద్దరూ ఫేక్ పర్సన్లుగా తేలారన్న మాట.


Click it and Unblock the Notifications











