Bigg Boss Non Stop: మోనాల్‌తో లవ్‌పై పెదవి విప్పిన అఖిల్.. రోజూ అదే పని అంటూ డౌట్లు పెంచేశాడుగా!

చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. సరైన సక్సెస్‌ను అందుకోలేక ఫేమస్ అవలేకపోయాడు బిగ్ బాస్ ఫేం అండ్ యంగ్ మోడల్ అఖిల్ సార్థక్. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతడు విపరీతమైన రీతిలో పాపులారిటీని అందుకున్నాడు. దీనికి కారణం అతడి ఆటతీరు మాత్రం కాదు.. హౌస్‌లో హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాక్ నడపడమే అని తెలిసిందే. బయట కూడా వీళ్లిద్దరూ అలాగే కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే అఖిల్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక, తాజాగా అతడు ఓ టాస్కులో భాగంగా మోనాల్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. బిగ్ బాస్ ఛాన్స్

అలా పరిచయం.. బిగ్ బాస్ ఛాన్స్

సినిమాల్లోకి రాకముందే మోడల్‌గా అఖిల్ పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్‌మెన్‌గా పలుమార్లు ఎంపికయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించి బిగ్ బాస్ ఛాన్స్ పట్టేశాడు. మరోవైపు, అప్పుడెప్పుడో మోనాల్ గజ్జర్ టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చింది. తర్వాత చాలా భాషల్లో నటించిన ఈమె కూడా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చింది.

లవ్ ట్రాకుతో ఫేమస్.. రొమాన్స్‌తో

లవ్ ట్రాకుతో ఫేమస్.. రొమాన్స్‌తో

వేరు వేరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ జంటగా ఫేమస్ అయ్యారు. ఎప్పుడూ కలిసే ఉంటూ.. కలిసే ఆడుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు హైలైట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో తరచూ రొమాన్స్ చేయడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు అప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి.

అలా వచ్చి.. ఇలా సత్తా చాటారుగా

అలా వచ్చి.. ఇలా సత్తా చాటారుగా

ఏమాత్రం అంచనాలు లేకుండానే మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా ప్రవేశించారు. ఎవరూ ఊహించని రీతిలో ఇద్దరూ తమ ఆటతీరును కనబరిచారు. ఫలితంగా ఈ ఇద్దరూ చివరి వరకూ ఉన్నారు. అయితే, వీళ్లిద్దరిలో మోనాల్ పద్నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ, అఖిల్ మాత్రం ఫినాలేకు చేరుకుని రన్నరప్‌గా నిలిచాడు.

బయట కూడా రచ్చ చేసిన జంట

బయట కూడా రచ్చ చేసిన జంట


బిగ్ బాస్ హౌస్‌లో జంటగా తెగ సందడి చేసిన మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే కనిపించారు. కలిసి పార్టీలు చేసుకోవడం.. పబ్‌లకు వెళ్లడం.. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం.. ఒకరి గురించి మరొకరు పోస్టులు చేసుకోవడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలిచేవారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

 బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో అఖిల్ రాక

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో అఖిల్ రాక


ఎన్నో అంచనాల నడుమ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ గత వారంలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులోకి మొత్తం 17 మంది సభ్యులు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో అఖిల్ సార్థక్ కూడా ఉన్నాడు. గతంలో తృటిలో టైటిల్‌ను మిస్ చేసుకున్న అతడు.. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

బీచ్‌లో బ్రాతో కరీనా కపూర్ ఫోజులు: తల్లైన తర్వాత కూడా మరీ ఇంత దారుణంగా!
https://telugu.filmibeat.com/heroine/kareena-kapoor-beach-photo-gone-viral-107607.html

మోనాల్ రిలేషన్‌పై అనిల్ ప్రశ్న

మోనాల్ రిలేషన్‌పై అనిల్ ప్రశ్న


తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వారియర్స్‌గా ఉన్న పాత కంటెస్టెంట్లు గత సీజన్లలో ఏ తప్పును చేశారో చెప్పి.. దాన్ని ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటారో చెప్పమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దాని తర్వాత చాలెంజర్లను ప్రశ్నలు కూడా అడగొచ్చని చెప్పాడు. ఇందులో భాగంగా ‘నీకు.. మోనాల్‌కు మధ్య చూపించిన సీన్స్ నిజమేనా? క్రియేట్ చేసినట్లు అనిపించిందా' అని ప్రశ్నించాడు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
 లవ్ ట్రాకుపై క్లారిటీ ఇచ్చిన అఖిల్

లవ్ ట్రాకుపై క్లారిటీ ఇచ్చిన అఖిల్

అనిల్ ప్రశ్నకు ‘హౌస్‌లో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య ఏదైతే చూపించారో అది నిజం. అంతలా మా మధ్య కనెక్షన్ కుదిరింది. అది బయట కూడా కనెక్ట్ అయింది. షోలోకి వచ్చే ముందు వరకూ నేను, తను ఫోన్‌లో మరింతగా మాట్లాడుకునే వాళ్లం. అయితే, అది లవ్ ట్రాక్ అని చెప్పలేను. ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువే అని మాత్రం చెప్పగలను' అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X