Bigg Boss Non Stop: అషు రెడ్డి పరువు తీసిన కంటెస్టెంట్.. బయట అలా.. ఇంట్లో ఇలా అంటూ ఘోరంగా!

గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న షో బిగ్ బాస్. విచిత్రమైన టాస్కులు, విభిన్నమైన మనుషులు, ఎన్నో ఊహించని సంఘటనల సమాహారంగా నడిచే ఇది.. భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా ఇండియాలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే తెలుగు నిర్వహకులు ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్నారు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను కూడా ప్రారంభించారు. గతంలో మాదిరిగా కాకుండా ఇందులో బోల్డు బ్యూటీలకు ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆరియానా గ్లోరీ.. అషు రెడ్డి పరువు తీసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

మధ్యలో ఆపి మళ్లీ మొదలెట్టారు

మధ్యలో ఆపి మళ్లీ మొదలెట్టారు

భారీ అంచనాల నడుమ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. మధ్యలో ఒకరోజంతా లైవ్ ఆపేశారు. ఒకరోజు తర్వాత మళ్లీ స్టార్ట్ చేశారు.

ఎక్కువ వాళ్లనే తీసుకు వచ్చారు

ఎక్కువ వాళ్లనే తీసుకు వచ్చారు

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈసారి మాజీ, లేడీ కంటెస్టెంట్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

లైవ్ కావడంతో ఎక్కువగా అలా

లైవ్ కావడంతో ఎక్కువగా అలా

మామూలు బిగ్ బాస్ సీజన్లు బుల్లితెరపై ప్రసారం అయ్యేవి. అందులో 24 గంటల పాటు జరిగిన సంఘటనలను ఒక గంట మాత్రమే ప్రసారం చేసేవారు. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో దీనికి సెన్సార్ ఉండట్లేదు. ఫలితంగా ఇందులో ఎక్కువగా బోల్డు కంటెంటే కనిపిస్తోంది. దీంతో ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది.

వాళ్లిద్దరూ కలిసి రచ్చ చేస్తూనే

వాళ్లిద్దరూ కలిసి రచ్చ చేస్తూనే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు కొందరు హైలైట్ అవుతున్నారు. వారిలో అషు రెడ్డి, ఆరియానా గ్లోరీ మరింత స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. గతంలో బిగ్ బాస్‌లో కనిపించిన వీళ్లు.. ఇప్పుడు మరోసారి ఛాన్స్‌ను పట్టేశారు. ఇక, వీళ్లిద్దరూ బయట ఫ్రెండ్స్ కావడంతో.. హౌస్‌లోనూ కలిసే ఉంటున్నారు.

బూతులతో రెచ్చిపోతున్నారు

బూతులతో రెచ్చిపోతున్నారు

ఆరియానా గ్లోరి, అషు రెడ్డి ఎంత బోల్డుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మాయిలు అదే కంటిన్యూ చేస్తోన్నారు. గతంలో కంటే ఈ సారి ఆమె మరింతగా రెచ్చిపోతున్నారు. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. ముక్కుసూటిగా ఎఫైర్ల గురించి రివీల్ చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

అషు రెడ్డి పరువు తీసిన బ్యూటీ

అషు రెడ్డి పరువు తీసిన బ్యూటీ

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆరియానా గ్లోరీ, అషు రెడ్డి తమదైన శైలిలో సందడి చేశారు. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బాధతో ఏడుస్తున్న ముమైత్ ఖాన్‌ను చాలా సేపు ఓదార్చారు. ఆ తర్వాత అందరినీ నవ్వించేందుకు నానా తంటాలు పడ్డారు. ఆ సమయంలోనే ఆరియానా గ్లోరీ.. అషు రెడ్డిని ఇమిటేట్ చేసింది. ఇందులో ఆమె డ్రెస్‌ల గురించి మాట్లాడి పరువు తీసేసింది కూడా.

బయట అలా.. ఇంట్లో ఇలాగ

బయట అలా.. ఇంట్లో ఇలాగ

అషు రెడ్డిని ఆరియానా ఇమిటేట్ చేస్తూ.. ‘ఇది ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకుని ఇలా కూర్చుని బోళ్లు కడగాలా? బొచ్చెలు కడగాలా అని అడుగుతుంది. అదే బయట అయితే.. తొడల వరకూ డ్రెస్‌లు వేసుకుంటుంది. అక్కడ అంత బోల్డుగా ఉండి.. ఇప్పుడు పిచ్చిదానిలా మారింది. నిజంగా బిగ్ బాస్ మీరు చాలా గ్రేట్. ఇలాంటి వాళ్లను మార్చేస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X