Bigg Boss Non Stop : చైతూ మీద అషు రెడ్డి సీరియస్.. లాజిక్ తీసి ప్రశ్నించడంతో మేమింతే అంటూ!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న షో నిదానంగా ఊపు అందుకుంటోంది. 24 గంటల సేపు ఈ షో ఎలా చూడాలి? అని ప్రేక్షకులు మొదట్లో పెద్దగా ఆసక్తి కనబరచలేదు కానీ రోజుకు రెండు ఎపిసోడ్స్ రిలీజ్ చేయడంతో వాటిని ఫాలో అవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి రెండు రోజుల్లోనే హౌస్ సభ్యుల నామినేషన్స్ కారణంగా వారంలోనే ఓ రేంజ్‌లో గొడవలు ప్రారంభమయ్యాయి. తాజాగా చైతూ అషు రెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

ఐదు వస్తువులు మాత్రమే
సీనియర్స్ గా ఉన్న వారియర్స్ టీంకి బిగ్ బాస్ షాకిచ్చాడు. ఇక మీదట హౌస్ లో ఎలాంటి బెనిఫిట్స్ కావాలి అనుకున్నా జూనియర్స్ అయిన ఛాలెంజర్స్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన విధంగా కొన్ని రూల్స్ పెట్టాడన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం కేవలం కొత్త కంటెస్టెంట్ లకు అంటే చాలెంజర్స్ కి మాత్రమే బెడ్రూం యాక్సెస్ పరిమితం చేశారు. ఛాలెంజర్స్ అనుమతి లభిస్తే వారియర్స్ లో ఒకరికి బెడ్రూంలో నిద్రపోయే అవకాశం ఇవ్వడానికి ఛాలెంజర్స్ కు హక్కులు ఇచ్చారు. అంతేకాక వారియర్స్ కు సంబంధించిన పూర్తి లగేజ్ కూడా ఛాలెంజర్స్ కంట్రోల్ లోకి వెళ్ళింది. లగేజ్ నుంచి ఒక్కొక్క వారియర్స్ ఐదు వస్తువులు మాత్రమే తీసుకోవాలి కానీ ఆ వస్తువులు తీసుకోవాలి అన్నా సరే ఛాలెంజర్స్ అనుమతి కావాల్సిందే.

దిండ్లు, దుప్పట్లు ఇవ్వకుండా
అయితే ఇప్పుడు అషు రెడ్డి ఈ విషయంలో ఇప్పుడు సహనాన్ని కోల్పోవాల్సి వచ్చింది. చైతూ ఛాలెంజర్స్ కు టీమ్ హెడ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వాష్ రూమ్ లో అషు రెడ్డి చైతుతో మాట్లాడుతూ బిగ్ బాస్ బిగ్ బాస్ దిండ్లు, దుప్పట్లు కూడా మీరు ఎందుకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించింది. బిగ్ బాస్ చెప్పిన విధంగా పర్సనల్ సామాన్లు మాత్రమే మీ కంట్రోల్ లోకి వెళ్తాయి అలాంటి సమయంలో మీరు ఎందుకు దిండ్లు, దుప్పట్లు ఇవ్వకుండా మమ్మల్ని ఆపుతున్నారు అంటూ ఆమె ప్రశ్నించింది.

ఇబ్బంది పెట్టాము
అయితే మీకు బెడ్ రూమ్ యాక్సెస్ లేదు కదా అని చైతు ప్రశ్నించాడు. బెడ్ రూమ్ లో పడుకోవడానికి అవకాశం లేదు కానీ అందులో ఉన్న దిండ్లు దుప్పట్లు వాడుకోవడానికి మాకు హక్కు ఉంది అని ఆమె పేర్కొంది. దానికి చైతు మాట్లాడుతూ సరే ఈరోజు రాత్రి అడగండి ఇస్తాము అని సమాధానం చెప్పాడు. దానికి ఆమె మాట్లాడుతూ అలా కాదు మీరు క్లారిటీ గా ఉండాలి అంటూ సమాధానం ఇచ్చింది. మరి మొదటి రెండు రోజులు ఎందుకు ఇబ్బంది పెట్టారు? మా టీంలో ఉన్న అఖిల్, ముమైత్ ఖాన్ వంటి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీరు అడగలేదు కాబట్టి మేము ఇబ్బంది పెట్టాము అని చెబుతూ చెప్పుకొచ్చాడు.

ఇచ్చే ప్రసక్తి లేదు
నువ్వు ఇప్పుడు ఎన్ని లాజిక్కులు మాట్లాడినా నీకు హెయిర్ స్ట్రెయిట్నర్ ఇవ్వడం అనేది కుదరదు అని చైతూ చెప్పాడు. నీకు రింగ్ కావాలి అంటే మాకు హెయిర్ స్ట్రెయిట్నర్ వాడుకునే అవకాశం ఇవ్వు అది వాడుకొని నీకే ఇచ్చేస్తాను అంటుంది. మా రింగ్ ప్లేస్ లో నీ వస్తువులు ఎన్ని పోతాయా నేను లెక్క వేయలేను అని చైతూ కూడా వార్నింగ్ ఇస్తాడు. స్ట్రెయిట్నర్ ఇవ్వాల్సిందే అని ఆమె అడగగా ఇచ్చే ప్రసక్తి లేదు అని చైతూ చెబుతాడు అయితే ఒక్కో దానికి ఒక్కో ఎందుకు పెడుతున్నారు? అని ప్రశ్నిస్తే మా ఇష్టం ఒక్కో దానికి ఒక్కో విధంగా రూల్ పెడతామని చైతూ చెబుతాడు.
Recommended Video

అషూ ఆవేదన
అలాగే అషూ ఉన్నప్పుడు వేరే విధమైన రూల్స్ కూడా పెడతాను అంటూ వెటకారంగా చెప్పుకొచ్చాడు. ఆమె అంటే మాకు ఇష్టం అందుకే అలా పెడతామని చెప్పుకొచ్చారు. ఇంతలో యాంకర్ శివ మాట్లాడుతూ అషూ అంటే మా అందరికీ ఇష్టం ఆమె కోప్పడినా, కో ప్పడినట్లు కనిపించదు. అంటే దానికి ఆమె మాట్లాడుతూ ఒక్కరోజు మీ అందరికీ ఈ ఫెసిలిటీస్ అన్ని కట్ చేస్తే అప్పుడు మీకు మా బాధ తెలుస్తుంది అని అంటుంది. ఒక రోజు స్నానం చేయకపోతే అప్పుడు ఉల్లిపాయ వాసన ఏమిటో కొత్తిమీర వాసన ఏమిటో అన్నీ తెలుస్తాయి అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











