twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: ఒంటరి పోరాటం చేసి ఓడిన శివ.. ఫైనల్ గా అతనే కెప్టెన్.. ఇది న్యాయమేనా?

    |

    బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఎవరూ ఊహించరు. పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగడమే ఈ ఆటలో అసలైన ఛాలెంజ్. ఒకవైపు నెగిటివ్ అనిపించవచ్చు మరొకవైపు పాజిటివ్ గా అనిపించవచ్చు.. కానీ అన్ని విమర్శలను ప్రశంసలను ఎదుర్కొని బిగ్ బాస్ లో పోరాడకపోతే ఫలితం దక్కదు. ప్రస్తుతం పోరాడుతున్న వారు అయితే ఓడిపోతున్నారు. మోసం చేసి గ్రూపుగా ఆడుతున్న వారు మాత్రమే గెలుస్తున్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ సమ న్యాయం చేయడం లేదని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైన అఖిల్ కూడా సోషల్ మీడియాలో అనేక రకాల నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా అఖిల్ ఎలాంటి రాజకీయాలతో కెప్టెన్ అయ్యాడు అనే వివరాల్లోకి వెళితే..

    కెప్టెన్ అవ్వడం కోసం

    కెప్టెన్ అవ్వడం కోసం

    గేమ్ లో తను విన్ అవ్వాలని అఖిల్ ఎలాంటి ప్లాన్ అయినా వేస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం.. ఆ తర్వాత కుదరకపోతే మిగతా వారిని గ్రూపులుగా చేసుకొని ప్రత్యర్థులను ఓడించడం అతనికి అలవాటు గా వస్తుంది అనే కామెంట్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం కెప్టెన్ ఇవ్వడం కోసం అతను తన గ్రూపులోని మిగతా వాళ్ళను కూడా బలి చేసేసాడు.

     కోర్టుగా మారిపోయిన బిగ్ బాస్

    కోర్టుగా మారిపోయిన బిగ్ బాస్

    ముమైత్ ఖాన్ వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ ను కోర్టు గా మార్చేసారు. రెండు గ్రూపులుగా విడిపోయిన అఖిల్ బిందుమాధవి టీం సభ్యులు కెప్టెన్సీ కంటెస్టెంట్స్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు. ఒకవైపు బిందుమాధవి టీమ్ కోసం యాంకర్ శివ లాయర్ గా వాదించగా మరొకవైపు నటరాజ్ మాస్టారు తనదైన శైలిలో అఖిల్ టీమ్ కోసం వాదించే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా ఇరు వర్గాల సభ్యులకు బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెస్టెంట్స్ గా నిలబడే అవకాశం ఇచ్చాడు.

     అఖిల్ vs బిందు మాధవి టీమ్

    అఖిల్ vs బిందు మాధవి టీమ్


    మీలో మీరే డిసైడ్ చేసుకొని కెప్టెన్సీ కంటెస్టెంట్స్ గా పోటీ పడేందుకు రెడీ అవ్వాలి అని బిగ్ బాస్ సూచించాడు. ఇక ఫైనల్ గా అఖిల్ టీమ్ లోని అజయ్ అషురెడ్డి స్రవంతి నలుగురు కూడా కెప్టెన్ అవ్వడానికి పోటీపడ్డారు. అనంతరం ముమైత్ ఖాన్ కు కూడా అవకాశం వచ్చింది
    ఇక బిందుమాధవి టీమ్ నుంచి యాంకర్ శివ ఫైనల్ గా అఖిల్ టీంతో కెప్టెన్ అవ్వడానికి పోటీ పడ్డాడు.

    ఎత్తర జెండా టాస్క్

    ఎత్తర జెండా టాస్క్


    ఎత్తర జెండా అనే ఫైనల్ టాస్క్ లో మొదటి నుంచి కూడా అఖిల్ డామినేషన్ కనిపించింది. ఫైనల్ గా ఒక గ్రూపుగా మారిపోయి యాంకర్ శివను ఓడించాలి అనే తాపత్రయంతో వారందరూ కూడా గేమ్ ఆడినట్లు అనిపించింది. ఏత్తర జెండా టాస్క్ లో ఓ రింగ్ ఇచ్చి ఆ రింగ్‌ నుండి బయటకు రాకుండా జెండాలను పట్టుకుని టబ్‌ లోనే పెట్టాలనీ బిగ్ బాస్ సూచించాడు.

    ఒంటరి పోరాటం

    ఒంటరి పోరాటం


    ముమైత్ ఖాన్ తో పాటు అఖిల్ అషురెడ్డి అజయ్ శ్రవంతి ఒకేసారి యాంకర్ శివ మీద ఎగబడి గేమ్ ఆడినట్లు అనిపించింది. అతన్ని జెండా పట్టుకొనివ్వకుండా చేసేసారు. ఒంటరి పోరాటం చేసినప్పటికీ కూడా శివ గెలవలేకపోయారు. ఇక ఆ తర్వాత అఖిల్ తన స్ట్రాటజీని ఉపయోగించే మిగతా వారిని మెల్లగా సైడ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    Recommended Video

    Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
    రాజకీయాలతో అఖిల్ కెప్టెన్

    రాజకీయాలతో అఖిల్ కెప్టెన్

    ఎలాగూ పోటీలో ఉన్న వారు అఖిల్ కు మద్దతు ఇస్తారు కాబట్టి ముందుగా ముమైత్ ఖాన్ ను అందరూ కలిసి పక్కకు నెట్టేశారు. ఇక ఆ తర్వాత అషు రెడ్డి, స్రవంతిలను కూడా అఖిల్ అజయ్ సైడ్ చేయడంతో చివరికి వారిద్దరూ కెప్టెన్ అవ్వడానికి పోటీ పడ్డారు. ఏదో పోరాడినట్లు బిల్డప్ ఇచ్చేసి అజయ్.. అఖిల్ కోసమే అతను క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకోవడం విశేషం. ఫైనల్ గా అఖిల్ గ్రూపు రాజకీయాలు చేస్తూ కెప్టెన్ అయ్యాడు. అయితే యాంకర్ శివ ఓడిపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో అతనికి ఎక్కువగా మద్దతు లభిస్తోంది. మరి రానున్న రోజుల్లో అఖిల్ ఇంకా ఎలాంటి రాజకీయాల నడిపిస్తాడో చూడాలి.

    English summary
    Bigg boss non stop akhil sarthak won captaincy task in wrong way
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X