Bigg Boss Non Stop: ఆ సీజన్‌లో మోనాల్‌ను ఈ సీజన్‌లో మరొకరిని.. అఖిల్ పరువు తీసేసిన అషు రెడ్డి

బిగ్ బాస్ టెలివిజన్ షోలో రేటింగ్స్ ఏ స్థాయిలో అందుకుందో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా అదే తరహాలో ప్రేక్షకుల ఆదరణను అందుకోవాలి అని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటాపోటీగా వారి బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే జనాలు కూడా కంటెస్టెంట్స్ తో అభిమానులుగా మారుతున్నారు. ఇక కంటెస్టెంట్స్ అయితే ఏదైనా గొడవ జరిగితే మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక అఖిల్ సార్ధక్ ఎప్పటిలానే మోనల్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అయితే అషు రెడ్డి తన పరువు తీసే విధంగా మాట్లాడేసింది.. ఆ వివరాల్లోకి వెళితే..

 ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వచ్చాడో..

ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వచ్చాడో..

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో లవర్ బాయ్ గా క్రేజ్ అందుకునే ప్రయత్నం చేశాడు అఖిల్ సార్ధక్. అంతకు ముందు వరకు అతని పేరు జనాలకు ఎక్కువగా తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వచ్చాడో అప్పుడే అతనికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. కానీ ఆ క్రేజ్ మాత్రం అఖిల్ బయటకు వచ్చిన తర్వాత అంతగా యూజ్ చేసుకోలేకపోయాడు. సినిమా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ ఓటీటీ లోకి అడుగు పెట్టాల్సిన అవసరం వచ్చింది.

ఈసారి ఏ మాత్రం తగ్గకుండా..

ఈసారి ఏ మాత్రం తగ్గకుండా..

అఖిల్ సార్ధక్ ఈసారి ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాడు. నాలుగు సీజన్లలో అతను ఒక్క అడుగు దూరంలో టైటిల్ కు దూరమైన విషయం తెలిసిందే. అతనికి పోటీగా వచ్చిన యువ హీరో అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి మాత్రం అఖిల్ ఎంతమంది పోటీగా వచ్చినా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో ముందుకు సాగాలి అని అనుకుంటున్నాడు.

అదే పెద్ద మైనస్

అదే పెద్ద మైనస్

గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు ఏ మాత్రం చేయకూడదు అని అఖిల్ చాలా గట్టిగా ఉన్నప్పటికీ అతని వీక్నెస్ పాయింట్ మీద చాలా మంది దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. గతంలో అతనికి మోనల్ గజ్జర్ మధ్యలో జరిగిన వ్యవహారాల్లో చాలా మైనస్ అని చెప్పాలి. ఆమెను పదే పదే ఏడిపించడం కూడా నెగిటివ్ కామెంట్స్ ను అందించింది. ఒక విధంగా మోనల్ కూడా ఎంత ఎడిపించినా కూడా అతనితోనే ఉండడం ఆమెకు కూడా మైనస్ అయ్యింది. ఇక వారి మధ్యలో కాస్త మోసపోయిన అభిజిత్ కు ప్రేక్షకుల నుంచి మద్దతు లభించి టైటిల్ విన్నర్ అయ్యేవరకు తీసుకువచ్చింది.

సిగరెట్ తాగుతూ..

సిగరెట్ తాగుతూ..

ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అఖిల్ సార్ధక్ సీజన్లో మాత్రం టైటిల్ విన్నర్ గా నిలవాలని చూస్తుండగా మళ్ళీ గతంలో జరిగిన పొరపాట్లను మిగతా కంటెస్టెంట్ గుర్తు చేస్తూ ఉండడం విశేషం. రీసెంట్ గా ముమైత్ ఖాన్ అఖిల్ కాస్త దూరం అవుతున్నాడు అని సిగరెట్ తాగుతూ చెప్పింది.

ఆ మాటలకు మాడిపోయిన అఖిల్ ఫేస్

ఆ మాటలకు మాడిపోయిన అఖిల్ ఫేస్

ఇక ముమైత్ ఖాన్ అలా చెప్పగానే అషు రెడ్డి తన మాటలను అందుకొని గత సీజన్లో మోనల్ ను ఏడిపించి మళ్లీ ఇప్పుడు ఇంకొకరిని ఏడిపిస్తున్నాడు అంటూ కామెంట్ చేసింది. ఇక పక్కనే ఉన్న యాంకర్ శివ కూడా అవునవును అంటూ మరొక కౌంటర్ ఇచ్చాడు. ఇక వీరి మాటలకు అఖిల్ ఫేస్ ఒక్కసారిగా మాడిపోయినట్లు అయింది.

హార్ట్ అయిన అఖిల్

హార్ట్ అయిన అఖిల్

ఆ తర్వాత అషు రెడ్డి కావాలని అనలేదు అని కేవలం అలా ప్రాస కోసం వాడాను అని చెప్పసాగింది. ఇక ఆమె మాటలు విన్నట్లే విని అఖిల్ అక్కడే వదిలేశాడు. ఆ తర్వాత శ్రావణి దగ్గరికి వెళ్లి మళ్ళీ మళ్ళీ అందరూ మోనల్ పేరు ఎందుకు గుర్తు చేస్తున్నారో అర్థం కావడం లేదు అని నేను ఆ సీజన్లో సాహెల్ తో కూడా చాలా క్లోజ్ గా ఉన్నాను అయినప్పటికీ వాళ్ల పేరు తీయకుండా మోనల్ పేరు మాత్రమే గుర్తు చేస్తున్నారని అన్నాడు. ఇక శ్రావణి కూడా ఆ విషయం గుర్తు పెట్టుకో అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X