Don't Miss!
- Sports
అందుకే ఉమ్రాన్‌ను పక్కనపెట్టి చాహల్‌ను తీసుకున్నాం: హార్దిక్ పాండ్యా
- News
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Non Stopలో అర్ధరాత్రి అరాచకాలు.. ఒకే దుప్పట్లో ఇద్దరు.. బూతులతో రెచ్చిపోయిన గాంగ్
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభమైన ఈ షో అప్పుడే రెండో వారానికి కూడా చేరింది. అయితే 18 ప్లస్ అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ ల బూతు మాటలకు హద్దు లేకుండా పోతోంది. 24 గంటలు స్ట్రీమింగ్ అని చెప్పి వాళ్ల రాత్రి పడుకునేటప్పుడు దృశ్యాలు కూడా చూపిస్తూ ఉండడంతో హౌస్ లో రకరకాల వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ దారుణంగా రాత్రి పడుకునే సమయంలో ఒకరినొకరు ఆట పట్టించుకునే నెపంతో చేస్తున్న కామెడీ వెగటు పుట్టిస్తోంది. తాజా స్ట్రీమింగ్ లో అషు రెడ్డి, యాంకర్ స్రవంతి, అజయ్, అఖిల్ హద్దుమీరి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే

ఎక్కడెక్కడో చేతులు, కాళ్లు వేసుకుని
ఎవరూ 24 గెట్ గంటల స్ట్రీమింగ్ చూస్తున్నారో లేదో తెలియదు కానీ చూస్తున్న వారికి మాత్రం కొన్ని దారుణమైన దృశ్యాలు కనబడుతున్నాయి. తాజా స్ట్రీమింగ్ లో స్రవంతి, అషురెడ్డి ఒకే బెడ్‌పై పడుకుని ఒకే దుప్పట్లోకి దూరి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అక్కడి దాకా ఫరవాలేదు కానీ.. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎక్కేస్తూ.. ఎక్కడెక్కడో చేతులు, కాళ్లు వేసుకుని.. ముచ్చట్లు చెప్పుకుంటూ అవి అందరికీ అర్థం అయ్యేవిధంగా రచ్చ చేయడం మొదలు పెట్టారు.

కవర్ చేసుకునే ప్రయత్నం
వాళ్ళు అలా చేస్తుంటే అజయ్ వచ్చి 'ఏయ్ మీరేందే ఒకే బెడ్ షీట్‌లో ఏం చేస్తున్నారు? అని అడగగా పక్కనే ఉన్న అఖిల్.. రాత్రి మా బెడ్ మీదికి ఎవరు వస్తారు అంటూ అడిగి షాకిచ్చాడు. ఏయ్ ఏంటిది అంటూ అషు రెడ్డి తెగ సిగ్గు పడిపోగా ఎవరు బెడ్‌పై కూర్చుని మాట్లాడతారా అని అడుగుతున్నా అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు అఖిల్.

బూతులకి పని చెప్పాడు
ఇంతలో స్రవంతి కూడా తగ్గకుండా ఒకపక్క అషు పడుకుంది.. ఇటువైపున ఖాళీగా ఉంది.. ఎవరైనా రండి అని పిలిచి షాకిచ్చింది. తరువాత అషురెడ్డి-స్రవంతి ఒకే బెడ్ షీట్‌లో ముసుగుతన్ని.. ఒకరి మీద ఒకరు పడుతూ లేస్తూ రచ్చ రేపారు. వాళ్ల దుప్పట్లో చేస్తున్న అంశాన్ని బయటనుంచి చూస్తూ అఖిల్, అజయ్‌లు ఎంజాయ్ చేస్తూ ఏయ్ ఏయ్ దుప్పట్లో ఏం జరుగుతుంది అని అఖిల్ అంటే.. వీళ్లకి పెళ్ళైతే అంటూ అజయ్ బూతులకి పని చెప్పాడు.

బెడ్ దగ్గరకు వెళ్ళి
బిగ్ బాస్ ఎడిటర్లు చూసినట్టున్నారు పాపం మ్యూట్ కూడా వేశారు. అషురెడ్డి, స్రవంతి దగ్గరకు వచ్చి ఇంతకీ మీరు దుప్పట్లో ఏం చేస్తున్నారు అంటూ ఆ దుప్పటిని లాగేయడంతో అషురెడ్డి.. అసలు నీకు కామన్‌సెన్స్ ఉందా? నేను ఏ డ్రెస్ వేసుకున్నానో తెలుసా? అని అడిగింది. ఆ తర్వాత అజయ్ తో ఓ రౌండ్ అటు పోయొద్దాం రా అని అషురెడ్డిని స్రవంతి లేపింది. అషురెడ్డి లేవకపోవడంతో.. స్రవంతి లేచి అఖిల్ బెడ్ దగ్గరకు వెళ్ళింది.

కొడుకు లాంటి వాడని
ఆ తరువాత అజయ్, అఖిల్ ఉన్న బెడ్ చుట్టూ తిరుగుతున్నా స్రవంతిపై ఘోరమైన డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేశారు అఖిల్, అజయ్‌లు. వాటిని తెగ ఎంజాయ్ చేసిన స్రవంతి ఆ తర్వాత అక్కడి నుంచి తన మంచం వద్దకు వెళ్ళింది. అఖిల్ తన కొడుకు లాంటి వాడని చెబుతోంది కానీ ఈ డబుల్ మీనింగ్ డైలాగులు వెగటు పుట్టిస్తున్నాయి.