Bigg Boss Non Stop : హద్దు దాటుతున్న శివ.. అరియానాతో ముద్దు.. సరయూతో డబుల్ మీనింగ్.. ముమైత్ ను కూడా వదల్లేదా?
వివాదాస్పద యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ కు వచ్చి చేరిన యాంకర్ శివ ప్రవర్తన గురించి ఇంటా బయటా చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒక ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉంటే కొన్నాళ్ళ పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపేయవచ్చు అని భావిస్తున్నాడు ఏమో తెలియదు కానీ శివ ప్రవర్తన మాత్రం ఇప్పుడు ఎవరికీ నచ్చడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రేమాయణం
యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనతికాలంలోనే వివాదాస్పద యాంకర్ గా, కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు యాంకర్ శివ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించడంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది మొదలు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్లని పడేసి ప్రేమాయణం సాగించాలి అనే ఏకైక ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రేమాయణం
ముందు వచ్చీరావడంతోనే మిత్రశర్మ అనే అమ్మాయి తో పులిహోర కలవడానికి ప్రయత్నించగా ఆమె తెలివిగా అన్నయ్య అనేసింది. అప్పటి నుంచి ఆయన ఎవరితో పడితే వాళ్లతో పులిహోర కలిపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాధారణంగా అమ్మాయిలతో పులిహోర కలపడానికి ప్రయత్నించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ విధానంలోనే యాంకర్ శివ తప్పుడుగా అడుగులు వేస్తున్నాడు.

ముద్దు పెట్టను.. బ్రో!
మిత్ర తరువాత అరియానాతో పులిహోర కలపడం మొదలుపెట్టి పనిష్మెంట్ అంటూ నువ్వు నా పైన కూర్చుని ఇక్కడ ముద్దు పెట్టాలని అన్నాడు. ఆ మాటతో అరియానా తల పగలకొడతా అని పంచ్ ఇచ్చింది. పనిష్మెంట్ ఇస్తే చేయాలి.. కావాలంటే నేను కూడా నీకు ముద్దులు పెడతా అని యాంకర్ శివ అనడంతో.. ఒళ్లు బాగా తిమ్మిరిగా ఉంది కదా అంటే లేదు బాగానే ఉంది పనిచేస్తుందని శివ అనడంతో నేను తమ్ముళ్లకి ముద్దు పెట్టను.. బ్రో!! అనేసి షాకిచ్చింది.

పిసకలేను కానీ అంటూ
ఆ తరువాత నేడు విడుదలైన నామినేషన్స్ ప్రోమోలో కూడా సరయును యాంకర్ శివ 'నీ పిండి నేను పిసకలేను కానీ.. వేరే వాడిని పంపుతా' అంటూ అసభ్యంగా మాట్లాడడాని నటరాజ్ ఆరోపణలు చేశారు. అది కాకా బయటకు వచ్చి యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చిన మమైత్..కూడా అయితే యాంకర్ శివ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ముమైత్ ఖాన్ కూడా
శివ వయసు 25.. నా వయసు 36.. అతని గురించి నేనేం చెప్పాలని అనుకున్నాను అనే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అంటూ పజిల్ వదిలింది. అంటే శివ ఆమెను కూడా వదలకుండా ట్రై చేసి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక బిందుతో కూడా శివ భీభత్సంగా ఫ్లర్ట్ చేస్తున్నాడు. తనకు ఆమెను చుస్తే మంచి వైబ్స్ వస్తున్నాయని చెబుతూ రెచ్చిపోతున్నాడు. ఇక అతని అడల్ట్ జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు అయితే అంతే లేకుండా పోతోంది.


Click it and Unblock the Notifications











