Bigg Boss Non Stop: షోలో షాకింగ్ సంఘటన.. అషుతో అతడు అసభ్యంగా.. మీద పడుకుని అక్కడ చెయ్యేసి!

చాలా అనుమానాలు.. మరెన్నో ఊహాగానాలు.. కొన్ని వివాదాల నడుమ మొదలైనా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులను తీసుకొస్తూ.. జనాలు మెచ్చే కంటెంట్‌ను మాత్రమే హైలైట్ చేస్తూ దీన్ని మరింత రంజుగా మారుస్తున్నారు. ఫలితంగా ఈ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ నడుస్తోంది. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా ప్రసారం అవుతోంది. దీనికితోడు ఇందులో బోల్డ్ కంటెంట్ కూడా బోలెడంత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో యాంకర్ శివ.. అషు రెడ్డితో అసభ్యంగా ప్రవర్తించాడు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

 నాన్ స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్

నాన్ స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్

ఆరంభం నుంచే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ గత నెలలో ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ అనుకున్న దాని కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తోంది.

 5 వారాల్లో... ఐదుగురు అవుట్

5 వారాల్లో... ఐదుగురు అవుట్


తాజా సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంటర్ అయ్యారు. వీళ్లలో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు బయటకు వెళ్లారు.

కంటెస్టెంట్లతో ఫ్యామిలీ టాస్క్

కంటెస్టెంట్లతో ఫ్యామిలీ టాస్క్

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులకు ఫ్యామిలీ టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం.. ఇంటి పెద్దగా నటరాజ్ మాస్టర్ తన కుటుంబాన్ని ఎంపిక చేసుకుని.. అసలు వాళ్లు ఎందుకు ఆ క్యారెక్టర్ చేయాలో వివరించాలి. అలా అందరినీ ఎంపిక చేసుకున్న తర్వాత ఫన్నీగా స్కిట్ చేయాలి అని బిగ్ బాస్ సూచించాడు. దీంతో ఆయన తనదైన కారణాలతో ఎంపిక చేసుకున్నాడు.

 నటరాజ్ ఫ్యామిలీ ఎవరంటే

నటరాజ్ ఫ్యామిలీ ఎవరంటే


నటరాజ్ మాస్టర్ తన భార్యగా ముమైత్‌ను ఎంపిక చేసుకున్నాడు. అలాగే.. అఖిల్ పెద్ద కొడుకుగా, బిందు మాధవి గయ్యాలి కోడలిగా సెలెక్ట్ చేశాడు. వీళ్లతో పాటు అజయ్‌ను చిన్న కొడుకుగా, అషురెడ్డిని పెద్ద కూతురుగా, హమీదాను చిన్న కూతురుగా, మహేష్ విట్టాను వంట మనిషిగా, స్రవంతిని చెల్లెలుగా, అనీల్‌ను స్రవంతి భర్తగా, బేవర్స్ కొడుకుగా శివను తీసుకున్నాడు.

రెచ్చిపోయిన యాంకర్ శివ

రెచ్చిపోయిన యాంకర్ శివ

ఫ్యామిలీ టాస్కులో అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. మరీ ముఖ్యంగా యాంకర్ శివ బేవార్స్ తాగుబోతు వాడిలా చాలా బాగా నటించాడు. తరచూ మధ్యలోకి వెళ్లి అందరితో గొడవ పడడం.. మరీ ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ లుంగీ పట్టుకుని లాగడం వంటి వాటిలో ఫన్ క్రియేట్ చేశాడు. ఈ పాత్ర 'బాద్‌షా' సినిమాలో బ్రహ్మానందం రోల్‌ను గుర్తు చేసేలా కనిపించింది.

అషు రెడ్డిని నలిపేసిన శివ

అషు రెడ్డిని నలిపేసిన శివ


ఈ టాస్కులో యాంకర్ శివకు అషు రెడ్డి భార్యగా నటించిందని ముందే చెప్పుకున్నాం. ఇక, తాగుబోతుగా నటించిన అతడు.. టాస్క్ అయ్యేంత వరకూ ఆమెను నలిపేశాడు. ఎప్పుడూ ఆమెను పట్టుకునే ఉండడం.. నడుము దగ్గర కౌగిలించుకోవడం వంటివి చేశాడు. దీనికి అషు రెడ్డి కూడా బాగానే కోపరేట్ చేసింది. అయితే, ఇంటి సభ్యులు మాత్రం వాళ్లను చూసి షాక్ అయ్యారు.

 మీద పడుకుని.. ఆ భాగంపై

మీద పడుకుని.. ఆ భాగంపై


తాగుబోతు భర్తగా నటించిన యాంకర్ శివ.. కొన్ని సందర్భాల్లో శృతి మించినట్లు కనిపించాడు. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఒళ్లో పడుకున్న అతడు.. ఆమె బ్యాక్ మీద చెయ్యేశాడు. దీంతో ఆమె వెంటనే అభ్యంతరం చెప్పింది. కానీ, అతడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మరింతగా రెచ్చిపోయాడు. టాస్క్ అయ్యాక కూడా పడుకునే ఉండడంతో అషు అరిచేసి వెళ్లిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X