Bigg Boss Non Stop: అర్ధరాత్రి ఊహించని పని చేసిన అషు రెడ్డి.. తొలిసారి ఆమె ఇలా కనిపించడంతో!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలో పరిచయం అయినదే బిగ్ బాస్. చాలా కాలం క్రితమే హిందీలోకి వచ్చిన ఈ రియాలిటీ షో.. ఐదేళ్ల ముందే తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఎన్నో అనుమానాలతో వచ్చినా.. మన దగ్గర ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుని సూపర్ సక్సెస్ అయింది. దీంతో గతంలో ఏ షోకూ రాని రేటింగ్‌‌ను అందుకుంది. అంతేకాదు, ఇలా ఇండియాలోనే నెంబర్ వన్ షోగా పేరు తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు 'బిగ్ బాస్ నాన్ స్టాప్' పేరుతో ఓటీటీ సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో మాజీ కంటెస్టెంట్ అషు రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆమె ఊహించని పని చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

 మార్పులతో వస్తున్న బిగ్ బాస్

మార్పులతో వస్తున్న బిగ్ బాస్

ఎంతో ప్రయోగాత్మకంగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఫిబ్రవరి 26న వైభవంగా మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కాబోతుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఒకరోజంతా లైవ్ ఆపేసి మళ్లీ మొదలు పెట్టారు.

వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి

వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి


గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో ఆడవాళ్లు, మాజీలు ఎక్కువగా ఉన్నారు.

 సెన్సార్ లేకపోవడంతో రచ్చ

సెన్సార్ లేకపోవడంతో రచ్చ

రెగ్యూలర్ బిగ్ బాస్ సీజన్లు బుల్లితెరపై ప్రసారం అయ్యేవి. అందులో రోజంతా జరిగిన సంఘటనలను గంట మాత్రమే చూపించేవారు. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో దీనికి సెన్సార్ అవసరం పడడం లేదు. ఫలితంగా ఇందులో ఎక్కువగా బోల్డు కంటెంటే కనిపిస్తోంది. ఫలితంగా ఇది రచ్చ లేపుతోంది.

 ఆమె స్పెషల్ కంటెస్టెంటుగా

ఆమె స్పెషల్ కంటెస్టెంటుగా


ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలు కనిపిస్తున్నారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు తెగ సందడి చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. మూడో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం ఆమె చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది.

బూతులు.. బోల్డుగా.. సందడి

బూతులు.. బోల్డుగా.. సందడి

సాధారణంగా అషు రెడ్డి ఎంత బోల్డుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మడు అదే కంటిన్యూ చేస్తోంది. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. ముక్కుసూటిగా ఎఫైర్ల గురించి రివీల్ చేయడం వంటివి చేస్తోంది. ఫలితంగా అషు ఈ సీజన్‌లో తెగ సందడి చేస్తూ హైలైట్ అవుతోంది.

ఒంటరిని చేసిన సహచరులు

ఒంటరిని చేసిన సహచరులు


ఈ సీజన్‌లో హౌస్‌కు అయ్యే మొట్టమొదటి కెప్టెన్ కోసం పోటీదారులను ఎంచుకునేందుకు బిగ్ బాస్ పలు రకాల టాస్కులు ఇచ్చాడు. ఇందులో వారియర్స్ టీమ్ నుంచి కొందరు సెలెక్ట్ అయ్యారు. ఇక, మూడో రౌండ్‌లో కూడా ఈ జట్టే విజయం సాధించింది. ఇందులో అషు రెడ్డి చక్కగా ఆడినా.. ఇద్దరు మాత్రమే ఆమె ఓట్ చేశారు. దీంతో ఆమె గొడవ పెట్టుకుని వచ్చేసింది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
 తొలిసారి అలా చేసిన అషు

తొలిసారి అలా చేసిన అషు


తనను కెప్టెన్సీ కంటెండర్‌గా సెలెక్ట్ చేయకపోవడంతో అషు రెడ్డి చాలా బాధ పడింది. ఒక సమయంలో తేజస్వీతో గొడవ పెట్టుకున్న ఆమె.. అర్ధరాత్రి బెడ్‌పై పడుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. బిగ్ బాస్ షోలో ఆమె తొలిసారి ఇలా ఏడవడంతో ఫ్యాన్స్ అంతా దిగులు చెందుతున్నారు. ఈ మేరకు ఆమెకు అనుకూలంగా పోస్టులు చేస్తూ.. మిగిలిన వాళ్లపై విమర్శలను గుప్పిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X