Bigg Boss Non Stop : హౌస్ లోపలికి యంగ్ హీరో.. తీవ్రంగా అవమానించిన అరియానా గ్లోరీ ?
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి రెండు వారాలు పూర్తి కావస్తోంది. ఆదివారంనాడు హౌస్ లోకి అడుగుపెట్టనున్న నాగార్జున మరో వ్యక్తిని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా ఈ వారం మొత్తం 16 మంది సభ్యులు ఇంట్లో ఉన్నారు. అందులో 11 మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారు అనే సంగతి పక్కన పెడితే హౌస్ లో గెస్ట్ గా ఒక యంగ్ హీరో వచ్చారు. ఆ యంగ్ హీరోని అరియానా ఘోరంగా అవమానించిన విషయం ఇప్పుడు హైలెట్గా నిలిచింది. వివరాల్లోకి వెళితే..

స్టాండప్ రాహుల్
ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కూడా ఆయా వారాలలో సినిమా విడుదల ఏదైనా ఉంటే దాన్ని ప్రమోట్ చేసుకునేందుకు పలువురు సెలబ్రిటీలు హౌస్ లోపలికి వస్తూ ఉంటారు . ఈ వారం కూడా అలాగే హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇద్దరూ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ శుక్రవారం అంటే 18 వ తారీఖున ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినిమా ప్రమోషన్ చేసుకునేందుకు వారు లోపలికి వచ్చారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన స్టాండప్ రాహుల్ అనే సినిమాలో ఆయన సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.

స్టాండప్ కామెడీ
బిగ్బాస్ హౌస్ లోపలికి వచ్చి తమ సినిమాకి మెయిన్ కాన్సెప్ట్ అయిన స్టాండప్ కామెడీ చేయడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే ఒక సింగిల్ పర్సన్ ముందు జంట రొమాన్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఆ కాన్సెప్ట్ లో ముందుగా తేజస్వ, చైతు, అషు, అరియానా చేసి మెప్పించారు.

సిగ్గు పడి పోతూ
ఆ తర్వాత కూడా ప్రేమించిన అమ్మాయి ఇంట్లో తెలిసిపోతే ఎలా అనే ఒక కాన్సెప్ట్, తాగి పోలీసులకు పట్టుబడితే ఎలా అని ఇలా రకరకాల కాన్సెప్ట్ లు చేసి చూపించారు. అయితే రాజ్ తరుణ్ లోపలకి వచ్చినప్పటినుంచి అరియానా తెగ సిగ్గు పడి పోతూ ఉండటం కూడా గమనించవచ్చు. రాజ్ తరుణ్ వచ్చిన వెంటనే చైతూ అరియానా భుజం తట్టి మాట్లాడటం,

తెగ తాపత్రయ పడి
ఆ తర్వాత ఎవరో హీరోలు నీ పార్టీ వస్తున్నారట కదా అని ఒక డైలాగ్ వేయడంతో ఎవడ్రా ఆ హీరోలు అంటే రాజ్ తరుణ్ అని అనడం ఇలా మొత్తం మీద రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఉంది అని చెప్పుకోవడానికి తెగ తాపత్రయ పడింది అరియానా.

ఎపిసోడ్ చూస్తే కానీ
అయితే తాను వచ్చింది సినిమా ప్రమోషన్స్ కోసం కాబట్టి రాజ్ తరుణ్ ఎక్కడా కూడా తమ పాత పరిచయాలని బయట పెట్టే ప్రయత్నం చేయలేదు. మరి ఏమనుకుందో ఏమో కానీ చివరికి రెచ్చిపోయిన అరియానా ఇలా చేయడం ఏమాత్రం సరిగా లేదు నీకు బలిసిందా అంటూ రాజ్ తరుణ్ ను ప్రశ్నించింది. ఎందుకు హాయ్ చెప్పలేదు అని ప్రశ్నించగా హాయ్ చెప్పాను కదా అని రాజ్ తరుణ్ అంటాడు. అయితే ఇది ప్రోమో కోసమే చేసిన చట్టమా లేక నిజంగానే అరియానా వాస్తవంగా రాజ్ తరుణ్ మీద ఫైర్ అయిందా అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











