Bigg Boss Non Stop: అర్థరాత్రి దోంగలా.. బిందుమాధవి దుప్పట్లో దూరి అలా చేసిన శివ!

బిగ్ బాస్ నాలుగో వారంలో కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా నామినేషన్ లో ఉన్న వారు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ లో జరిగే మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫైనల్ గా అదే గేమ్ అంటూ ట్విస్ట్ కూడా ఇస్తూ ఉంటారు ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన రేయినింగ్ లైక్స్ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ పోటాపోటీగా ఒకరిమీద మరొకరు పడుతూ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ దొంగతనాలు కూడా పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఇక అర్ధరాత్రి బిందుమాధవి దుప్పట్లో దూరి యాంకర్ శివ డీల్ మాట్లాడు కోవడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే...

అరియానాకు వెన్నుపోటు

అరియానాకు వెన్నుపోటు

కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ చివరి నిమిషం వరకు ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గేమ్ ఆడే ప్రయత్నంలో కొన్నిసార్లు మంచి చెడుల గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. ఇక దగ్గర ఉండే వారే కొన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అయితే యాంకర్ శివ కూడా అరియానా విషయంలో అదే చేసాడు. అరియానా, శివను మంచి గేమ్ పాట్నర్ గా అలాగే ఫ్రెండ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అతను మాత్రం ఏకంగా ఆమెకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారు.

ప్లేబాయ్ తరహాలో

ప్లేబాయ్ తరహాలో

యాంకర్ శివ మొదటిరోజు నుంచి కూడా తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మధ్యలో కొందరు అతనిని టార్గెట్ చేసినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నాడు. మధ్యలో యాంకర్ శివ కొంతమంది అమ్మాయిలు నుంచి చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతను ప్లేబాయ్ తరహాలో ముందుకు సాగాలి అని అనుకుంటున్నాడు. కానీ అమ్మాయిల నుంచి మాత్రం సరైన రెస్పాన్స్ అయితే రావడం లేదు.

దొంగతనాలు..

దొంగతనాలు..

యాంకర్ శివ ఈ వారం ఎలాగైనా నామినేషన్స్ నుంచి బయట పడాలి అని కొత్తతరహా ప్రణాళికలను రచిస్తున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అతను పోటీపడి లైక్స్ అందుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో టాస్క్ ముగిసిన అనంతరం బిగ్ బాస్ ఎవరి లైక్స్ బాధ్యత వారిదే అంటూ ముందుగానే ఒక హెచ్చరిక అయితే ఇచ్చేసాడు. ఇక ఈ క్రమంలో దొంగతనాలు జరగడం పక్కా అని కొంతమంది కంటెస్టెంట్స్ లైక్స్ ను కాపాడుకునేందుకు ఏకంగా చొక్కా లోపలకి పెట్టుకొని పడుకున్నారు.

అరియానా లైక్స్ దోచేసిన శివ

అరియానా లైక్స్ దోచేసిన శివ

ఇక అర్ధరాత్రి సమయంలో శివ మెల్లగా లేచి అందరూ పడుకుని ఉండగా తన పనిని కానిచ్చాడు. అరియానా పడుకుని ఉండగా మెల్లగా ఆమె పక్కనుంచి వెళ్లి తన దగ్గర ఉన్న 20 లైక్స్ దొంగతనం చేశాడు. ఇక ఈ తతంగాన్ని మొత్తం బయట గార్డెన్ ఏరియా లో కూర్చుని ఉన్న నటరాజ్ మాస్టర్ గమనిస్తూనే ఉన్నాడు. మరొకవైపు ఇంకా పడుకోకుండా ఉన్న అఖిల్ స్రవంతి అజయ్ ముగ్గురు కూడా శివ చేసిన పనిని చూశారు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
దుప్పట్లో దూరి

దుప్పట్లో దూరి

20 లైక్స్ తీసుకున్న యాంకర్ శివ మెల్లగా బిందుమాధవి దుప్పట్లో దూరి తనకు నచ్చిన విధంగా ఒక డీల్ అయితే సెట్ చేసుకున్నాడు. ఈవారం క్యాప్టెన్ అవుతాను అని తనకు సపోర్ట్ చేయమని బిందు మాధవి అడిగింది. దీంతో శివ తన దగ్గర ఉన్న 20 లైక్స్ ఆమెకు ఇచ్చేశాడు. అంతే కాకుండా ఒకవేళ తాను ఎలిమినేషన్ అయ్యే పరిస్థితి వస్తే మొత్తం లైక్స్ ఇవ్వాల్సిందే అని యాంకర్ శివ డీల్ మాట్లాడుకున్నాడు. మరి ఈ దొంగతనం గురించి తెలిస్తే అరియానా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X