Bigg Boss Non Stop: 9వ క్లాస్‌లోనే ఆరియానా తొలి అనుభవం.. ఒకే రూంలో కలిసి.. చూడకూడనిది చూశానంటూ!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని.. ఐదేళ్లుగా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ షో ఎంత సక్సెస్ అయిందో.. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా అంతే ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ ఆరియానా గ్లోరీ ఒకరు. హోస్టుగా ప్రపంచానికి పరిచయమైన ఆమె.. ఈ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను సంపాదించింది. అలాగే, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి వచ్చింది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి రివీల్ చేసేసింది. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్‌లోకి ఆరియానా రీఎంట్రీ
బిగ్ బాస్ షో ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుని.. వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతోన్న బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ.. తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరంభంలోనే అదిరిపోయే లుక్‌తో మరోసారి అందరి దృష్టినీ లాగేసింది. ఈ సారి మంచి గతంలో కంటే ఎక్కువ ఫాలోయింగ్‌తో ఈ భామ హౌస్‌లోకి అడుగెట్టింది.

గతంలో కంటే బోల్డుగా ఆరియానా
నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలే కంటెస్టెంట్లుగా వచ్చిన విషయం తెలిసిందే. అందులోనూ బోల్డ్ బ్యూటీలు చాలా మంది ఉన్నారు. వారిలో ఆరియానా గ్లోరీ మరింత స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. గతంలో బిగ్ బాస్‌లో మిస్సైనా హాట్‌నెస్‌ను ఇప్పుడు చూపిస్తోంది. అంతేకాదు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు మాట్లాడుతూ మరింత హల్‌చల్ చేస్తోంది.

తలుపు తట్టిన ప్రేమ అనే టాస్క్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇంట్లోని కంటెస్టెంట్లకు 'తలుపు తట్టిన ప్రేమ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి కంటెస్టెంట్ తన మొదటి ప్రేమ అనుభవం గురించి వెల్లడించాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఇంట్లోని వాళ్లందరూ తమ మొదటి ప్రేమ అనుభవాన్ని మిగిలిన వాళ్లతో పాటు ప్రేక్షకులతో పంచుకున్నారు.

9వ క్లాస్‌లోనే మొదటి అనుభవం
ఈ టాస్కులో భాగంగా ఆరియానా తన ప్రేమ అనుభవాన్ని వెల్లడించింది. 'తొమ్మిదో తరగతిలోనే నా లవ్ స్టోరీ మొదలైంది. టెన్త్‌లోకి వచ్చేసరికి సీరియస్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి డాడీ లేరు. సో అబ్బాయిలతో ఎలా ఉండాలో తెలియదు. ఆ అబ్బాయి నాతో మాట్లాడగానే ఆ కేరింగ్ బాగా నచ్చేది. తను విజయవాడ, నేను తాండూరులో ఉండేదాన్ని' అని చెప్పుకొచ్చింది.

బాగా డీప్ అయ్యాం.. వచ్చేశాను
ఆరియానా కంటిన్యూ చేస్తూ 'ఫోన్‌లో మాట్లాడుకుంటూ చాలా కాలం గడిచింది. ఆ తర్వాత ఇంటర్ అయ్యే సరికి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. అలా హైదరాబాద్‌లో మేమిద్దరం కలిశాం. ఒక సందర్భంలో ఇద్దరం కలిసున్నాం. మూడేళ్లు అలాగే ఉన్నాం. ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. ఆ సమయంలోనే చాలా డీప్‌గా ఉన్నాం.. చాలా కనెక్ట్ అయిపోయాం కూడా' అని వెల్లడించింది.

బోర్ కొట్టింది... అది చూసే సరికి
ఆరియానా మాట్లాడుతూ.. 'ఎంత కలుసున్నా బోర్ కొడతారు కదా. తను కూడా స్పేస్ కావాలని ప్రయత్నించేవాడు. ఒక రోజు నేను చూడకూడనిది ఒకటి చూశాను. అది చూసిన తర్వాత నేను కలలో కూడా అనుకోలేదు అక్కడ నా హార్ట్ అంత బ్రేక్ అవుతుందని. నేను ఏం చూశాను అనేది ప్రపంచానికి కూడా చెప్పుకోలేను. నా పరిస్థితి అలాంటిది' అంటూ కన్నీరు మున్నీరు అయింది.

నాపై అనుమానం పెరిగిందని
'అంత పని చేసినా రిక్వెస్ట్ చేయడంతో అతడితో కలిసున్నా. తర్వాత నేను ఆర్జేగా ట్రై చేస్తుండగా ఓ వ్యక్తం పరిచయం అయ్యాడు. దీంతో మా మీద అనుమానం పెరిగింది. దీంతో మా ఇద్దరికీ దూరం పెరిగింది. అప్పుడు అతడికి బ్రేకప్ చెప్పేశాను. కానీ, ఎందుకో అతడు కావాలని అనిపించింది. దీంతో అతడిని ఎంతగానో బ్రతిమాలినా అస్సలు వినలేదు' అని ఆరియానా చెప్పింది.

రాత్రి వాళ్ల ఇంటికి వెళ్తే అలాగ
'వాళ్ల అమ్మను కన్విన్స్ చేయడానికి పింక్ కలర్ పట్టు చీర తీసుకుని వెళ్లాను. మళ్లీ కలిస్తే ఫ్యామిలీ లైఫ్ మొదలవుతుందని ఆశపడ్డా. ఉదయం నాలుగు గంటలకే వాళ్ల ఇంటికి వెళ్లి తలుపు కొట్టాను.. మా బావ అప్పుడు డోర్ ఓపెన్ చేసి.. నన్ను అవమానించాడు. అలా నా లైఫ్‌లో మొదటి ప్రేమే విఫలమైంది. ఇప్పుడు తను వచ్చినా నాకొద్దు' అంటూ ఆరియానా వెక్కి వెక్కి ఏడ్చింది.


Click it and Unblock the Notifications











